-
బ్రిటన్ రాణికి 10వ ముని మనవడు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 తనకి 10వ మునిమనవడు పుట్టినందుకు ఆనందంతో పొంగిపోతున్నారు. రాణి ఎలిజబెత్ మనవరాలు జారా తిండాల్ బాబుకి జన్మని చ్చారు. ఆ బాబుకి లుకాస్ ఫిలిప్ తిండాల్ అని పేరు పెట్టారు. బ్రిటన్ సింహాసనానికి క్యూ కట్టిన వారసుల్లో లుకాస్ 22వ స్థానంలో ఉన్నాడు. రాణి ఎలిజెబెత్ కూతురి కూతురైన జారా తిండాల్, ఆమె భర్త ఇంగ్లండ్ రగ్బీ మాజీ ఆటగాడు మైక్ తిండాల్కు మూడో సంతానంగా లుకాస్ పుట్టాడు. జారా బాత్ రూమ్‌లోనే బాబుకి జన్మనివ్వడం విశేషం. ఆస్పత్రికి తీసుకువెళ్లే వ్యవధి లేకపోవడంతో బాత్రూమ్లోనే తమ బిడ్డకు స్వాగతం పలికారు. రాణి దంపతులు బాబును చూడాలని ముచ్చట పడుతున్నారని, పరిస్థితులు అనుకూలించాక వాళ్లు కలుసుకుం టారని ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. -
రాణి వెడలె
క్రిస్మస్కింకా రెండు రోజుల సమయం ఉంది. బ్రిటన్ ప్రజలు మాత్రం గత శుక్రవారమే అధికారికంగా క్రిస్మస్ మూడ్‌లోకి వచ్చేశారు. ఇది ఏటా ఉండేదే. క్వీన్ ఎలిజబెత్–2 లండన్‌లోని తన అధికార నివాసం బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి అక్కడికి నూట పన్నెండు మైళ్ల దూరంలోని శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌కు రైల్లో బయల్దేరగానే బ్రిటన్ అంతటా క్రిస్మస్ సందడి మొదలౌతుంది. తొంభై మూడేళ్ల బ్రిటన్ రాణిగారు ఎప్పటిలా ఈ ఏడాది కూడా సాధారణ ప్రయాణీకుల రైల్లోనే తనకోసం ప్రత్యేకంగా ఒక బోగీని రిజర్వు చేయించు కుని డిసెంబరు 20న కింగ్ లిన్స్ స్టేషన్లో దిగారు. శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్ అక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. ఆమె తండ్రి ఆరవ జార్జి, తాత ఐదవ జార్జి నివసించిన రాజప్రాసాదం అది. అతి ముఖ్యులు ఆఖర్న ప్రతి క్రిస్మస్కీ కుటుంబంతో పాటు శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో గడిపి వెళ్తారు క్వీన్ ఎలిజబెత్. మొదట ఆమె, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ వెళ్తారు. వాళ్ల వెనుక మిగతావాళ్లు. ఆ మిగతావాళ్లు కూడా ఎవరు పడితే వాళ్లు రైలు ఎక్కేయడానికి లేదు. దానికో క్రమం ఉంటుంది. క్వీన్, ప్రిన్స్ వెళ్లాక.. ఇక ఆ వంశంలో వయసులో బాగా చిన్నవాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లు బయల్దేరి వెళ్లారు. అందరి కన్నా చివర్లో ‘అతి ముఖ్యులు’ ఎస్టేట్‌కు చేరుకుంటారు. ఆ అతి ముఖ్యులు ఎవరంటే.. వారసత్వ స్థానానికి ప్రాధాన్యతా క్రమంలో ఉన్న క్వీన్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్, ఆ కుమారుడి కుమారుడు ప్రిన్స్ విలియమ్స్, విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్.. అలా ఉంటుంది సంప్రదాయం. ఈసారి క్వీన్ ఎలిజబెత్‌తో పాటు ప్రిన్స్ ఫిలిప్ కూడా శాండ్రింగ్‌హామ్ ప్రయాణానికి సిద్ధం అయినప్పటికీ శుక్రవారం ఉదయం ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో ఆయన్ని లండన్‌లోని కింగ్ ఎడ్విర్డ్ సెవెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించవలసి వచ్చింది. ‘‘98 ఏళ్ల వయసులో ఇవి అవసరమైన పరీక్షలే తప్ప అకస్మాత్తు పరీక్షలేమీ కావు’’ అని రాజ వైద్యుడు చెప్పడంతో క్వీన్ తన మనసును కుదుటపరచుకుని తనొక్కరే శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌కు వెళ్లవలసి వచ్చింది. ముందుగా నిర్ణయించిన సమయం కాబట్టి వెళ్లి తీరవలసి వచ్చింది. రెండు విందు భోజనాలు ఏటా రాజ కుటుంబం అంతా ఈ ఎస్టేట్‌లోనే