breaking news
cans supply
-
బీర్ పరిశ్రమలో ఊహించని సమస్య
భారతీయ బీర్ పరిశ్రమ ఊహించని సమస్యలతో సతమతం అవుతుంది. దాదాపు రూ.38,000 కోట్లకు పైగా విలువైన ఈ విభాగం బీర్ నింపేందుకు అల్యూమినియం డబ్బాల కొరత ఎదుర్కొంటుంది. బ్రేవరేజ్ సంస్థల అంచనాబట్టి సుమారు 12-13 కోట్ల 500 మిల్లీలీటర్ల డబ్బాల వార్షిక లోటు ఉంది. ఇది మొత్తం డిమాండ్‌లో సుమారు 20% ఉండడం గమనార్హం. ఈ కొరత బీర్ క్యాన్ల లోటును తెలియజేయడంతోపాటు పెరుగుతున్న డిమాండ్, తగినంత దేశీయ మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రపంచ సరఫరా పరిమితులు, కొత్త నియంత్రణ ఒత్తిళ్లను హైలైట్ చేస్తుంది. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే పరిశ్రమ వృద్ధి మందగించే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.క్యాన్లకు పెరుగుతున్న డిమాండ్ఒకప్పుడు సీసాల తర్వాత అల్యూమినియం క్యాన్లు సెకండరీ ప్యాకేజింగ్ ఎంపికగా ఉండేవి. కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ ఇవే ప్యాకింగ్‌లో ప్రధానంగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద బీర్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్(యూబీఎల్) క్యాన్ల మొత్తం పరిమాణంలో 22% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్య ఉత్తర ప్రదేశ్ వంటి అధిక వృద్ధి ఉన్న మార్కెట్లలో 75–80% వరకు పెరిగింది. ఆ రాష్ట్రంలోని ఎక్సైజ్ విధాన మార్పులు క్యాన్లను చౌకగా, వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి.పరిమిత సరఫరా మౌలిక సదుపాయాలుదేశంలో కేవలం మూడు అల్యూమినియం క్యాన్ల తయారీ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అందులో రెండింటిని విదేశీ యాజమాన్యంలోని కాన్ప్యాక్, బాల్ కార్పొరేషన్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. క్యాన్ ఉత్పత్తికి అవసరమైన అల్యూమినియంలో గణనీయమైన భాగం ఇతర దేశాల నుంచే దిగమతి చేసుకుంటున్నారు. ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాల ప్రభావం దీనిపై అధికంగా ఉంది.సాఫ్ట్‌డ్రింక్స్‌లో..నాన్ ఆల్కహాలిక్ విభాగంలో క్యాన్లకు డిమాండ్ పెరగడంతో బీర్ క్యాన్ల కొరత తీవ్రమవుతోంది. కోకాకోలా, పెప్సికో వంటి శీతల పానీయాల దిగ్గజాలు క్యాన్ ఆధారిత ఉత్పత్తులను వేగంగా పెంచుతున్నాయి.రెగ్యులేటరీ నిబంధనలుఏప్రిల్ 2025లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దిగుమతులతో సహా అన్ని అల్యూమినియం డబ్బాలకు సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. అందులో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లను (క్యూసీఓ) అమలు చేస్తుంది. నాణ్యత, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నప్పటికీ తక్షణ డిమాండ్‌కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. బీఐఎస్ సర్టిఫికేషన్‌కు విదేశీ తయారీ ప్లాంట్లను ఫిజికల్‌గా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందులో జాప్యం జరుగుతుంది.ఇండస్ట్రీ ఇబ్బందులుబీఐఎస్ సర్టిఫికేషన్ అమలును ఒక సంవత్సరంపాటు (2026 ఏప్రిల్ వరకు) వాయిదా వేయాలని బ్రేవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రభుత్వాన్ని కోరింది. బీఐఎస్ సర్టిఫికేషన్ అవసరాన్ని దేశీయ ఉత్పత్తిదారులకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పింది. దిగుమతులపై ఆంక్షలు విధించకూడదని తెలిపింది. ఇప్పటికే యూబీఎల్ విభిన్న మార్కెట్లలో క్యాన్ల కొరత ఉందని తెలిపింది. దాంతో గత ఆరు నెలల్లో 1–2 శాతం నష్టాన్ని అంచనా వేసింది.ఇదీ చదవండి: యాపిల్‌లో ఇంజినీర్ కనీస వేతనం ఎంతంటే..ఇప్పుడు ఏం చేయాలి?క్యాన్ల సంక్షోభం మరింత పెరగకుండా నిరోధించడానికి బ్రేవరేజెస్, ఇతర సంస్థలు తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని సూచిస్తున్నారు. కొత్త క్యాన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలంటున్నారు. టెక్నాలజీ, వీటి ఏర్పాటుకు మూలధనం కోసం గ్లోబల్ కంపెనీలతో జాయింట్ వెంచర్లు చేపట్టాలని చెబుతున్నారు. -
వాటర్ ప్లాంట్లకు తాళం
