-
మహారాష్ట్ర మంత్రిగా మళ్లీ అతడు.. బీజేపీ మండిపాటు
ముంబై: చాలరోజుల సస్పెన్స్ తర్వాత ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్‌ల మంత్రివర్గం మహారాష్ట్రలో కొలువు దీరింది. అయితే ఈ కేబినెట్ ప్రమాణ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్త కేబినెట్లోని సేన రెబల్ ఎమ్మెల్యే ఒకరి వల్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తితో పాటు ఆగ్రహామూ వ్యక్తం అవుతోంది. సంజయ్ రాథోడ్.. యావత్మల్ జిల్లా దిగ్రాస్ నిజయోకవర్గపు ఎమ్మెల్యే. షిండే క్యాంప్‌లోని ఓ కీలక ఎమ్మెల్యే. ఇవాళ మంత్రిగా ప్రమాణం చేశాడు. అయితే ఆయన గతంలోనూ మంత్రిగా పని చేసి.. పదవి ఊడగొట్టుకున్నాడు. సంజయ్ రాథోడ్.. ఇంతకు ముందు ఉద్దవ్ థాక్రే కేబినెట్లో అటవీ శాఖ మంత్రి. ఓ మహిళతో సంబంధం నడిపి.. ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పాడనే ఆరోపణలు బలంగా వచ్చాయి. పైగా అతనికి శిక్షపడాలని గట్టిగా పోరాటం చేసింది బీజేపీనే. ఈ క్రమంలో.. ఆనాడు ఉద్దవ్ థాక్రే, సంజయ్‌తో బలవంతంగా రాజీనామా చేయించాడు. కట్ చేస్తే.. ఇవాళ మంత్రివర్గ ప్రమాణంలో అతనూ పాల్గొన్నాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాగ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర స్పందిస్తూ.. సంజయ్ రాథోడ్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కడం దురదృష్టకరం. ఓ మహారాష్ట్ర బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు అతను. అతనికి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుందని అని ఆమె ప్రకటించారు. पुजा चव्हाण च्या मृत्युला कारणीभूत असणार्या माजी मंत्री संजय राठोड ला पुन्हा मंत्रीपद दिलं जाणं हे अत्यंत दुदैवी आहे संजय राठोड जरी पुन्हा मंत्री झालेला असला तरीही त्याच्या विरुद्धचा माझा लढा मी सुरूचं ठेवलेला आहे माझा न्याय देवतेवर विश्वास लडेंगे….जितेंगे 👍 @CMOMaharashtra pic.twitter.com/epJCMpvHLB — Chitra Kishor Wagh (@ChitraKWagh) August 9, 2022 టిక్‌టాక్ స్టార్ పూజా చవాన్‌తో సంజయ్ రాథోడ్ రిలేషన్షిప్ నడిపించాడు. అయితే వాళ్ల సంబంధం బెడిసి కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ కేసులో ఆమెకు అరెస్ట్‌చేయాలంటూ బీజేపీ నిరసనగళం గట్టిగా వినిపించింది. అందులో ఇవాళ రాథోడ్‌తో ప్రమాణం చేసిన కిరీట్ సోమయ్య సైతం ఉండడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. గతంలో సంజయ్ రాథోడ్‌ను గద్దె దించే పోరాటంలో ముందున్న దేవేంద్ర ఫడ్నవిస్.. సమక్షంలోనే సంజయ్ రాథోడ్ మంత్రిగా ప్రమాణం చేయడం మరో హైలైట్. మరోవైపు షిండే సైతం రాథోడ్‌ను గత కొంతకాలంగా వెనకేసుకొస్తున్నాడు. పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ఇచ్చారనే విషయాన్ని పదేపదే మీడియా ముందు గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి బెర్త్ దక్కుతుందన్న ఊహాగానాలే నిజం అయ్యాయి. పూజా చవాన్ కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కిందటి ఏడాది అగష్టులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తూనే ఉంది. ఇదీ చదవండి: కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు? -
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై నిరసన
సాక్షి, ముంబై : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ముంబైలో పెను దుమారం లేచింది. ఎన్సీపీ ముంబై మహిళా శాఖ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో నిర్భయ సంఘటన ఓ చిన్నదని, దీన్ని ప్రపంచమంతా ప్రచారం చేయడం వల్ల పర్యాటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ ముంబై మహిళ శాఖ అధ్యక్షురాలు చిత్ర వాఘ్ తీవ్రంగా ఖండించారు. అరుణ్ జైట్లీ వెంటనే రాజీనామా చేయడంతోపాటు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో థియేటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆజాద్మైదానం వరకు కొనసాగింది. ‘నేను అరుణ్ జైట్లీని’ అనే బోర్డు తగిలించి ఉన్న ఎద్దును ర్యాలీ ముందు భాగంలో నడిపించారు. అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. మహిళల గౌరవం కంటే పర్యాటక రంగం గొప్పదా..? అరుణ్ జైట్లీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. మహిళపై జరుగుతున్న అత్యాచారాలను మంత్రి చులకనగా మాట్లాడడం తగదని హితవుపలికారు. మహిళలపై న రేంద్ర మోడీ ప్రభుత్వం వైఖరి ఏమిటో జైట్లీ వ్యాఖ్యలతో స్పష్టమైందని చెప్పారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్‌తో 'సలార్' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- 'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
Advertisement