breaking news
Byreddypalli
-
ఉధృతంగా కైగల్ జలపాతం.. అజాగ్రత్తగా ఉంటే అంతే..
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమపనేరు నియోజకవర్గంలోని కైగల్ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కైగల్ నది ప్రవహించి బైరెడ్డిపల్లె మండలంలో హోరెత్తుతోంది. దీంతో పర్యాటకులు కైగల్ జలపాతాన్ని తిలకించేందుకు తరలివస్తున్నారు. వరుసగా మూడేళ్లపాటు నది ప్రవహిస్తుండడంతో రాళ్లు చాలా నునుపుగా మారి పాచిపట్టాయి. అడుగు పెడితే ఎప్పుడు జారుతుందో తెలియదు. కైగల్ వాటర్ఫాల్స్లోని మృత్యుకోనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. ఇక్కడ నీరు గుండ్రంగా చుట్టుకుంటూ వెళ్లి ఓ రాతి గుహలోకి చేరుతోంది. ఇందులో పడిన వ్యక్తి ఈత వచ్చినా పైకి రావడం కష్టమే. మొన్నటిదాకా కైగల్ జలపాతంలోకి పర్యాటకులు వెళ్లకుండా బైరెడ్డిపల్లె పోలీసులు నిషేధం విధించారు. కానీ అడవిలో పలు మార్గాల నుంచి పర్యాటకులు జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ జాగ్రత్తగా లేకపోతే విహారం కాస్తా విషాదంగా మారిపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. (క్లిక్: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే?) -
చెరువులో పడి విద్యార్థిని గల్లంతు
బెరైడ్డిపల్లి (చిత్తూరు) : జలకళతో నిండుకుండలా ఉన్న చెరువును చూడటానికి వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడి గల్లంతయ్యింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి మండలం గొల్లచేమనపల్లిలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన లీనా(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గ్రామ చెరువు నిండటంతో స్నేహితులతో కలిసి చూడటానికి వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాలు జారి చెరువులో పడి గల్లంతైంది. సమాచారం అందుకున్న గ్రామస్థులు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.