Central Industrial Security Forces
-
తాజ్‌మహల్ రక్షణకు యాంటీడ్రోన్ వ్యవస్థ
ఆగ్రా (యూపీ): తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని వరుస బెదిరింపుల నేపథ్యంలో.. ఈ అద్భుత నిర్మాణం భద్రతపై కేంద్రం దృష్టి సారించింది. తాజ్ మహల్ కాంప్లెక్స్‌లో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీంతో తాజ్ మహల్ భద్రత మరింత హైటెక్‌గా మారనుంది. ఈ స్మారక చిహ్నం ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), ఉత్తరప్రదేశ్ పోలీసుల రక్షణలో ఉంది. ఇక్కడ త్వరలో అధునాతన డ్రోన్ తటస్థీకరణ సాంకేతికత రూపంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నామని తాజ్ సెక్యూరిటీ ఏసీపీ సయ్యద్ అరిబ్ అహ్మద్ తెలిపారు.ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేయగలుగుతుంది. ప్రధాన గోపురంపైన 200 మీటర్ల వ్యాసార్థంలో ప్రభావవంతంగా పనిచేయనుంది. ఆ ప్రాంతంలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే వెంటనే గుర్తించి దాని సిగ్నల్‌ను జామ్ చేస్తుంది. దీంతో డ్రోన్ పనిచేయదు. దీనిని ‘సాఫ్ట్ కిల్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థను నిర్వహించడానికి పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, అంకితమైన ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని అరిబ్ అహ్మద్ తెలిపారు. కొద్ది రోజుల్లో వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం ఖచ్చితమైన దాడులు చేయడం తెలిసిందే. అయితే.. ఆ తరువాత పాక్ వరుసగా ఫిరంగి, క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపైనా దాడికి యత్నించింది. వీటన్నింటి భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలలో డ్రోన్ నిరోధక చర్యల అవసరాన్ని గుర్తించిన కేంద్రం.. తాజ్‌మహల్ భద్రతపై దృష్టి సారించింది.మరోసారి బాంబు బెదిరింపులు.. ఇదిలా ఉండగా.. తాజ్‌మహల్‌కు ఆదివారం మరో సారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్డీఎక్స్తో తాజ్ మహల్‌ను పేల్చేస్తామని కేరళ నుంచి అధికారులకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికా రులు, తాజ్‌మహల్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పోలీ సులు, బాంబు నిర్వీర్యం దళం, డాగ్ స్క్వాడ్, భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) అధికారులు, సీఐఎస్ఎఫ్ భద్రతా దళం మూడు గంటల పాటు తాజ్‌మహల్ ప్రాంగణంలో తనిఖీలు చేశారు. అనుమానాస్పద వస్తువులేవీ దొరకలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు. మెయిల్‌పై రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. ఫేక్ ఈమెయిల్ అని తేలడంతో దీనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రగతి మైదాన్‌కు సీఐఎస్ఎఫ్ భద్రత
న్యూఢిల్లీ: ఎగ్జిబిషన్ల వేదికగా చెప్పుకునే ప్రగతి మైదాన్‌ను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు(సీఐఎస్ఎఫ్) కంటికి రెప్పలా కాపాడనున్నాయి. దేశ, విదేశాలకు చెందిన ఏ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకున్నా అందుకు ప్రగతి మైదా న్ చిరునామాగా మారుతోంది. ఈ ఎగ్జిబిషన్లను తిలకించేందుకు లక్షల సంఖ్యలో జనం ఇక్కడికి వస్తుంటారు. అంతేకాక కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. దీంతో మాఫి యా, ఉగ్రవాదుల కన్ను ప్రగతి మైదాన్‌పై పడిం దని నిఘావర్గాలు హెచ్చరించడంతో ఇకపై సీఐఎస్ఎఫ్ జవాన్లు భద్రత కల్పించనున్నారు. మైదాన్‌లోకి వెళ్లే, బయటకు వచ్చే ద్వారా వద్ద మాత్రమే కాకుండా లోపల ఏర్పాటు చేసిన ప్రదర్శనల వద్ద కూడా సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరిం చనున్నారు. ఇందుకోసం 100 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎప్పుడూ ఇక్కడ అందుబాటులో ఉండే లా ఏర్పాట్లు చేస్తున్నారు. క్విక్ రియాక్షన్ టీమ్‌గా పిలిచే ఈ జవాన్లు మైదాన్‌లో వాహనాలపై తిరుగుతూ భద్రతా విధు లు నిర్వర్తిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలి పారు. అవసరమైతే మరింతమంది జవాన్లను కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ‘జాతీయ, అంతర్జాతీయ ఫెయిర్లకు ప్రగతి మైదా న్ వేదికగా మారింది. ట్రేడ్ ఫెయిర్, బుక్ ఫెయిర్, ఆటో ఎక్స్పో, సెక్యూరిటీ ఎక్స్పో, డిఫెన్స్ ఎక్స్పో వంటి భారీ ప్రదర్శనలు తరచూ ఇక్కడ జరుగుతున్నాయి. దీంతో ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చేవారికి మాత్రమే కాకుండా ప్రదర్శనను ఏర్పాటు చేసిన దేశ, విదేశీ సంస్థలకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరముంది. ఇప్పటిదాకా ప్రైవే టు సెక్యూరిటీ గార్డులతో భద్రత కల్పిస్తున్నాం. అయితే ఈ సెక్యూరిటీ ఉగ్రదాడులను, మాఫియా దాడులను ఎదుర్కొనే స్థాయిలో లేదన్న నివేదికలు అందాయి. పైగా ఉగ్రవాదుల కన్ను కూడా ప్రగతి మైదాన్‌పై పడిందని తరచూ నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్కు సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించాం. ఇం దుకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించి, కేంద్ర హోంశాఖకు పంపించాం. గతంలో ఐటీపీఓ భద్రత కోసం కూడా ప్రతిపాదనలు పంపాం. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే తాజా గా సీఐఎస్ఎఫ్ భద్రత కోసం రూపొందించిన ప్రతి పాదనలపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేద’ని సంబంధిత అధికారి ఒకరు తెలి పారు. 124 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మైదాన్‌లో 61,290 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ భవనాన్ని నిర్మించారు. ఇందులో 16 హాల్స్‌లో ప్రదర్శన లు ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మైదాన్‌తోపాటు భవనాన్ని, భవనంలోని హాళ్లను సీఐఎస్ఎఫ్ జవాన్లు రేయింబవళ్లు కాపలా కాయా ల్సి ఉంటుంది.