breaking news
british people
-
గూగులమ్మను తెగ వెతికేశారు
అసలు బ్రెగ్జిట్ అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే ఏం జరుగుతుంది, ఈయూ ఎప్పుడు రూపొందింది.. ఇలాంటి విషయాలేవీ రిఫరెండంలో ఓటు వేసే ముందు చాలామంది బ్రిటిషర్లకు తెలియదు. ఎందుకంటే, ఓటింగ్ పూర్తయ్యి.. ఫలితాలు కూడా వెలువడిన తర్వాత చాలామంది ఈ తరహా ప్రశ్నలతో గూగుల్ సెర్చిని మోతెక్కించారట. కేవలం రిఫరెండం ఫలితాల గురించే కాక.. బ్రెగ్జిట్ గురించిన ప్రాథమిక సమాచారం కోసం చాలామంది గాలించినట్లు గూగుల్ తెలిపింది. ‘‘మనం యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతే ఏమవుతుంది’’ అనే ప్రశ్న చాలా ఎక్కువగా వచ్చిందని ప్రకటించిది. ఇంకా చాలామందికి అసలు యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి, అది ఎప్పుడు ప్రారంభమైంది, అందులో ఎన్ని దేశాలున్నాయి.. ఇలాంటి విషయాలు కూడా తెలియవని, ఇలాంటి అనేక ప్రశ్నలను గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా వేశారని తెలిపింది. డేవిడ్ కామెరాన్ వయసెంత, ఆయన రాజీనామా చేశారా, ఆ తర్వాత ప్రధాని ఎవరవుతారు.. ఇలాంటి ప్రశ్నలు సైతం వచ్చాయి. అలాగే అసలు మనం యూరోపియన్లమేనా అనే ప్రశ్నను కూడా చాలా ఎక్కువ మంది అడిగారంటూ గూగుల్ వివరించింది. వాళ్లు వేసిన మరికొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి... నేను ఈయూ రిఫరెండంలో ఎలా ఓటు వేయాలి బ్రెగ్జిట్ అంటే ఏంటి ఈయూ రిఫరెండంలో ఎవరెవరు ఓట్లు వేయచ్చు ఈయూ రిఫరెండం ఎప్పుడు నిర్వహిస్తారు నేను ఎక్కడ ఓటు వేయచ్చు మనం ఈయూలో ఎందుకు ఉండాలి మనం ఈయూను ఎందుకు వదిలేయాలి మనం వదిలేస్తే ఏం జరుగుతుంది ఈయూ డిబేట్లో ఎవరు నెగ్గారు ఈయూలో ఏవేం దేశాలు ఉన్నాయి డేవిడ్ కామెరాన్ తర్వాత ఎవరు వస్తారు డేవిడ్ కామెరాన్ రాజీనామా చేశారా అసలు కామెరాన్ ఎందుకు రిఫరెండం పిలిచారు డేవిడ్ కామెరాన్ వయసెంత -
బ్రిటన్‌లో నెలకు నాలుగుసార్లే..!
రోజురోజుకూ జీవితం మీద విరక్తి పుడుతోంది. అసలు ఏమీ చేయబుద్ధి వేయట్లేదు.. అందుకే శృంగారం కూడా నెలకు నాలుగుసార్లు మాత్రమే చేస్తున్నారట బ్రిటిషర్లు. ఈ విషయం ఓ సర్వేలో తేలింది. నెలలో 30 సార్లు శృంగారం చేసేవాళ్లు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నారట. ద అబ్జర్వర్ అనే పత్రిక ఈ సర్వే చేసింది. అయితే.. ఎన్ని సార్లయినా సరే తాము మాత్రం తమ శృంగార జీవితంతో సంతోషంగానే ఉన్నామని 63 శాతం మంది చెబుతున్నారు. ఇది కూడా ఇంతకుముందు చేసిన సర్వేతో పోలిస్తే తగ్గింది. అప్పుడు 76 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్నెట్లో పరిచయం అయినవారితో తాము శృంగారంలో పాల్గొన్నట్లు ప్రతి ఏడుగురిలో ఒకరు చెప్పారు. ఇక తాము వేశ్యల వద్దకు వెళ్లినట్లు 22 శాతం మంది అన్నారు. 2008లో కంటే ఇది నాలుగు శాతం ఎక్కువ. ఆన్లైన్లో 76శాతం మంది పురుషులు పోర్నోగ్రఫీ గురించి చదవితే, 53 శాతం మంది మహిళలు ఎరోటికా గురించి చదివారు. తమకు 16 ఏళ్లు వచ్చేలోపే కన్యత్వాన్ని కోల్పోయామని ప్రతి ఐదుగురు యువతుల్లో ఒకరు చెప్పారు. సగటున ప్రతి బ్రిటిష్ వ్యక్తికి పదిమంది శృంగార భాగస్వాములు ఉన్నారని కూడాసర్వేలో తెలిసింది.