breaking news
Calculators
-
అడుగు పడితే, లైట్ పడుతుంది!
రోజూ చేసే చిన్న చిన్న పనులే ఎక్కువ సమయాన్ని తినేస్తుంటాయి! అలాంటి పనులను చిటికెలో పూర్తి చేసి, కాస్త స్మార్ట్‌గా మార్చే గాడ్జెట్లు ఇప్పుడు మార్కెట్లో బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవే ఇవి!సోలార్ వాల్ లైట్దొంగలను భయపెట్టి, బయటపెట్టే లైట్స్ ఇవి. రాత్రి అందరూ నిద్రలో ఉంటారు... కానీ ఈ లైట్ మాత్రం డ్యూటీలో ఉంటుంది! ఎవరైనా ఇంటి గుమ్మం దగ్గరకు రాగానే ‘ఇదిగో దొంగ.. దొంగ!’ అన్నట్లు టక్కున వెలిగిపోతుంది. మోషన్ సెన్సర్‌తో పనిచేసే ఈ సోలార్ వాల్ లైట్ దొంగలకు చిన్న షాక్ ఇవ్వడమే కాదు... ఇంటి చుట్టూ ఏ కదలిక జరిగినా వెంటనే వెలుతురు వెదజల్లుతుంది. పగలంతా సూర్యరశ్మితో చార్జ్ అవుతుంది కాబట్టి కరెంట్ బిల్లు పెరుగుతుందేమోనని ఆందోళన అక్కర్లేదు. వర్షం వచ్చినా, ఎండ మండినా వాటర్‌ప్రూఫ్ బాడీతో చక్కగా పనిచేస్తుంది. గుమ్మం, బాల్కనీ, తోట, మెట్లు– ఎక్కడ పెట్టినా వెచ్చని పసుపు వెలుతురుతో ఇంటికి అందాన్ని, భద్రతను ఒకేసారి అందిస్తుంది. ధర కేవలం రూ. 300 మాత్రమే!లెక్కలతో పాటు... లెటర్స్ కూడా!కాలిక్యులేటర్లో లెక్కలు వేసి... మళ్లీ పక్కన కాగితం కోసం వెతుకుతుంటారా? ఇక ఆ పని లేదు! ఈ టూ ఇన్ వన్ కాలిక్యులేటర్ ఒకేసారి లెక్కలూ వేస్తుంది, పక్కనే నోట్స్ కూడా రాస్తుంది. ఎంత ఖర్చయ్యింది? ఎంత బ్యాలెన్స్? వెంటనే రాసేసి, పని అయిపోయాక ఒక్క బటన్ తో చెరిపేయొచ్చు. కాగితాలు చింపాల్సిన పని లేదు, చిన్న చిట్టీలు పోగొట్టుకునే టెన్షన్ లేదు. మడతపెట్టే డిజైన్ తో జేబులోనో, బ్యాగులోనో హాయిగా సరిపోతుంది. స్టూడెంట్స్, టీచర్లు, ఆఫీస్ ఉద్యోగులు, లెక్కలతో పని ఉన్నవాళ్లందరికీ ఇది చిన్న సైజ్‌లో ఉండే పెద్ద హెల్పర్. కాలిక్యులేటర్ ఒకటి కొంటే, నోట్‌ప్యాడ్ కొనాల్సిన అవసరమే లేదు. ధర సుమారు రూ.600.కత్తెరకు కన్ను!కత్తిరిస్తుంటే... సరైనా కొలత ఒక వైపు, కత్తెర మరోవైపు వెళ్లిపోతున్నాయా? ఇక ఆ టెన్షన్ కు కట్! ఈ లేజర్ కత్తెర ముందే ఎర్రటి లేజర్ గీతను చూపిస్తూ ‘ఇదే దారి... ఇటే కట్ చెయ్!’ అని గైడ్ చేస్తుంది. కాబట్టి వంకర టింకరలు లేకుండా సూటిగా కత్తిరించొచ్చు. బట్టలు, గిఫ్ట్ పేపర్లు, కార్డ్‌బోర్డులు, క్రాఫ్ట్ పనులు... ఏది కత్తిరించినా ఫినిషింగ్ మాత్రం ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్లు పదునుగా ఉండటంతో ఎక్కువ శ్రమ కూడా ఉండదు. చేతికి నొప్పి కలగకుండా సౌకర్యవంతమైన పట్టుతో డిజైన్ చేశారు. ఇంట్లో చిన్న చిన్న క్రాఫ్ట్ పనులు చేసే వాళ్ల నుంచి టైలర్లు, బొటిక్ యజమానుల వరకు అందరికీ ఇది సూపర్ హెల్పర్. ఇకపై ముందు గీత గీసే పని లేకుండా, లేజర్ చూపించిన దారిలో కట్ చేయడమే! ధర కేవలం రూ. 350 మాత్రమే! -
నేడే పరీక్ష
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు సెకను లేటైనా నో ఎంట్రీ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు నిషేధం విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పరీక్షల కోసం చేపట్టిన చర్యలను వివరించారు. విశాఖలో 39 కేంద్రాల్లో వీఆర్వో పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది. వీఆర్ఏ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 కేంద్రాల్లో ఉంటుంది. వీఆర్వోకు 41 పోస్టులకు 21,284, వీఆర్ఏ 12 పోస్టులకు 888 దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా 39 మందిని, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు 43, పరిశీలకులుగా జిల్లా స్థాయి అధికారులు 39, సహాయ పరిశీలకులుగా 74, ఇన్విజిలేటర్లుగా 996 మందిని నియమించారు. 10 రూట్లలో తహశీల్దార్లను లైజనింగ్ అధికారులుగా ఏర్పాటు చేశారు. 10 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలను చిత్రీకరించేందుకు 42 మంది వీడియోగ్రాఫర్లను పెట్టారు. పరీక్ష సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ కేంద్రం వద్ద అత్యవసర వైద్యం అందించేందుకు ఒక ఏఎన్ఎం, అవసరమైన ఔషధాలను సిద్ధం చేశారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా వా టర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ బస్సులను ఉదయం 8 గంటల నుంచి ప్రతీ ప్రధాన కేంద్రాల నుంచి నడుపుతారు. ఏజెన్సీ ప్రాంత మండలాల నుంచి హాజరయ్యే అభ్యర్థులకు శనివారం సాయంత్రం నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. అభ్యర్థులకు సూచనలు పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా ప్యాడ్, బ్లూ/బ్లాక్ పెన్ను తీసుకొని రావాలి. పరీక్ష ప్రారంభమైన తరువాత వచ్చిన అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులకు సరఫరా చేసే రెండు ఓఎంఆర్ షీట్లలో పరీక్ష పూర్తయిన తరువాత అసలు కాపీని ఇన్విజిలేటర్‌కు అందజేసి, నకిలీ కాపీని తమ వెంట తీసుకువెళ్లొచ్చు. పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లేడులు, వైట్నర్, రబ్బర్లను తీసుకురాకూడదు.