క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ డే వేడుకలు జరుపుకుంటుంది. క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ ఒకటి కాదు. క్రిస్మస్ కోసం ఎదురు చూసే ముందురోజు సాయం సమయం అంతా క్రిస్మస్ ఈవ్ అయితే, ఆ మర్నాడు చేసుకునేది క్రిస్మస్. శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో క్రిస్మస్ ఈవ్‌కి రాజకుటుంబం ‘బ్లాక్ టై డిన్నర్’ చేస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంది. క్రిస్మస్ రోజు టర్కీ కోడి విందు భోజనం ఎలాగూ ఉంటుంది. ముఖ్యమైన బయటి వ్యక్తులతో కలిసి చేసే డిన్నర్ ‘బ్లాక్ టై డిన్నర్’ అయితే, కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి చేసేది టర్కీ కోడి విందు. దీనినే టర్కీ ఫీస్ట్ అంటారు. ఇలా అనడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం రైతులు పాల కోసం పశువుల్ని, గుడ్ల కోసం కోళ్లను తమ దగ్గర ఉంచుకుని, టర్కీ కోళ్ల ను మాత్రమే మాంసం కోసం అమ్మేవారట! పైగా అప్పట్లో పశువులు, కోళ్ల ధర ఎక్కువగా ఉండటం అందుకొక కారణం అంటారు. ఏదైనా టర్కీ ఫీస్ట్ అనేది బ్రిటన్‌లోనే కాదు, ఒక్క క్రిస్మస్ రోజే కాదు.. అన్ని పాశ్చాత్య దేశాలలో, అన్ని వేడుకలలో సంప్రదాయం అయింది. లిగింతల కానుకలు క్రిస్మస్ ఈవ్‌కి రాజమాత కుటుంబ సభ్యులు ఇచ్చిపుచ్చుకునే కానుకలు కూడా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ప్రత్యేకమైనవే తప్ప ఖరీదైనవి కాదు. పైగా మనసును ఉల్లాసపరిచేలా ఉంటాయి. తేనీటి విందు సమయంలో అందరూ కూర్చొని ఆ కానుకలను తెరచి చూసుకుంటారు. ఓ క్రిస్మస్ ఈవ్‌కి ప్రిన్స్ హ్యారీ తన నానమ్మకి (క్వీన్ ఎలిజబెత్‌కి) షవర్ క్యాప్‌ని గిఫ్టుగా ఇచ్చారు! షవర్ క్యాప్ అంటే స్నానం చేసేటప్పుడు తలపై షవర్ నీళ్లు పడకుండా పెట్టుకునేది. ఆ క్యాప్‌పైన ‘ఎయింట్ లైఫ్ ఎ బిూూూూ’ అని రాసి ఉంది. దాన్ని చూసి క్వీన్ తన మనవడి తాత్వికతకు మురిపెంగా నవ్వుకున్నారు. కష్టాలు వెంటపడి తరుముతున్నప్పుడు. ‘జీవితం ఏం బాగాలేదు’ అని చెప్పడానికి మొరటుగా వాడే మాట ఇది. హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఇచ్చిన సింగింగ్ హామ్‌స్టర్ (మైకు పట్టుకుని పాట పాడే ఎలుక బొమ్మ) కూడా క్వీన్ ఎలిజబెత్‌ను నవ్వించింది. ఎలిజబెత్ ఏకైక కుమార్తె ప్రిన్సెస్ యాన్ తన అన్న ప్రిన్స్ చార్లెస్‌కి లెదర్ టాయిలెట్ సీట్‌ను కానుకగా ఇచ్చారు. కేట్ మిడిల్టన్ తన మరిది ప్రిన్స్ హ్యారీకి ‘గ్రో–యువర్–ఓన్–గర్ల్‌ఫ్రెండ్’ కిట్‌ను ఇచ్చారు. ఎదిగే ఆడపిల్లలకు ఇచ్చే బొమ్మల కిట్ అది. ఈ నవ్వుల కానుకల సంప్రదాయం గురించి తెలియక ప్రిన్సెస్ డయానా రాజప్రాసాదంలో కొత్త కోడలిగా అడుగు పెట్టిన మొదటి ఏడాది క్రిస్మస్ ఈవ్‌కి ఇంట్లో వాళ్లందరికీ ఖరీదైన కాష్మియర్ స్వెట్టర్లు, (కశ్మీర్ స్వెట్టర్లు కాదు), మెహెయిర్ స్కార్ఫ్‌లు ఇస్తే అందరూ ఆమెను ఆటపట్టించారట. ఈ క్రిస్మస్కి ఎవరు ఎవరికి ఎలాంటి కానుకలు సిద్ధం చేసి ఉంచారో మరి. కింగ్ లిన్స్ స్టేషన్లో రైలు నుంచి దిగుతున్న బ్రిటన్ రాణి ఈసారి కొంచెం లేట్ వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్ ఇంకాస్త ముందుగానే శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌కి వెళ్లవలసి ఉన్నప్పటికీ ఇటీవలి బ్రిటన్ ఎన్నికల కారణంగా ఆమె ప్రయాణం కొంచెం ముందుకు జరిగింది. ఇప్పుడిక క్రిస్మస్ అయ్యాక కూడా రాణిగారు ఆ ఎస్టేట్‌లోనే మరికొన్ని రోజులు గడిపే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు, మనవలు, మునిమనవలు.. అంతా ఒకేసారి, ఒకే చోట ఆనందంగా కలుసుకునేందుకు ఏటా క్రిస్మస్ తనకు ఇచ్చే మహద్భాగ్యాన్ని రాణిగారు అంత తేలిగ్గా ఏమీ విడిచిపెట్టరు అని బ్రిటన్ రాజకుటుంబీకుల వర్తమానాన్ని ఎప్పటికప్పుడు లిఖిస్తుండే బయోగ్రఫర్లు అంటుంటారు. -
