breaking news
Bullett Raja
-
అపార ప్రతిభాశాలి
భర్త సైఫ్ అలీఖాన్‌పై కరీనాకపూర్ ప్రశంసల జల్లు కురిపించింది. ప్రతి సినిమాలోనూ సైఫ్ ప్రతిభ తాలూకు మెరుపులు కనిపిస్తాయంది. ‘నేను బుల్లెట్ రాజా సినిమా చూశా. ఎంతో నచ్చింది. సైఫ్ ఎంతో ప్రతిభాశాలి. సినిమాల్లో ఆయన నటనను బాగా ఇష్టపడతాను. అటువంటి గొప్ప నటుడతను. విజయవంతమైనా లేదా కాకపోయినా ప్రతి సినిమాలోనూ సైఫ్ ప్రతిభ తాలూకూ మెరుపులు కనిపిస్తాయి’ అంటూ ప్రశంసించింది. సైఫ్ వ్యక్తిత్వం గొప్పదని, తెరపై ఆయన పర్సనాలిటీని ప్రేక్షకులు ఇష్టపడతారనేది తన భావన అని తెలిపింది. కాగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో త్వరలో రూపొందనున్న సింగం 2లో అజయ్ దేవ్‌గణ్ సరసన కరీనాకపూర్ నటించింది. కరీనాకపూర్ అనేక సినిమాల్లో అజయ్ దేవ్గణతో కలిసి నటించింది. సింగం-2 సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని కరీనా తెలిపింది. కాగా హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘శుద్ధి’ సిని మాలో కరీనా నటించకపోవచ్చని, ఆమెకు బదులు దీపికా పదుకొణేకి అవకాశం లభించొచ్చంటూ బాలీవుడ్లో వదంతులు వెల్లువెత్తాయి. అయితే దీనిని నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు కరణ్ మల్హోత్రాలు కొట్టిపారేశారు. అయితే ఈ వదంతులను కరీనాకూడా కొట్టిపారేసింది. ఇదంతా మీడియా సృష్టేనంది. వీటన్నింటికీ దూరంగా ఉంటానంది. -
సినిమా రివ్యూ: గురి తప్పిన 'బుల్లెట్' రాజా!
సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్, పాన్ సింగ్ తోమార్, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ రిటర్న్ చిత్రాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తిగ్ మాన్షు దులియా గుర్తింపు తెచ్చుకున్నారు. యూపీ రాజకీయాలు, మాఫియా నేపథ్యంతో చోటా నవాబ్ సైఫ్ ఆలీ ఖాన్, సోనాక్షి సిన్హా లతో తాజాగా బుల్లెట్ రాజా చిత్రాన్ని రూపొందించారు. క్రేజి కాంబినేషన్ తో నవంబర్ 29 శుక్రవారం విడుదలైన బుల్లెట్ రాజా చిత్రం ఏ రకమైన టాక్ సంపాదించుకుందో ఓసారి పరిశీలిద్దాం. ఓ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాజా మిశ్రా సాదాసీదా యువకుడు. ఉద్యోగం కోసం చూస్తున్న రాజా మిశ్రా అనుకోని పరిస్థితుల్లో తనను చేరదీసిన మిత్రుడు రుద్ర (జిమ్మి శ్రేగిల్) కోసం గ్యాంగ్ స్టర్ గా మారుతాడు. రాజా, రుద్ర కలిసి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న రాజకీయ నేతల, పారిశ్రామికవేత్తల, పోలీసును ఎదుర్కొనేందుకు ఓ శక్తివంతమైన ఫ్యాక్షన్ గ్రూప్ గా ఎదుగుతారు. ఈ క్రమంలో వ్యతిరేక వర్గం చేసిన దాడిలో రుద్ర చనిపోతాడు. తన స్నేహితుడి మరణానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనే కథనే 'బుల్లెట్ రాజా' గతంలో లవర్ బాయ్ పాత్రలకే పరిమితమైన సైఫ్ ఓ విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో బుల్లెట్ రాజాగా కనిపించాడు. యాంగ్రీ మ్యాన్ లుక్ తో సైఫ్ ఆకట్టుకున్నాడు. అయితే ప్రేక్షకులపై ప్రభావం చూపే రేంజ్ లో బుల్లెట్ రాజా పాత్రను మలచకపోవడం నిరాశ కలిగించే విషయం. గతంలో గ్యాంగ్ స్టర్ పాత్రలో బాలీవుడ్ లో బుల్లెట్ రాజా ను మించిన పాత్రను మిగతా హీరోలు ఆకట్టుకున్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించే