chennai star cricket
-
IPL 2025: సీఎస్కే జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు..
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. వరుస ఓటములతో మరో మూడు మ్యాచ్‌లు మిగిలూండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించింది. అయితే మిగిలిన మూడు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ పరువు కాపాడుకోవాలని సీఎస్కే భావిస్తోంది.సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో మే 7న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల అన్క్యాప్డ్ వికెట్ కీపర్-బ్యాటర్ వన్ష్ బేడీ చీలమండ గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు దూరమయ్యాడు. అతడి స్దానంలో బరోడా బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను చెన్నై తమ జట్టులోకి తీసుకుంది. "ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు వన్ష్ బేడీ దూరమయ్యాడు. అతడి స్దానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉర్విల్ పటేల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది" అని ఐపీఎల్ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.26 ఏళ్ల ఉర్విల్ పటేల్‌కు టీ20 క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి పటేల్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. అదే టోర్నీలో ఉత్తరాఖండ్‌పై కూడా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఉర్విల్ పటేల్‌తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఉర్విల్.. 47 టీ20 మ్యాచ్‌లు ఆడి 170 స్ట్రైక్ రేట్‌తో 1162 పరుగులు చేశాడు. -
చెన్నైలో స్టార్ క్రికెట్ సందడి
ఫైనల్లో సూర్య జట్టు గెలుపు చెన్నై: క్రికెట్ మైదానంలో దక్షిణ భారత సినిమా స్టార్లు తళుక్కుమన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో చెన్నైలో ఆదివారం స్టార్స్ క్రికెట్ నిర్వహించారు. ఇక్కడి చెపాక్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన మ్యాచ్‌లకు దక్షిణాది రాష్ట్రాల నుంచి సినీ నటీనటులు తరలివచ్చారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సమక్షంలో విశ్వనటుడు కమలహాసన్ తొలిమ్యాచ్‌కు టాస్ వేసి స్టార్స్ క్రికెట్ క్రీడాపోటీలను ప్రారంభించారు. ఆరంభం నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు రసవత్తరంగా జరిగిన పోటీల్లో ఎనిమిది జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా విలక్షణ నటుడు విక్రమ్ పుట్టినరోజును సంబరంగా జరుపుకున్నారు. మమ్ముట్టితోపాటు నాజర్, విశాల్, బాలకృష్ణ, శ్రీయ తదితరులు కేక్‌ను విక్రమ్‌కు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్స్‌లో సూర్య చెన్నై సింగమ్స్ జట్టు, జీవా తంజై వారియర్స్ జట్లు తలపడగా హోరాహోరీగా జరిగిన పోటీలో సూర్య చెన్నై సింగమ్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. పోటీలకు అక్కినేని నాగార్జున హాజరయ్యారు.