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరంలో మినరల్ వాటర్ క్యాన్ల సరఫరా ఆగింది. 250 మినరల్ వాటర్ ప్లాంట్లకు తాళం వేస్తూ పర్యావరణ ట్రిబ్యునల్ ఆదేశాలు వెలువరించింది. ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ యాజమాన్యాలు ఆందోళన బాట పట్టడంతో క్యాన్ల ధరకు రెక్కలు రానున్నాయి. లారీల ద్వారా తాగు నీటిని సరఫరా చేయడానికి నీటి పారుదల శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల మినరల్ వాటర్ క్యాన్ల వాడకం పెరుగుతోంది. ఇళ్లలోనూ, కార్యాలయాలు, హోటళ్లలో తాగునీరుగా మినరల్ వాటర్ క్యాన్లను ఉపయోగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ఉత్పత్తి సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ అనుమతితో కొన్నిసంస్థలు శుద్ధీకరించిన నీటిని అందిస్తుండగా, మరి కొన్ని సంస్థలు ధనార్జనే ధ్యేయంగా శుద్ధీకరించకుండానే ముందుకు సాగుతున్నాయి. చెన్నైలో ప్రతి ఇంటా తప్పనిసరిగా వాటర్ క్యాన్లను ఉపయోగించాల్సిన పరిస్థితి. దీంతో నగర శివారుల్లో కోకొల్లలుగా వెలసిన మినరల్ వాటర్ ప్లాంట్లు పోటీ పడి విక్రయాలు చేస్తున్నాయి. అయితే, శుద్ధీకరించకుండా క్యాన్ల విక్రయం, భూగర్భజలాల దోపిడీపై పర్యావరణ ట్రిబ్యునల్ ఇటీవల దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో సాగుతున్న నీటి వ్యాపారంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక: దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా జల దోపిడీకి పాల్పడుతూ సొమ్ములు చేసుకుంటున్న మినరల్ వాటర్ క్యాన్ సంస్థలపై పడ్డారు. అనుమతులు లేవని గుర్తించి కొన్ని సంస్థలను సీజ్ చేశారు. ఈ వ్యవహారంతో గతంలో యాజమాన్యాలు ఆందోళన బాట పట్టడంతో చెన్నై మహానగరంలో వాటర్ క్యాన్ల సరఫరా ఆగింది. బ్లాక్ మార్కెట్లో రూ.వంద నుంచి రూ.150 వరకు పలికారుు. ఎట్టకేలకు కొరడా ఝుళిపించిన అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలనల అనంతరం నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికను గురువారం పర్యావరణ ట్రిబ్యునల్ ముందు ఉంచారు. రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారి రామన్ నేతృత్వంలోని బృందం సమర్పించిన నివేదికను ట్రిబ్యునల్ పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తంగా 857 మినరల్ వాటర్ క్యాన్ల ఉత్పత్తి సంస్థలు ఉన్నట్టు తేల్చారు. 252 సంస్థలకు బోరు బావుల ద్వారా నీటిని తోడుకునే అనుమతి ఉందని, అయితే, అదే సంస్థల పరిధిలో ఉన్న మరో 527 సంస్థలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. చెన్నైలో 33 సంస్థలు మెట్రో వాటర్ బోర్డు నీటిని ఉపయోగించుకుంటున్నాయని వివరించారు. నివేదికను పరిశీలించినానంతరం ఆ 252 సంస్థలకు తాళం వేయాలని ఆదేశించారు. దీంతో ఆ సంస్థలతో పాటుగా 527 సంస్థల్లో వాటర్ క్యాన్ల ఉత్పత్తి ఆగింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 13కు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. అంత వరకు ఆ సంస్థలకు తాళం వేయాల్సిందేనని ఆదేశాలు వెలువడటంతో మినరల్ వాటర్ క్యాన్ల యాజమానుల సంఘాన్ని ఆందోళనలో పడేసింది. ఆగిన సరఫరా: ట్రిబ్యునల్ తీర్పుతో ఆయా సంస్థల్లో క్యాన్ల ఉత్పత్తి ఆగింది. వాటర్ క్యాన్ల సరఫరాను నిలుపుదల చేస్తూ యాజమాన్య సంఘం నాయకుడు ఎల్ లోకేష్ ప్రకటించారు. అన్ని సంస్థలు ఉత్పత్తిని నిలుపుదల చేసి ఆందోళన బాట పట్టినట్లు తెలిపారు. అన్ని రకాల అనుమతులతో తాము క్యాన్లను సరఫరా చేస్తుంటే, కొత్తగా మెలికలు పెట్టడం, సంబంధం లేని సంస్థలను తమకు అంట కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనుమతులు లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని, అయితే, అనుమతులు ఉన్న సంస్థలకు తాళం వేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు. తాము ఆందోళన బాట పట్టిన దృష్ట్యా, ఇక వాటర్ క్యాన్ల సరఫరా ఆగినట్టేనని ప్రకటించారు. వీరి ఆందోళన పుణ్యమా నగరంలో వాటర్ క్యాన్లకు డిమాండ్ ఏర్పడబోతుంది. చాపకింద నీరులా వాటర్ క్యాన్ల సరఫరా జరగడం తథ్యమని, అదే సమయంలో ధర పెరగడం ఖాయం అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీల ద్వారా సరఫరా: వాటర్ క్యాన్ల సరఫరా ఆగడంతో లారీల ద్వారా తాగునీటిని ప్రజలకు సరఫరా చేయడానికి మెట్రో వాటర్ బోర్డు నిర్ణయించింది. ఆగమేఘాలపై ఇందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారు. నగర శివారుల్లోని వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని రోజుకు నాలుగు కోట్ల లీటర్ల తాగునీటిని అందించడంతో పాటుగా, నైవేలిలో అదనపు బోరు బావుల ఏర్పాటుకు నిర్ణయించారు.