రేసులో బుల్లెట్ రాజాగా సైఫ్ వెనకబడిపోయాడు. దబాంగ్, లుటేరా, రౌడీ రాథోడ్, దబాంగ్-2 లాంటి గత చిత్రాల్లో పోల్చుకుంటే సోనాక్షి సిన్హాకు గొప్పపాత్రమే కాదు. డ్యాన్సులకు మాత్రమే పరిమితమయ్యే పాత్రలో సోనాక్షి గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక చాలా రోజుల తర్వాత రుద్ర పాత్రలో జిమ్మి షెర్గిల్ కు మంచి పాత్ర లభించింది. బుల్లెట్ రాజా చిత్రంలో ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలో నటించాడు. తన పాత్రకు జిమ్మి వంద శాతం న్యాయం చేకూర్చాడు. గ్యాంగ్ రాజ్ బబ్బర్, రవి కిషన్, గుల్షన్ గ్రోవర్ లు విలనిజాన్ని తమదైన శైలిలో పండించారు. అతిధి పాత్రలో కనిపించిన విద్యుత్ జమ్ వాల్ చివర్లో మెరుపులు మెరిపించాడు. ఫైట్స్, యాక్షన్ సీన్లలో మెచ్యురిటీ కనిపించింది. గతంలో సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్, పాన్ సింగ్ తోమార్, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ రిటర్న్ చిత్రాలతో ఆకట్టుకున్న మరో గ్యాంగ్ స్టర్ కథను నడిపించడంలో దర్శకుడు తిగ్ మాన్షు దులియా తడబాటకు గురయ్యాడు. గ్యాంగ్ స్టర్ కథ అంటేనే పగ ప్రతీకారం తప్ప మిగితా అంశాలకు పెద్దగా చోటుండదు. జాగ్రత్తగా డీల్ చేయాల్సిన గ్యాంగ్ స్టర్ కథను ప్రేక్షకుడ్ని మెప్పించే విధంగా తెరకెక్కించడంలో దులియా ఆకట్టుకోలేకపోయాడు. ఈచిత్రంలో బుల్లెట్ లా మాటాలు పేల్చాడు కానీ.. కథను వేగంగా పరిగెత్తించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే విధంగా 'బుల్లెట్ రాజా'ను పేల్చడంలో దులియా గురి తప్పాడు. -
'అంగరక్షకులు, కెమెరా లైట్ల వెలుగులు నచ్చవు'
ముంబై: తనకు స్టార్డంలపై అంత నమ్మకం లేదని బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సైఫ్ ఆలీఖాన్ తెలిపారు. ప్రస్తుతం టిగ్మన్షు ధూలియా దర్శకత్వంలో రూపొందుతున్న 'బుల్లెట్ రాజా' సినిమాతో బిజీగా ఉన్న సైఫ్.. సినిమా నుంచి వచ్చే కీర్తి ప్రతిష్టలకు, స్టార్డంలకు ప్రాధాన్యం ఇవ్వనని స్పష్టం చేశాడు. అది తన కెరీలో ఎప్పటికీ ముఖ్య భూమిక పోషించదని తెలిపాడు. బాధ్యాతయుతమైన వ్యక్తిగా ఉండటానికే తన తొలి ప్రాధాన్యత అని తెలిపాడు. ముగ్గురు అంగరక్షకులు, కెమెరా లైట్ల వెలుగులు అనేవి తనకు నచ్చవన్నాడు. నటనంటే తనకు ఎంత ఇష్టమని, దాని ద్వారా ప్రతి ఫలం వస్తే సంతోషిస్తానన్నాడు. డబ్బు సంపాదన పైనా బాగానే ఆసక్తి ఉంది. అంతవరకూ బాగానే ఉన్నా వాటి నుంచి వచ్చే కీర్తిపై నమ్మకం మాత్రం లేదని సైఫ్ తెలిపాడు. తాను సంతోషంగా, సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటానని, అందుకోసమే ఎక్కువ విదేశాల్లో గడుపుతానన్నాడు. తన దృష్టిలో అపూర్వ విజయాలను సొంతం చేసుకున్న రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్‌లే నిజమైన స్టార్లని అభిప్రాయపడ్డాడు. -
బుల్లెట్ రాజా స్టిల్స్
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, సోనాక్షి సిన్హా జంటగా రూపొందుతున్న బుల్లెట్ రాజా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మాఫియా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు తిగ్ మన్షు ధులియా. ఈ చిత్రం నవంబర్ 29 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.