breaking news
calfs
-
మొసలిని తిప్పితిప్పి తుక్కుతుక్కు చేసింది..!
ఆఫ్రికా: జంతువులు తమ పిల్లల జోలికి వస్తే ఎంతలా దాడి చేస్తాయో అందరికి తెలిసిందే. పైగా అవి చాలా సార్లు తమ సంతానాన్ని కాపాడుకోవటం కోసం తమ కన్న పెద్ద జంతువులతో పోరాడటానికి కూడా వెనకాడవు. అచ్చం అలాంటి సంఘటనే జాంబియా దేశంలో చోటు చేసుకుంది. నిజానికి ఏనుగులు ఎక్కడకి వెళ్లిన గుంపులు గుంపలుగా వెళ్లతాయి. అయితే ఇక్కడ ఒక తల్లి ఏనుగు తన పిల్లలతో నీళ్లు తాడగడం కోసం నదిలోకి దిగుతుంది. (చదవండి: 900 ఏళ్ల నాటి పురాతన కత్తి) అంతే ఇంతలో ఒక్కసారిగా ఒక మొసలి ఆ పిల్ల ఏనుగులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తల్లి ఏనగు కోపంతో ఆ మొసలిపై దాడి చేయడమే కాక తొండంతో ఒడిసి పట్టుకుని కాళ్లతో తొక్కి చంపేస్తుంది. అయితే ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగినప్పటికీ ప్రస్తుతం మళ్లీ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తల్లి ఏనుగుతో గొడవపడకండి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఏడాది చిన్నారి నెలకు ఏకంగా రూ.75 వేలు సంపాదన) -
పంజా విసిరిన చిరుత
చిన్నశంకరంపేట(మెదక్): మరోసారి చిరుత పంజా విసిరింది. శనివారం రాత్రి చిన్నశంకరంపేట మండలం టి.మాందాపూర్ పెద్ద తండాలో రెండు లేగదూడలు చిరుత దాడిలో మృతి చెందాయి. వివరాల ప్రకారం..టీ. మాందాపూర్ పెద్ద తండాకు చెందిన రైతు లంబాడి దేశ్య పశువుల పాక ముందు రెండు లేగదూడలను కట్టేశాడు. అర్థరాత్రి అలికిడి కావడంతో రైతు మెల్కోని పశువుల కొట్టం వైపు చూడగా, చిరుత లేగదూడను తీసుకుపోతున్న దృష్యం కనిపించింది. బయంతో వెనక్కి వచ్చిన దేశ్య ఉదయం స్థానికుల సాయంతో అటవీప్రాంతంలో గాలించగా ఓ పెద్ద బండ వద్ద విగతజీవులైన రెండు లేగదూడలు కన్పించాయి. అక్కడే ఎండిపోయిన మరో లేగదూడ శవం కూడ ఉన్నట్లు గ్రామస్తులు గమనించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామ సర్పంచ్ సిద్దాగౌడ్ తెలిపారు. పెద్ద బండే చిరుత స్థావరమా? వరుస దాడులతో మెదక్, చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలను హడలేత్తిస్తున్న చిరుత టి.మాందాపూర్ పెద్ద తండా సీమపంలోని అటవిప్రాంతంలో ఉన్న పెద్దబండను స్థావరంగా చేసుకుని శివారు గ్రామాలపై దాడులు చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చిన్నశంకరంపేట మండలంలోని గజగట్లపల్లి, టి.మాందాపూర్, ఎస్.కొండాపూర్, మెదక్ మండలంలోని ఖాజిపల్లి, శివ్వాయిపల్లి, వెంకటాపూర్, గుట్టకిందిపల్లి గ్రామాల మధ్యన ఉన్న అటవీ ప్రాంతంలోని పెద్ద బండ వద్ద శనివారం తీసుకువెళ్లిన రెండు లేగదూడలతో పాటు మరో లేగదూడ శవం కూడ కనిపించడం అనుమానలకు కారణమైంది. అటవీశాఖ అధికారులు ఇక్కడ నిఘాను ఉంచితే చిరుత చిక్కవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. -
లేగదూడల పెంపకంలో జాగ్రత్తలు
