టీమిండియాపై జపాన్ బౌలర్ ప్రపంచ రికార్డు
జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా అతి కష్టం మీద నెగ్గింది. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన పోరులో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. వర్షం అంతరాయంతో 5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. రెండువేల సీటింగ్ సామర్థ్యమున్న సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జపాన్ స్పిన్ బౌలర్ చార్లీ హింజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.17 ఏళ్ల వయసున్న చార్లీ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్లు పడగొట్టాడు. ఇందులో అభిషేక్ శర్మను గోల్డెన్ డకౌట్ చేసిన చార్లీ హింజ్.. మ్యాచ్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ వికెట్ కూడా పడగొట్టి జపాన్‌కు బ్రేక్ ఇచ్చాడు. దీంతో చార్లీ హింజ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.అయితే మ్యాచ్‌కు ముందే చార్లీ హింజ్ ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడి జాబితాలో చార్లీ హింజ్ చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల 357 రోజుల వయసున్న చార్లీ హింజ్ భారత్‌పై టీ20 ఆడిన మూడో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. హింజ్ కంటే ముందు నేపాల్ క్రికెటర్ గుల్షన్ ఝా (17 ఏళ్ల 228 రోజులు), నమీబియా క్రికెటర్ మాక్స్ హీంగో (17 ఏళ్ల 341 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.ఎవరీ చార్లీ హింజ్?చార్లీ హింజ్ విషయానికొస్తే అతడి కుటుంబం మొత్తం క్రికెటర్లతో నిండి ఉండడం విశేషం. అతడి సోదరులు జి హరా హింజ్, ఎమ్ హరా హింజ్‌లు జపాన్ అండర్-19 జట్టుకు ఆడారు. ఈ ముగ్గురిలో చార్లీ హింజ్ సక్సెస్ అయ్యాడు. 2024లో జపాన్ సీనియర్ జట్టుకు ఆడాడు. గణాంకాల విషయానికొస్తే చార్లీ హింజ్ 39 టీ20ల్లో 49 వికెట్లు తీశాడు. జపాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చార్లీ హింజ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే చార్లీ హింజ్ (2-17) అద్భుత ప్రదర్శనతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అనంతరం జపాన్ అనుభవలేమితో 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసి విజయానికి రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది.ఇదీ చదవండి: కాసేపట్లో లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై