breaking news
bride parents
-
బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యామిలీ
పెళ్లి వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను పలకరించడం, పెళ్ళి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. ‘టైమే బంగారమాయెనే’ అనుకునే సమయం లోనూ ఒక పెళ్లిలో వధువు తల్లిదండ్రులు చేసిన డ్యాన్స్ వీడియో వీర లెవెల్లో వైరల్ అయింది. స్టైలిష్ బ్లాక్ అండ్ గోల్డెన్ చీరలో వధువు తల్లి, స్మార్ట్ త్రీ పీస్ సూట్లో తండ్రి వేదికపై వివిధ హావభావాలతో చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. స్టేజీ బ్యాక్గ్రౌండ్లో బాల్యం నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు వధువుకు సంబంధించిన రకరకాల విజువల్స్ కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ‘బ్యూటీఫుల్... లవ్లీ ఫ్యామిలీ’ లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వెల్లువెత్తాయి. -
వరుడు అదృశ్యం.. ఆగిన పెళ్లి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో పెళ్లి ఆగిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి వరుడు కనిపించకుండా పోయాడు. ముహూర్తం సమయానికి రాకుండా వరుడు అదృశ్యం కావడంతో వివాహం నిలిచిపోయింది. దాంతో వధువు బంధువులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.