వర్గల్ పశుసంపద అభివృద్ధికి దూడల పోషణే ప్రధానం. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ నాణ్యమైన మేత అందించినప్పుడే ఇవి మంచి పాడి ఆవులుగా ఎదుగుతాయి. పశు పోషకుల నిర్లక్ష్యం, అవగాహనలేమి వల్ల పుట్టిన ప్రతీ 100 దూడల్లో 30 నుంచి 40 వరకు మృత్యువా త పడుతున్నాయి. ఈ సమస్యను అధిగమిం చేందుకు లేగదూడల పెంపకంలో తీసుకోవాల్సిన మెలకువలపై వర్గల్ మండల పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్‌బాబు (సెల్ : 9849457404) అందించిన సలహాలు, సూచనలు... దూడ పుట్టగానే ముక్కు రంధ్రాల మీద ఉన్న పొరలు తుడిచి శుభ్రం చేయాలి. శ్వాస ఆడనట్లయితే రొమ్ము భాగం మీద సున్నితంగా మర్దన చేయాలి. దూడ పుట్టగానే తల్లి దాన్ని నాలుకతో నాకేలా చూడాలి. తద్వారా తల్లి-దూడకు అనుబంధం పెరగడంతోపాటు, దూడ శరీరం మీద తడి ఆరిపోతుంది. పుట్టిన దూడ అరగంట, గంటలోపే లేచి నిలబడి జున్నుపాలు తాగుతుంది. దూడ లేవలేని స్థితిలో బలహీనంగా ఉన్నట్లయితే దానిని లేపి నిలబెట్టి పాలు తాగేలా చూడాలి. జున్నుపాలు తాగిస్తే అజీర్తి చేస్తుందనుకోవడం అపోహ మాత్రమే. జున్నుపాలలో తేలి కగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్-ఏ, కెరోటిన్ ఎక్కువ శాతంలో ఉంటాయి. మలబద్ధకం లేకుండా ఇవి దోహదపడతాయి. జున్నుపాలు తాగని లేగలు, దుడ్డెలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తల్లి దగ్గర దూడకు సరిపడా జున్నుపాలు లభించకుంటే అరచెంచా ఆముదం, గ్లాసు గోరు వెచ్చని నీళ్లు, కోడి గుడ్డు పచ్చ సొన, రెండు గ్లాసుల వేడి పాలు మూడు రోజులపాటు తాగించవచ్చు. తరువాత పోతపాలు అలవాటు చేయాలి. ఈనిన వెంటనే తల్లి పశువు, దూడను చూడకుండా జాగ్రత్త పడాలి. దూడకు జున్నుపాలు జాగ్రత్తగా తాగించాలి. పాలు గోరు వెచ్చగా శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉండాలి. చల్ల టి పాలు తాగిస్తే పారుడు రోగం వస్తుంది. దూడ పుట్టిన మొదటి మూడు రోజులలో రోజుకు మూడు సార్లు జున్నుపాలు తాగించాలి. ఆ తరువాత రోజుకు రెండు సార్లు తాగించాలి. మొదటి నెలలో ప్రతిరోజు దూడ బరువులో పదోవంతుకు సమానంగా పాలు తాగిం చాలి. రెండో నెలలో పదిహేనో వంతుకు, మూడో నెలలో ఇరవయ్యో వంతుకు సమానంగా పాలు తాగించాలి. పారుడు వ్యాధి లక్షణాలు కన్పిస్తే పాలు తగ్గించి పశు వైద్యుని సలహా తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే దూడ ప్రాణాలకే ప్రమాదం. టీకాలు మరవద్దు... దూడ పుట్టగానే టింక్చర్ అయోడిన్ దూదిలో ముంచి బొడ్డుకు అద్దాలి. ధనుర్వాతం రాకుండా ఏటీఎస్ ఇంజక్షన్ వేయించాలి. పుట్టిన 10-15 రోజులలో ఏలిక పాముల మందు వేయాలి. తరువాత నెలకు ఒకసారి చొప్పున నాలుగు నెలల వయస్సు వరకు ఈ మందు కొనసాగించాలి. 6-8 వారాల వయస్సులో గాలికుంటు వ్యాధి నివారణకు టీకా ఇప్పించాలి. 35 రోజుల తరువాత బూస్టర్ డోస్,ఆ తరువాత 4 నెలలకోసారి ఈ టీకా వేయించాలి. చీడ పారుడు వ్యాధి రాకుండా 4-6 నెలల వయసులో టీకా మందు వేయించాలి. తిరిగి సంవత్సర వయస్సులో మళ్లీ టీకా వేయించాలి. ఆరు మాసాల వయసులో గొంతు వాపు నివారణ టీకా వేయించాలి. 6-12 మాసాల వయసులో జబ్బవాపు వ్యాధి నివారణకు టీకా మందు ఇప్పించాలి. షెడ్ల బయట 15 రోజులకోసారి సున్నం చల్లి కాక్సిడియోసిస్ వ్యాధి రాకుండా అదుపు చేయవచ్చును. మూడు మాసాల వయసు దాటిన తరువాత రెండు నెలలకోసారి దూడ వెంట్రుకలు కత్తిరిస్తే గోమార్లు, పేలు పట్టకుండా ఉంటాయి.