18 కిలోల బరువు, ప్రతీ చెమట చుక్క, నేషనల్ అవార్డ్ : నటుడు ఏమోషనల్
Kartik Aaryan success బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ 'చందూ చాంపియన్' (Chandhu Champion) చిత్రంలోని నటనకు బెస్ట్ యాక్టర్‌గా ప్రతిష్టాత్మకమైన తొలి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాత్రకోసం తనను తాను మలచుకున్న తీరు గురించి ఆయన సోషల్ మీడియా నెట్టింట విశేషంగా నిలుస్తోంది. ఈ పాత్ర కోసం తాను పడిన కష్టాన్ని ఇన్‌స్టాలో గుర్తు చేసుకున్న కార్తీక్ ఎమోషనల్ అయ్యారు.2024లో పారాలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన మురళీకాంత్ పెట్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించేందుకు కార్తీక్ ఏకంగా 18 కిలోల బరువు తగ్గారు. ఇందుకోసం భారీ కసరత్తులే చేశారు. కఠినమైన ఫిట్నెస్, జీవనశైలి విధానాలను అనుసరించానన్నారు. సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, కార్తీక్ ఆ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ... ఆ ప్రయాణంలో తాను పొందిన వాటితో పోలిస్తే కోల్పోయిన బరువు చాలా చిన్నదని, అలా ఆ పాత్రలో జీవించానని కార్తీక్ తెలిపారు. ఈ ప్రయాణంలో తాను సంపాదించుకున్న అనుభవమే గొప్పదని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ మహువా ఫిర్యాదు View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రం 'చందూ ఛాంపియన్' అంటూ ఈ పాత్ర కోసం సిద్ధమయ్యే క్రమంలో ఎదురైన శారీరక , మానసిక సవాళ్లను గుర్తుచేసుకున్నారు. ముర్లికాంత్ పెట్కార్గా నటించడానికి, తాను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మారాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతి ఉదయం వేళ, ఒలికిన ప్రతి చెమట చుక్క, సెట్లో కలిగిన ప్రతి సందేహం.. ఇవన్నీ కేవలం నటన కాదు, అది నిజమైన జీవనం," అని ఆయన రాశారు. అంతేకాదు ప్రతికూలతలు, పట్టుదలతో రూపుదిద్దుకున్న ఒక అథ్లెట్ పాత్రను పోషించడానికి అవసరమైన క్రమశిక్షణను, మనస్తత్వాన్ని కూడా అతను అలవర్చుకోవలసి వచ్చింది. గాయాలే పతకాలుగా, ఎదురుదెబ్బలే పునరాగమనాలుగా మారతాయని ఈ మూవీ ద్వారా తెలిసి వచ్చిందన్నారు.ఇదీ చదవండి: జీవిత ఖైదు : కాంబోడియా ప్రియురాలితో గ్యాంగ్‌స్టర్ పెళ్లికి పెరోల్కాగా గుజరాత్‌లోని కేవడియాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కార్తీక్ ఈ జాతీయ అవార్డును అందుకున్నారు. సాంప్రదాయకంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ వేడుక, ఈసారి తొలిసారిగా గుజరాత్లో నిర్వహించారు.ఇదీ చదవండి: గ్రానైట్ బారన్, వీరమణి బాగోతం : మీడియా చేతికి షాకింగ్ వీడియోలు