కోహినూర్‌పై వివరాలు అందించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యల సమాచారాన్ని అందించలేమని కేంద్రం పేర్కొంది. లండన్‌లోని బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుపై ప్రభుత్వం ఈ అభిప్రాయం వెల్లడించింది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున ఎటువంటి సమాచారాన్ని అందించలేమని పురావస్తు శాఖ పేర్కొంది. -
'క్వీన్ ఎలిజెబెత్ సారీ చెప్పాలి'
లాహోర్: బ్రిటన్ క్వీన్ ఎలిజెబెత్ 2 క్షమాపణలు చెప్పి తీరాలని పాకిస్థాన్‌లో ఓ హక్కుల కార్యకర్త డిమాండ్ చేశాడు. 1931లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌ను పట్టుకొని ఉరితీసినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని అన్నారు. మార్చి 23న భగత్ సింగ్ 85 వర్దంతి సందర్భంగా అతను రెండు ప్రాంతాల్లో భగత్ సింగ్ కు ఘననివాళి అర్పించాడు. ఒకటి భగత్ సింగ్ జన్మ స్థానం అయిన ఫైసలాబాద్‌లోని జరన్ వాలాకు సమీపంలోని బంగా చౌక్ లో నిర్వహించగా మరొక కార్యక్రమాన్ని భగత్ సింగ్‌ను తన అనుచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్‌తో కలిపి ఉరితీసిన షాద్ మాన్ చౌక్ ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భగత్ సింగ్ అభిమానులు తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 'గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్‌ను ఉరితీసినందుకు క్వీన్ ఎలిజెబెత్ -2 తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి' అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనికి అంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
చిట్టి తల్లికి పెద్ద దెబ్బ.. క్షమాపణలు!
లండన్: చక్కగా ఎర్రటి గౌను వేసుకొని, తలపై నల్లటోపి పెట్టుకొని చేతిలో పూల బొకేతో చిరునవ్వులు చిందిస్తున్న కనిపిస్తున్న ఆ పాప పేరు మైసీ గ్రాగరీ. ఆరేళ్ల ఈ పాప పూల బొకే ఇస్తుంది ఎవరికనుకుంటున్నారు? బ్రిటన్ మహారాణికి. చక్కగా వందనం చేస్తూ తనకు పూల బొకే అందించిన మైసీని బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2 అభినందించి అలా ముందుకు వెళ్లిందో లేదో ఆ పాప ఆనందం ఇట్టే మాయమైంది. కెవ్వున ఏడుపు కేక పెట్టింది. ఎందుకంటారా.. మరేం లేదు.. బ్రిటన్ రాణి వస్తుండగా ఆమెకు స్వాగతం పలికే సోల్జర్స్లో ఒకతను ఆ పాప మైసీ పక్కనే ఉన్నాడు. పూల బొకే అందుకుని బ్రిటన్ రాణి సరిగ్గా తనను దాటి వెళుతుండగా అతడు వేగంగా తన చేయితో సెల్యూట్ చేశాడు. ఈ క్రమంలో అతడి చేయి మైసీకి బలంగా తగలడంతోపాటు టోపీ కూడా ఊడిపోయింది. దీంతో అప్పటి వరకు నవ్వులు చిందించిన ఆ చిన్నారి ఒక్కసారిగా భయంతో భిక్కమొఖం పెట్టి తన తల్లి చాటుకు వెళ్లి నిల్చుని బుంగమూతితో కాస్త కోపంగా ఆ సైనికుడి వైపు చూసింది. ఆ వెంటనే సైనికుడు దగ్గరికొచ్చి మైసీకి, ఆమె తల్లికి క్షమాపణలు చెప్పాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
No Headline
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
జగన్‌తోనే పారదర్శక పాలన
సమరోత్సాహంలో యువత
గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం
జనం చిత్రవధ
బాబుది ముమ్మాటికీ నిరాదరణే..
సంక్షేమంలో ఛాలెంజ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement