Bull Market
-
బడ్జెట్‌కి ముందు మార్కెట్లో బుల్ జోరు
ముంబై: కేంద్ర బడ్జెట్‌కి ముందు స్టాక్ మార్కెట్లు బుల్ రంకెలు వేస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, ఏషియన్ మార్కెట్లతో సంబంధం లేకుండా దేశీ సూచీలు జూమ్.. జూమ్.. అంటూ పైకి ఎగబాకుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 722 పాయింట్లు లాభపడి 57,92 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 201 పాయింట్లు లాభపడి 17,303 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. రెండు దేశీ సూచీలు రమారమీ 1.40 శాతం వంతున వృద్ధి కనబరిచాయి. ఈ స్టాక్ మార్కెట్ మార్నింగ్ సెషన్లో టెక్ మహీంద్రా అత్యధికంగా 3.67 శాతం వృద్ధిని కనబరచగా ఆ తర్వాత స్థానాల్లో ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్‌లు ఉన్నాయి,. ఇక నష్టపోయిన షేర్లలో ఇండస్ ఇండ్, లార్సన్ అండ్ ట్రుబో కంపెనీలు ఉన్నాయి. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: మార్కెట్లు హైజంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 41,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయిట్ల మైలురాళ్లను సులభంగా అధిగమించేశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 724 పాయింట్లు జంప్‌చేసి 41,340కు చేరగా.. నిఫ్టీ 212 పాయింట్లు జమ చేసుకుని 12,120 వద్ద నిలిచింది. కేవలం 4 రోజుల్లోనే సెన్సెక్స్ 1,750 పాయింట్లను ఖాతాలో వేసుకోవడం విశేషం. ప్రెసిడెంట్ పదవి రేసులో ఉన్న ట్రంప్, జో బైడెన్ కు సమాన అవకాశాలున్నట్లు వెలువడిన అంచనాల నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు 1.5-4 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో దేశీయంగానూ ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా ఏ దశలోనూ మార్కెట్లు వెనుదిరిగి చూడలేదు. 41,030 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ తదుపరి మరింత జోరు చూపుతూ వచ్చింది. మెటల్స్ మెరుపులు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. రియల్టీ మాత్రమే(0.5 శాతం) నీరసించింది. ప్రధానంగా మెటల్, మీడియా, బ్యాంకింగ్, ఎఫ్ ఎంసీజీ 4-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, హిందాల్కో, ఎస్బీఐ, బీపీసీఎల్, టాటా స్టీల్, గెయిల్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ 6.2-3 శాతం మధ్య జంప్ చేశాయి. బ్లూచిప్స్ లో కేవలం హీరో మోటో 0.6 శాతం, హెచ్డీఎఫ్సీ లైఫ్ 0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. పీవీఆర్ జూమ్ డెరివేటివ్స్‌లో సెయిల్, పీవీఆర్, హెచ్‌పీసీఎల్, ఎస్ఆర్ఎఫ్, నాల్కో, సన్ టీవీ, ఎన్ఎండీసీ, ఇండిగో, ముత్తూట్, జీ, బీఈఎల్ 11-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ సీపీ, లుపిన్, అపోలో టైర్, పెట్రోనెట్ 7-0.2 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,737 లాభపడగా.. 913 మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐలు ఓకే నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 146 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) కేవలం రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,274 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1101 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 741 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 534 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
కదం తొక్కిన బుల్- 37000 దాటిన సెన్సెక్స్
చివరి గంటలో బుల్ ఆపరేటర్లు కదం తొక్కడంతో మార్కెట్లు హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 37,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ట్రేడింగ్ ముగిసేసరికి 548 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్ 37,020 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 162 పాయింట్లు ఎగసి 10,902 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో మిడ్‌సెషన్ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా 36,548 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివర్లో 37,126కు చేరింది. మధ్యలో 36,513 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10,933 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరగా.. 10,750 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ఐటీ మినహా.. ఎన్ఎస్ఈలో ఐటీ(0.6 శాతం) మినహా అన్ని రంగాలూ 1.7-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, ఆటో, మెటల్ 1.7 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 12.5 శాతం జంప్‌చేయగా.. ఓఎన్జీసీ, ఇన్ఫ్రాటెల్, గెయిల్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, టైటన్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ 6-3.3 శాతం మధ్య ఎగశాయి. అయితే హిందాల్కో, బ్రిటానియా, నెస్లే, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ 2-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఐడియా జోరు వొడాఫోన్ ఐడియాకు అనుకూలంగా ట్రాయ్‌కు టీడీశాట్ ఆదేశాలు జారీ చేసిన వార్తలతో ఈ కౌంటర్ 14 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఇతర డెరివేటివ్ షేర్లు హెచ్‌పీసీఎల్, ముత్తూట్, టాటా పవర్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, వోల్టాస్, అపోలో హాస్పిటల్స్ 7-5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఉజ్జీవన్, చోళమండలం, మ్యాక్స్ ఫైనాన్స్, పీవీఆర్, మెక్‌డోవెల్ 1.4-0.7 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6-1.2 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1653 లాభపడగా.. 989 మాత్రమే నష్టపోయాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1091 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1660 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 222 కోట్లు, డీఐఐలు రూ. 899 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇక మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1566 కోట్లు, డీఐఐలు రూ. 650 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. -
బుల్ రన్ తొలి దశలో: జున్‌జున్‌వాలా
