breaking news
chess team
-
మీ ప్రదర్శన అద్భుతం
న్యూఢిల్లీ: బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన భారత చాంపియన్ గ్రాండ్‌మాస్టర్లు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో పసిడి పతకాలు సాధించి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన పురుషులు, మహిళల జట్లను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. అందరితోనూ చనువుగా మాట్లాడిన మోదీ వారి ప్రదర్శనను ఆకాశానికెత్తారు. మహిళా గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, మూడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్, ఆర్.ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతిలతో ప్రధాని ముచ్చటించారు. 11 గేమ్లకుగాను 10 గేముల్లో గెలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన దొమ్మరాజు గుకేశ్‌ను మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానందలతో కలిసి మోదీ గేమ్ ఆడారు. అనంతరం విజేత సభ్యులంతా కలిసి తమ ఆటోగ్రాఫ్‌లతో కూడిన చెస్ బోర్డును ప్రధానికి అందజేశారు. ప్లేయర్లతో ప్రధాని ముఖా ముఖీ వీడియోను క్రీడాశాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డిఫెండింగ్ టైటిల్‌ను వదిలేసి... ప్రధానితో ప్రత్యేక భేటీలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకోరాదనే ఉద్దేశంతో విదిత్ సంతోష్ గుజరాతి అజర్బైజాన్ టోర్నీ నుంచి వైదొలగి హుటాహుటిన ఢిల్లీకి తిరిగొచ్చాడు. గతేడాది బాకులో జరిగిన వుగార్ గాషిమోవ్ మెమోరియల్ చెస్ సూపర్ టోర్నమెంట్లో విదిత్ విజేతగా నిలిచాడు. టైటిల్ నిలబెట్టుకునేందుకు బాకు చేరుకున్న అతనికి ప్రధాని భేటీకి సంబంధించిన సమాచారం వచ్చింది. దీంతో ఉన్నపళంగా డిఫెండింగ్ చాంపియన్íÙప్ను వదిలేసి ఢిల్లీకి పయనమై కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఏఐసీఎఫ్ నజరానా రూ. 3 కోట్ల 20 లక్షలు చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్లకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) రూ. 3 కోట్ల 20 లక్షలు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. భారత పురుషుల జట్టులోని ఐదుగురికి రూ. 25 లక్షల చొప్పున.... భారత మహిళల జట్టులోని ఐదుగురికి రూ. 25 లక్షల చొప్పున నజరానా అందజేస్తామని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు నితిన్ నారంగ్ ప్రకటించారు.పురుషుల జట్టు కోచ్, కెప్టెన్ శ్రీనాథ్ నారాయణన్‌కు, మహిళల జట్టు కోచ్, కెప్టెన్ అభిజిత్ కుంతేకు రూ. 15 లక్షల చొప్పున ఇస్తారు. భారత బృందం చీఫ్ దివ్యేందు బారువాకు రూ. 10 లక్షలు, అసిస్టెంట్ కోచ్‌లకు రూ. 7 లక్షల 50 వేల చొప్పున లభిస్తాయి. -
ఉత్తమ మహిళా చెస్ జట్టుగా భారత్
అబుదాబి: ఆసియా చెస్ సమాఖ్య (ఏసీఎఫ్) 2022 వార్షిక అవార్డులను ప్రకటించారు. ఉత్తమ మహిళా చెస్ జట్టుగా భారత్‌కు పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణ వల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత జట్టు గత ఏడాది సొంతగడ్డపై తొలిసారి జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ప్రదర్శనకుగాను ఏసీఎఫ్ ఉత్తమ జట్టు అవార్డు హంపి బృందానికి దక్కింది. భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం గెల్చుకున్నాడు. గత చెస్ ఒలింపియాడ్‌లో తమిళనాడుకు చెందిన గుకేశ్ అత్యధికంగా తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. గత ఏడాది మార్చిలో గుకేశ్ 2700 ఎలో రేటింగ్‌ను దాటి ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ చెస్ ప్లేయర్‌గా నిలిచాడు. -
హెచ్‌పీసీఎల్ చెస్‌కు విజయేంద్ర
సాక్షి, హైదరాబాద్: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చెస్ జట్టుకు విజయేంద్ర కుమార్, రాహుల్ గుప్తా ఎంపికయ్యారు. వీరితో పాటు మరో ఇద్దరు అజిత్, గోలప్ దాస్‌లు కూడా నగరం నుంచి అర్హత సాధించారు. హైటెక్ సిటీలోని హెచ్‌పీసీఎల్ బిల్డింగ్‌లో గురువారం నిర్వహించిన సెలక్షన్ టోర్నమెంట్లో విజయేంద్ర ఏడు రౌండ్లకు గాను 6.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ సెలక్షన్ టోర్నీలో రాహుల్ గుప్తా కూడా ఆరున్నర పాయింట్లు సాధించినప్పటికీ ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అజిత్ (5), గోలప్ దాస్ (4)లు వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందారు. వీరంతా జాతీయ స్థాయిలో జరిగే ఆలిండియా హెచ్‌పీసీఎల్ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. ఈ టోర్నీ ఈ నెల 23, 24 తేదీల్లో మంగళూరు (కర్ణాటక)లో జరగనుంది.