breaking news
child case
-
కోరుట్ల చిన్నారి కేసులో బిగ్ ట్విస్ట్... సొంత పిన్నే..!
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పాప సొంత పిన్నే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న(శనివారం) సాయంత్రం సమయంలో హితీక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యమవగా.. పాప తల్లీ నవీన పోలీస్ ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన పాప తండ్రి రాములు.. హుటాహుటీన అక్కడా నుంచి బయలుదేరారు. పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హితీక్ష కుటుంబసభ్యుల్లో కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా అనుమానిస్తున్నారు. సిసీ టీవీ, సెల్‌ఫోన్ లోకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 40 మందిని పోలీసులు విచారించారు.శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది.సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్‌గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్నదమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం.విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
మలుపులు తిరుగుతున్న శిశువు కథ
సాక్షి, జగిత్యాల(కరీంనగర్) : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పసికందు విక్రయానికి సిద్ధపడ్డ ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతి మహారాష్ట్రకు చెందిన నవీన్ దంపతులు. ఇద్దరు ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి కూతురు నక్షత్ర ఉంది. నవీన్ విడిచిపెట్టి పోవడంతో జ్యోతి భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతోంది. కాగా నెల రోజులు నిండని పసికందును రూ.20 వేలకు అమ్మడానికి సిద్ధపడుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులకు అప్పగించారు. జ్యోతి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. శిశువును కరీంనగర్‌లోని శిశుగృహకు తరలించారు. గంగ జ్యోతి, నక్షత్రను స్వధార్‌హోమ్‌కు తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. ఈక్రమంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత పాప కనిపించడం లేదని ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మెట్పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా ఆర్మూర్ పోలీసులు డీఎన్ఏ పరీక్షల కోసం శిశువును తరలించారు. పరారీలో గంగజ్యోతి.? ఒకవైపు ఆర్మూర్ పోలీసులు శిశువును డీఎన్ఏ పరీక్షలకు పంపగా.. ఇంతలోనే గంగజ్యోతి కరీంనగర్‌లోని స్వధార్‌హోమ్ నుంచి ఐదు రోజుల క్రితం పరారైనట్లు తెలిసింది. దీంతో గంగజ్యోతి పాపను కిడ్నాప్ చేసి అమ్మకానికి పెట్టినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. తన కూతురు నక్షత్రను స్వధార్‌హోమ్‌లోనే ఉంచి పారిపోయింది. ఆ మె కోసం వెతుకుతున్నారు. ఒకవేళ డీఎన్ఏ రిపో ర్ట్ వచ్చినా గంగజ్యోతి దొరికితే గానీ విషయం బ యటకు పొక్కదు. పరారీ సంఘటనపై సైతం వి చారణ కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
గుర్తు తెలియని చిన్నారి లభ్యం
సంచిలో తరలిస్తూ వదలివెళ్లిన దుండగులు అక్కున చేర్చుకున్న ప్రయాణికులు కేసు నమోదు చేసిన పోలీసులు తొండంగి : చిన్నారిని ఒక సంచిలో తరలించుకుపోతున్న క్రమంలో రోడ్డుపై ప్రయాణికులు గుర్తించి ఎవరది అని గద్దించడంతో సంచిని అక్కడే వదిలేసి పరారైన ఘటన గురువారం రాత్రి ఎ.కొత్తపల్లి రైల్వే గేటు రహదారిలో చోటుచేసుకుంది. అన్నవరం గ్రామానికి చెందిన గంపల అప్పన్న తన బావమరిది రాజు గురువారం పెరుమాళ్లపురం వెళ్లారు. రాత్రి పదిన్నర గంటలకు బైక్‌పై తిరిగి వస్తుండగా గోపాలపట్నం రైల్వేగేటు వేసి ఉంది. దీంతో అక్కడ ఆగిన అతనికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ పొలాల్లో నక్కి ఉండడాన్ని గమనించిన అప్పన్న ఎవరది అని ప్రశ్నించగా చేతిలో ఉన్న ప్లాస్టిక్ గోనె సంచిని వదిలేసి వెళ్లారు. వారు వదిలేసిన సంచిలో నుంచి చిన్నారి బయటకు రావడంతో అవాక్కైన అప్పన్న వెంటనే పిల్లను ఎత్తుకున్నాడు. మూడేళ్ల వయసున్న చిన్నారి అమ్మ పొయింది, నాన్నపోయింది అన్నమాటలు తప్ప ఇతర వివరాలు చెప్పలేక పోతున్నదని అప్పన్న తెలిపాడు. తన బావమరిది రాజుకు ఆమె చాలా చేరువైందని తెలిపాడు. ఈ విషయమె శుక్రవారం అన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చామని అప్పన్న వివరించాడు. చిన్నారి బంధువులు ఎవరైనా వస్తే పోలీసుల ద్వారా అప్పగిస్తామని వివరాలకు తన సెల్: 81870 77795 గానీ, అన్నవరం పోలీసులను సంప్రదించాలన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.