దేశీయంగా స్టాక్ మార్కెట్లు అతిపెద్ద బుల్ రన్ ప్రారంభ దశలో ఉన్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పేర్కొంటున్నారు. కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను పూర్తిగా ఎత్తివేశాక కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై రాకేష్ అభిప్రాయాలను చూద్దాం.. టెస్ట్ మ్యాచ్ బుల్ మార్కెట్ అంటే క్రికెట్లో టెస్ట్ మ్యాచ్వంటిదని చెప్పవచ్చు. ఇది 50 ఓవర్లలో ముగిసే గేమ్ కాదు. అయితే బుల్ ట్రెండ్ మొదలయ్యేముందు మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవడం సాధారణం. కొత్తగా మొదలయ్యే ప్రతీ బుల్ మార్కెట్ గతంలో నమోదైన బుల్ ట్రెండ్కంటే ప్రభావవంతంగా ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభణతో మార్చిలో వెల్లువెత్తిన భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో ఇక్కడినుంచి దేశీ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలుంది. పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకోనున్న సంకేతాలను ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ ప్రతిబింబిస్తోంది. లాక్‌డవున్‌ను పూర్తిగా ఎత్తివేశాక ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వ్యయప్రణాళికలు అమలు చేసే అవకాశముంది. రిస్క్ తక్కువే ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు భారీగా పతనంకాకపోవచ్చు. ఇప్పటికే ప్రారంభమై బుల్ మార్కెట్ నేపథ్యంలో కంపెనీల ఈపీఎస్‌లు, పీఈ రేషియోలు విస్తరించే వీలుంది. గత మూడు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లూ సమస్యలు ఎదుర్కొన్నాయి. అనవసర భయాల కారణంగా కోవిడ్-19 సంక్షోభం అధికమైనట్లు తోస్తోంది. ఇది ఒక ఫ్లూ వ్యాధి మాత్రమే. ప్లేగు లేదా క్యాన్సర్కాదు. దీర్ఘకాలంలో కోవిడ్-19 కారణంగా పెను మార్పులు కనిపించకపోవచ్చు. ప్రజలు తిరిగి ప్రయాణాలు చేయడం, రెస్టారెంట్లను సందర్శించడంవంటివి చేపడతారని చెప్పవచ్చు. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన నష్టాలపై ఒక అవగాహనకు రావడం ద్వారా ప్రభుత్వం తదుపరి దశలో తగిన చర్యలు చేపట్టే వీలుంది. కోవిడ్-19 సవాళ్ల తదుపరి పలు కంపెనీలు యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. కొన్ని కంపెనీలు వేగవంత వృద్ధిని అందుకోవచ్చు. మరికొన్ని కంపెనీలు సవాళ్లను అధిగమించడంలో మరికొంత శ్రమించవలసిరావచ్చు. అనిశ్చితి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇటీవల బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు తలెత్తాయి. డిసెంబర్ తదుపరి మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల(ఎన్పీఏలు) సమస్యల వివరాలు వెల్లడయ్యే వీలుంది. దీంతో ఫైనాన్షియల్ రంగ కౌంటర్లు అంతంత మాత్ర పనితీరునే చూపవచ్చు. ఎన్బీఎఫ్సీ రంగంలో కన్సాలిడేషన్‌కు దారి ఏర్పడవచ్చు. అయితే హౌసింగ్ రంగానికి భారీ సమస్యలు ఎదురుకాకపోవచ్చని అంచనా. పలు సంస్థలు దివాళా బాట పట్టడం ద్వారా ఫైనాన్షియల్ రంగంలో సమస్యలు పెరగనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఇతర సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ కస్టమర్లు అతితక్కువగా రుణ చెల్లింపుల వాయిదాల మారటోరియంవైపు మొగ్గు చూపడం గమనించదగ్గ అంశం! -
రాబోయేది భారీ బుల్ మార్కెట్!
