నటుడు నారాయణమూర్తి తండ్రి మృతి
కాకినాడ (రౌతులపూడి) : సినీనటుడు ఆర్.నారాయణమూర్తి తండ్రి చిన్నయ్యనాయుడు(97) బుధవారం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్.పైడిపాల శివారు మల్లంపేటలోని స్వగృహంలో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య చిట్టెమ్మ, నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రౌతులపూడి మండల సాధకుడు, రెడ్డి బుల్లబ్బాయి ప్రథమ కుమారుడు, ద్వితీయ కుమారుడు సినీనటుడు ఆర్.నారాయణమూర్తితో కలసి బంధువులు దహనసంస్కారాలు జరిపారు.