breaking news
CII Southern
-
ఓటీటీ .. పరిశ్రమ సూపర్ హిట్.. ఆదాయంలో దక్షిణాది సినిమాల జోరు!
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ విలువ రూ.10,000 కోట్లుగా ఉంటే, 2030 నాటికి రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024 మార్చి నాటికి రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని, ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఐఎన్10మీడియా సీవోవో, సీఐఐ దక్షిణ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడైన అనూప్ చంద్రశేఖరన్ తెలిపారు. ఓటీటీ పరిశ్రమపై చెన్నైలో దక్షిణాది మీడియా, ఎంటర్టైన్మెంట్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఐఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న వాటితో పోలిస్తే.. వచ్చే 12 నెలల్లో దక్షిణాది భాషల్లో పెద్ద సంఖ్యలో వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి’’అని స్టార్/డిస్నీ ఇండియా బిజినెస్ హెడ్ కృష్ణన్ కుట్టి తెలిపారు. దక్షిణాది సినిమాల జోరు దేశం మొత్తం మీద దక్షిణాది సినిమాలు అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. 2022లో దక్షిణాది సినిమాలు రూ.7,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది ఆదాయంతో పోలిస్తే రెట్టింపు అయింది. అంతేకాదు గతేడాది దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఆదాయంలో దక్షిణాది సినిమాల వాటాయే 50 శాతంగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను సీఐఐ దక్షిణాది విభాగం రూపొందించిన నివేదికలో పేర్కొంది. ‘తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో కూడిన దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆదాయం 2022లో రూ.7,836 కోట్లుగా ఉంది. 2021లో ఆదాయం రూ.3,988 కోట్టే. 2022లో మొత్తం భారత సినీ పరిశ్రమ ఆదాయం రూ.15,000 కోట్లు. దక్షిణాదిలోనూ తమిళ సినిమా రూ.2,950 కోట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.2,500 కోట్లతో తెలుగు సినీ పరిశ్రమ ఉంటే, కన్నడ పరిశ్రమ ఆదాయం రూ.1,570 కోట్లు, మలయాళ పరిశ్రమ ఆదాయం రూ.816 కోట్లు. ముఖ్యంగా కన్నడ నాట కేజీఎఫ్:చాప్టర్ 1, కాంతార సినిమాలు బంపర్ వసూళ్లతో పరిశ్రమ రూపాన్ని మార్చేశాయి’అని నివేదిక తెలిపింది. మలయాళ పరిశ్రమ స్థానికంగా, విదేశాల్లోనూ ఆదాయాన్ని పెంచుకుంది. దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కటే రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ విక్రమ్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలు తమిళనాట ఆదాయాన్ని పెంచాయి. 2022 లో దక్షిణాదిన 916 సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్, ఓటీటీలో విడుదలైనవీ ఇందులో ఉన్నాయి. కంటెంట్‌కు డిమాండ్ స్క్రిప్ట్‌ను అందించేందుకు తాము ఒక నెల సమయం తీసుకుంటున్నామని అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సహ వ్యవస్థాపకుడు అజిత్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఏటా వివిధ ప్లాట్‌ఫామ్‌ల కోసం 60 ఒరిజినల్స్ అవసరం ఉంటోందన్నారు. నిర్మాతలు దీన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ‘‘తమిళం, తెలుగు ఓటీటీపైనే జీ ఓటీటీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ ఓటీటీ మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. మలయాళం ఓటీటీ పరిశ్రమకు కావాల్సిన కంటెంట్‌ను ప్రస్తుతం నిర్మాతలు అందించే స్థితిలో ఉన్నారు’’అని జీ5 ఓటీటీ చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్ వివరించారు. -
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీ
చైనా దెబ్బతినడంతో ప్రపంచం మన వైపు చూస్తోంది: సీఎం సాక్షి, అమరావతి : తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్)లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా తయారు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలో జరిగిన సీఐఐ సదరన్ రీజియన్ కౌన్సిల్ అంతర్గత సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో తయారీ రంగంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, దీన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్, ఐవోటీ వంటి రంగాల్లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు వీటికి సంబంధించి విలువ ఆథారిత పరిశ్రమలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం సీఐఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయాడానికి స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఐ దక్షిణ రీజియన్ చైర్మన్ రమేష్ దాట్ల, సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శివకుమార్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 60 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కృష్ణా రివర్‌ఫ్రంట్ అభివృద్ధి: ప్రకాశం బ్యారేజీకి ఎగువన రాజధాని వైపు 32 కిలోమీటర్ల మేర కృష్ణా రివర్ ఫ్రంట్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి డిజైన్లు రూపొందించాలని సూచించారు. శనివారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. పట్టువస్త్రాలు సమర్పించిన బాబు దంపతులు విజయవాడలో రోజూ పండుగ వాతావరణ కనపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వచ్చే డిసెంబర్లో విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాలని యోచిస్తున్నామని ప్రకటించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీకనకదుర్గమ్మ వారు శనివారం శ్రీసరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శనివారం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, లాంఛనాలు సమర్పించారు.