కరోనా సంక్షోభ భయాలు సద్దుమణిగి, ప్రభుత్వ ప్యాకేజీలు ఫలితాలు ఇవ్వడం ఆరంభమైతే ప్రపంచ వ్యాప్తంగా భారీ బుల్ మార్కెట్ వస్తుందని మోర్గాన్‌స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ బలమైన ఉద్దీపనలు తీసుకువచ్చాయని, ఇంత బలమైన పత్రిస్పందన ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం సైతం ప్రపంచ దేశాలు ఇంత పకడ్బందీగా, సమన్వయపూరకంగా స్పందించడం జరగలేదన్నారు. 2008 సంక్షోభం తర్వాత ఇచ్చిన ఉద్దీపనలకన్నా ప్రస్తుత ఉద్దీపనలు ఎన్నో రెట్లు ఎక్కువన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్దీపనలు మార్కెట్లకు ఇచ్చే ఉత్తేజం ఆరంభమవుతుందని, దీంతో అన్ని దేశాల్లో భారీ బుల్ ర్యాలీ వస్తుందని అంచనా వేశారు. ఎకానమీలో, సమాజంలో భరోసా తిరిగివస్తే ఈ ప్యాకేజీలన్నీ అద్భుత ఫలితాలిస్తాయన్నారు. ఇందుకోసం ముందుగా కరోనాకు వాక్సిన్ కానీ, మందుకానీ కనుక్కోవాల్సిఉంటుందన్నారు. ఒక్కసారి ఈ వైరస్‌కు విరుగుడు వచ్చిందంటే అసెట్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. అయితే విరుగుడు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. లాక్డౌన్ ముగిసిపోవడమే అతిపెద్ద ప్యాకేజీ ఎకానమీకి అన్నింటి కన్నా పెద్ద ఉద్దీపన లాక్డౌన్ ముగిసిపోయి కార్యకలాపాలు ఆరంభం కావడమేనని దేశాయ్ చెప్పారు. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ సామర్ధ్యాధారితంగా ఉందన్నారు. బహుశ ప్రభుత్వం వద్ద ఇంకో ప్యాకేజీ రెడీగా ఉండిఉండొచ్చని లేదంటే అటు వృద్ధి ఉద్దీపనతో పాటు ఇటు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్యాకేజీని ప్రకటించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ నుంచి మనకు తెలియకుండానే క్రమంగా బయటపడుతున్నామని చెప్పారు. వచ్చే రెండు మూడువారాల్లో ఎకానమీలో చురుకుదనం తెస్తే క్రమంగా అంతా సర్దుకుంటుదన్నారు. ప్రస్తుత, రాబోయే త్రైమాసికాలకు కంపెనీల ఫలితాలు, ప్రదర్శనపై పెద్దగా ఫోకస్ చేయాల్సిన పనిలేదని, ఆపైన మాత్రం అంతా బాగుంటుందని అంచనా వేశారు. మక్కువ మారుతోంది ప్రస్తుతం ఇన్వెస్టర్ల ఫోకస్ ఫైనాన్షియల్స్ నుంచి ఫార్మా, టెలికం, డిజిటల్ రంగాల షేర్లవైపు మరలుతోందని దేశాయ్ చెప్పారు. ప్రతి బుల్మార్కెట్లో కొత్త రంగాలు ప్రకాశిస్తుంటాయని గుర్తు చేశారు. 90ల్లో ఎనర్జీ, ఆ తర్వాత కన్జూమర్, టెక్నాలజీ రంగాల హవా నడిచిందని, ఆపైన బీఎఫ్ఎస్ఐ రంగంపై ఫోకస్ పెరిగిందని చెప్పారు. గత ఫిబ్రవరిలో నిఫ్టీలో ఫైనాన్షియల్స్ మార్కెట్ క్యాప్ 30 శాతాన్ని చేరిందని, దీంతో ఈ రంగం టాప్‌అవుట్ చెందినట్లు భావించవచ్చని చెప్పారు. అందువల్ల రాబోయే బుల్మార్కెట్లో కన్జూమర్, హెల్త్‌కేర్, టెలికం రంగాల్లాంటి షేర్ల హవా ఉంటుందన్నారు. మార్చి 24న మార్కెట్ బాటమ్ అవుట్ అయినట్లు అభిప్రాయపడ్డారు. అంతమాత్రాన ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అసలు ర్యాలీలే ఉండవని భావించకూడదని, కాకపోతే గతంలోలాగా మార్కెట్‌ను ముందుండి నడిపించలేవని మాత్రమే భావించాలని చెప్పారు. ఈ రంగంలో టాప్ స్టాక్స్‌ను నమ్మవచ్చన్నారు. కరోనా కారణంగా దేశీయ కస్టమర్ల వైఖరిలో మార్పురావచ్చనే ఊహలను ఆయన కొట్టిపారేశారు. లాక్డౌన్ పూర్తయ్యాక టైమ్‌గ్యాప్‌తో అన్ని రంగాలు గాడిన పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదీ ఏమైనా కరోనా కారక సంక్షోభం 6-12 నెలలకు మించి ఉండకపోవచ్చని దేశాయ్ చెప్పారు. -
ఈ ఐదు రంగాల్లో ‘మెరుపులు’!
ఇది బుల్‌మార్కెట్ 2.0 ► జాబితాలో పీఎస్‌యూ బ్యాంకింగ్, మెటల్స్, ఫార్మా, విద్యుత్, ఎన్బీఎఫ్సీలు ► స్టాక్ మార్కెట్ నిపుణుల అంచనా... స్టాక్ మార్కెట్ కదం తొక్కుతోంది. గత ఏడాది 15 శాతం లాభపడిన సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటికే 10 శాతం వరకూ ఎగసింది. బుల్‌మార్కెట్ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడమనేది చాలా చిక్కు ప్రశ్న. అయితే, ఈ ఏడాది ఐదు రంగాలు మంచి వృద్ధిని సాధిస్తాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, లోహ, విద్యుత్, ఫార్మా, ఎన్బీఎఫ్సీ రంగాలు మంచి రాబడులనిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సెన్సెక్స్ ప్రస్తుతం అధిక స్థాయిల్లోనే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతమున్న స్థాయి నుంచి మరింత పైకి దూసుకుపోవాలంటే కొన్ని సానుకూల అంశాలు కలసిరావాలి. కంపెనీల ఆర్థిక ఫలితాలు బావుండాలి. ప్రపంచ స్థితిగతులు నిలకడగా ఉండాలి. కమోడిటీ ధరలు స్థిరంగా ఉండాలి. అయితే ఇవి అటూ, ఇటూగా ఉన్నా సరే, భారత్‌లో బుల్‌మార్కెట్ జోరు కొనసాగుతుంది’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బుల్‌మార్కెట్ 2.0: స్టాక్ మార్కెట్‌కు ప్రస్తుతమున్న అధిక స్థాయిలు సమంజసమేనని హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ సచ్దేవ్ అభిప్రాయపడ్డారు. ఇది బుల్‌మార్కెట్ 2.0 అని ఆయన అభివర్ణిస్తున్నారు. 2003 నుంచి 2007లో వచ్చిన బుల్ మార్కెట్ కంటే కూడా ఇది మెరుగైనదని, ఏడాది–ఏడాదిన్నర తర్వాత మనం ఖచ్చితంగా ఇప్పటికంటే మంచి స్థితిలోనే ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పోల్చితే భారత స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో నెలలోనూ మంచి పనితీరు కనబరుస్తోందని క్రెడిట్ సూసీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో తిరుగులేని ర్యాలీ.. ఈ ఏడాది ఇప్పటికే పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు మంచి లాభాలను సాధించాయి. గత ఏడాదికాలంలో ఈ షేర్లు 85 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. ఈ షేర్లలో ఎంత రిస్క్ తీసుకుంటే అంతగా లాభాలు వస్తాయి. ఇటీవలే ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనమైన విషయం తెలిసిందే. మరిన్ని విలీనాలు జరిగే అవకాశముంది. ఆర్బీఐ ‘ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్’ మార్గదర్శకాలు పీఎస్‌యూ బ్యాంక్ షేర్లను మరింతగా పరుగులు పెట్టించొచ్చు. కొన్ని చిన్న బ్యాంక్‌ల షేర్లు కొన్ని నెలల్లోనే 2–3 రెట్లు పెరిగే అవకాశాలున్నాయని జేఎమ్ ఫైనాన్షియల్ టెక్నికల్ ఎనలిస్ట్ గౌతమ్ షా పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల జోరు... పెద్ద నోట్ల రద్దు తర్వాత కుదుపునకు గురైన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ)లు ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ సచ్దేవ్ చెప్పారు. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేట్ బ్యాంక్‌లు జోరుగా పెరుగుతాయన్నారు. ‘పలు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యత స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ సంస్థల నిధుల సమీకరణ వ్యయాలు తక్కువగా ఉండడం, ఇతర కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయి’ అని వివరించారు. ఫార్మా రంగంలో అవకాశాలు అపారం.. అమెరికా ఎఫ్‌డీఏ కఠిన నిబంధనలు, రూపాయి బలపడడం వంటి ప్రతికూలతలతో గత 12–18 నెలలుగా ఫార్మా షేర్లు తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రెండేళ్లలో అమెరికా ఎఫ్‌డీఏ తలనొప్పులన్నీ తగ్గిపోతాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మనీశ్ గున్వాణి అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో భారత కంపెనీలకున్న సానుకూలతల కారణంగా ఫార్మా షేర్లు రాణించే అవకాశాలు అపారంగా ఉన్నాయన్నారు. అత్యున్నత ప్రమాణాలున్న మేనేజ్మెంట్స్, కంపెనీల కారణంగా అమెరికా జనరిక్స్ మార్కెట్లోనే కాకుండా ఇతర ప్రపంచ మార్కెట్లలలోనూ మన ఫార్మా కంపెనీలు దూసుకుపోతాయని ఆయన వివరించారు. విద్యుత్ రంగ వెలుగులు.. ఈ రంగం మట్టిలో మాణిక్యం లాంటిది. గత ఏడాది కాలంలో ఈ రంగ షేర్లు మంచి లాభాలనే ఇచ్చాయి. సీఈఎస్ఈ 76 శాతం, పవర్ గ్రిడ్ 44 శాతం, క్రాంప్టన్ గ్రీవ్స్ 44 శాతం, జీఎమ్ఆర్ ఇన్ఫ్రా 33 శాతం చొప్పున లాభపడ్డాయి. దాదాపు ఏడేళ్ల చీకటికాలం తర్వాత విద్యుత్ రంగ షేర్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. గత నెల కాలంలోనే పలు విద్యుత్ షేర్లు 15–20 శాతం రేంజ్లో లాభపడ్డాయి. విద్యుత్ షేర్లలో ర్యాలీ ఇప్పుడే మొదలైంది. ఈ ఏడాదిలో ఈ రంగం షేర్లు కనీసం 40–50 శాతం రాబడులనివ్వవచ్చని గౌతమ్ షా అంటున్నారు. తగ్గినప్పుడల్లా లోహ షేర్లు కొనండి గత ఏడాది కాలంలో సెన్సెక్స్ కంటే అధికంగానే పలు లోహ షేర్లు లాభపడ్డాయి. కోల్ ఇండియా, వెల్స్పన్ కార్పొ, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కంపెనీ.. వాటిల్లో కొన్ని. గత ఆర్నెళ్లుగా లోహ షేర్లు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. కానీ గత పది ట్రేడింగ్ సెషన్లలో వీటిపై ఒత్తిడి కనిపిస్తోంది. అయినప్పటికీ, లోహ షేర్లు పడినప్పుడల్లా కొనుగోలు చేయడం మంచిదని గౌతమ్ షా సూచిస్తున్నారు. ఈ ఏడాది అంతా లోహ షేర్ల ర్యాలీ కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. మధ్య మధ్యలో ఈ షేర్లు పతనమైనా, 3–4 శాతం మించి నష్టం ఉండదని పేర్కొన్నారు. -
మార్కెట్లపై ఝున్ ఝున్‌వాలా జోస్యం
న్యూఢిల్లీ : దలాల్ స్ట్రీట్ సూచీల కదలికలు ఎప్పుడు ఎటువైపు సాగుతాయో ప్రతి ఒక్కరికీ సందేహమే. ఓ సారి టాప్‌లో ఎగుస్తాయి. మరోసారి ఢమాల్ మనిస్తాయి. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్‌గా కీర్తి గడించిన రాకేశ్ జున్‌జున్‌వాలా మార్కెట్లో చూడబోతున్న ఆసక్తికరమైన అంశాలు మీడియాకు వివరించారు.. దలాల్ స్ట్రీట్‌లో బిగ్ బుల్‌ను చూడబోతున్నామని.. 2003లో చూసిన జోష్‌ను మార్కెట్లు ప్రతిబింబించబోతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడిదారుల తక్కువగా పాల్గొనడం బుల్ మార్కెట్‌కు ప్రారంభదశలో ఉండటాన్ని సూచిస్తుందన్నారు. ఫెడరల్ రిజర్వు రేట్లు పెంచితేనే దేశీయ మార్కెట్లు కరెక్ట్ చెందుతాయన్నారు. అమెరికా రేట్లు కూడా 1-1.5 శాతం కంటే ఎక్కువ పెరుగుతాయని అంచనావేయడం లేదని పేర్కొన్నారు. రేట్ల పెంపు లేనంత వరకు అంతర్జాతీయంగా మార్కెట్లలో ర్యాలీ ఇలానే కొనసాగుతుందని వెల్లడించారు. గ్లోబల్ ర్యాలీతో సెన్సెక్స్ ఫిబ్రవరి చివరి కల్లా 18 శాతం ఎగిసినట్టు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్న ఇండియన్ ఐటీ రంగంలో వృద్ధి కొనసాగింపును చూస్తామని.. కానీ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మాత్రం పెట్టుబడిదారులే నిర్ణయించుకోవాలని సూచించారు. గోల్డ్ మార్కెట్లో కూడా బుల్లిష్ ట్రెండ్ చూస్తామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్ తీసుకున్న విధానాలు బాగున్నాయని వివరించారు. రాజన్ 8900 కోట్ల పోర్ట్‌ఫోలియో కలిగిన జున్‌జున్‌వాలా, ఇండియా వారెన్ బఫెట్‌గా పేరుగాంచారు. -
128పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు!