breaking news
Breast Pump Paris
-
తల్లిపాల నిర్వహణలో... స్మార్ట్ పరికరాలు
బిడ్డ పుట్టడానికి ముందే తల్లిపాలు పట్టే పరికరాలను సిద్ధం చేసుకోవడం వల్ల ప్రసవానంతర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు అనేది నిపుణుల సూచన. ఫలితంగా తల్లి ప్రసవానంతరం కలిగే వివిధ రకాల ఒత్తిడులను తగ్గించుకునే వీలుంది.తల్లిపాల పరికరాలు రోజువారీ సవాళ్లలో కొన్నింటిని సులభతరం చేసినా, సరైన సహకారం అందినప్పుడే వాటిని బాగా వినియోగించుకోగలరు. చనుబాలు పట్టించే నిపుణుల గైడెన్స్‌తో పాటు బాధ్యతలను పంచుకునే భాగస్వామి మద్దతు అవసరం. ‘బిడ్డలకు పాలిచ్చే పనులను సులువు చేయడానికి తల్లులు బ్రెస్ట్ పంపులు (51 శాతం), నర్సింగ్ బ్రాలు (37 శాతం), నర్సింగ్ దిండ్లు (31శాతం) వంటి సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదికలు చూపుతున్నాయి. నవతరం అమ్మలకు వచ్చిన అనుకూల ఉత్పత్తుల గురించి...ఫీడింగ్ మానిటర్స్: శిశువు పాలు మింగే శబ్దాలను గుర్తించడానికి, ఎన్ని పాలు తాగిందో లెక్కించడానికి, ఏఐ–ఆధారిత సెన్సార్లు కూడా వచ్చాయి.రియల్–టైమ్ బ్రెస్ట్ ఫీడింగ్ వేరబుల్: ఇది రొమ్ము చుట్టూ చుట్టుకునే ఒక మృదువైన, అనువైన పరికరం. ఇది బయోఇంపిడెన్ ్సను ఉపయోగించి, శిశువు ఎన్ని పాలు తాగిందో అనే దానిపై క్లినికల్–గ్రేడ్, లైవ్ డేటాను మొబైల్ స్క్రీన్ లపై అందిస్తుంది. లాక్టేషన్ ప్యాడ్ డ్రగ్ ట్రాకర్లు: ఇవి మైక్రోఫ్లూయిడిక్ ఛానెల్స్, లేజర్–ప్రేరిత గ్రాఫేన్ సెన్సార్లతో పొందుపరిచిన మోడర్న్ వేరబుల్ ప్యాడ్స్. తల్లి తీసుకునే మందులు (ఎసిటమినోఫెన్ వంటివి) నేరుగా తల్లిపాలలోకి చేరే రేటును ట్రాక్ చేసి, కొలుస్తాయి.ఇన్ఫాంట్ స్మార్ట్ బాటిల్స్: ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి, సింక్రొనైజ్డ్ యాప్‌ల ద్వారా శిశువు బరువు పెరుగుదలను ట్రాక్ చేయడానికి బయోఫీడ్‌బ్యాక్ డేటాను అందిస్తాయి.ఇతర అనుకూలమైన పరికరాలు...ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్: వీటిని నర్సింగ్ బ్రా లోపల సెట్ చేసుకోవచ్చు. పాలు ఎక్కువైనప్పుడు ఈ పరికరం ద్వారా పాలు తీసి, స్టోరేజ్ చేయవచ్చు.నర్సింగ్ కవర్స్: తల్లిపాలు పట్టే సమయంలో మెడ భాగం నుంచి నడుము కిందవరకు ఆ్రపాన్ తరహాలో ఉండే కాటన్ కవర్ పూర్తిగా కప్పి ఉంచుతుంది. బిడ్డ పాలు తాగుతుండగా తల్లి నేరుగా చూసే అవకాశమూ ఉంటుంది. బయట పాలు పట్టడం అనే ఇబ్బందిని ఈ కవర్ దూరం చేస్తుంది.బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్: పాలిచ్చే సమయంలో బిడ్డను పిల్లోపైన పడుకోబెట్టడానికి., కదలకుండా ఉండటానికి.. వీటిని ఉపయోగిస్తుంటారు. పాలు తాగే సమయంలో తల్లికి–బిడ్డకు ఈ పిల్లో అనువుగా ఉంటుంది.నర్సింగ్ ప్యాడ్స్: లీక్ ప్రూఫ్స్, స్కిన్ ఫ్రెండ్లీవి లభిస్తున్నాయి. వాపు, నొప్పి ఉన్న రొమ్ము చర్మానికి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే చల్లని జెల్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రెస్ట్ మిల్క్ కంటెయినర్స్, స్టోరేజీ కప్స్: రొమ్ము నుంచి తీసిన పాలను కంటెయినర్లలో భద్రపరచేవి. సెన్సార్ స్టోరేజీ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి బిడ్డకు తగినంత ఉష్ణోగ్రతలలో పాలు ఉండేలా నిల్వ చేస్తాయి. ఓవెన్ లేదా స్టవ్ ఉపయోగించకుండా ఫ్రీజర్‌లో భద్రపరిచిన పాలను కరిగించే స్మార్ట్ బాటిల్ వార్మర్స్ అందుబాటులో ఉన్నాయి.సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్: మొదటిసారి బిడ్డకు పాలు పట్టే సమయంలో, ఆ తర్వాత చనుమొనలు చిట్లడం, నొప్పి సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్స్ బాగా ఉపయోగపడతాయి.బ్రెస్ట్ నిపుల్ క్రీమ్: ప్రసవం తర్వాత ΄÷డిబారిన, చిట్లిన, నొప్పిగా ఉన్న చనుమొనల సమస్యను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. -
అమ్మకు అవమానం
గాయత్రీబోస్‌కి 33 ఏళ్లు. ఇండియన్. సింగపూర్‌లో ఉంటోంది. ఇద్దరు పిల్లలు. మూడున్నరేళ్లు, ఏడున్నర నెలల పిల్లలు. గాయత్రి ట్రాన్స్పోర్ట్ కంపెనీ మేనేజర్. పని మీద ఈ మధ్య జర్మనీ వెళ్లింది. అక్కడి నుంచి ప్యారిస్ వెళ్లాలి. ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ రెడీగా ఉంది. ఈలోపు ఆమెను సెక్యూరిటీలో ఆపేశారు. ఆమె క్యారీబ్యాగ్‌ను స్క్రీన్ చేస్తున్నప్పుడు అందులో ‘బ్రెస్ట్ పంప్’ కనిపించింది. (బిడ్డ కోసం బాటిల్లో పాలు పట్టి ఉంచడానికి వర్కింగ్ మదర్స్ అ బ్రెస్ట్ పంప్ ఉపయోగిస్తారు). ‘‘బ్రెస్ట్ పంప్ సరే, బిడ్డ ఎక్కడ?’’అని అడిగారు అధికారులు. గాయత్రీ తనతోపాటు బిడ్డను తెచ్చుకోలేదు. ‘‘బేబీ, సింగపూర్‌లో ఉంది’’ అని చెప్పింది. వాళ్లకు అనుమానం వచ్చింది. వెంటనే మహిళా సిబ్బందిని పిలిపించి ‘డీప్’గా చెక్ చెయ్యమని పురమాయించారు. చెకింగ్ కోసం లోపలికి వెళ్లిన గాయత్రీ కన్నీళ్లతో బయటికి వచ్చింది. ఏడ్చుకుంటూనే ప్యారిస్ ఫ్లయిట్ ఎక్కింది. ఇంతకీ లోపల ఏం జరిగింది? ‘ఒక్కదానివే ప్రయాణిస్తున్నావు. ఈ బ్రెస్ట్ పంప్ ఎందుకు?’ అని అడిగారు. ‘నువ్వు నిజంగానే బిడ్డ తల్లివా?’ అని అడిగారు. ‘రుజువేమిటి?’ అన్నారు. అక్కడితో ఆగలేదు. బ్లవుజ్ ఓపెన్ చెయ్యమన్నారు. బ్లవుజ్ ఓపెన్ చేశాక.. పాలు వస్తున్నాయో లేదో చూడాలి.. కొద్దిగా నొక్కి చూపించు అన్నారు. గాయత్రి వాళ్లు చెప్పినట్లే చేసింది. ఆ తర్వాత మాత్రమే వాళ్లు ఆమెను వదిలిపెట్టారు. కానీ ఆమె వాళ్లను వదిలిపెట్టదలచుకోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ‘బ్రెస్ట్ చూపించాల్సి రావడం ఎంత అవమానం’ అని ఆవేదన చెందుతోంది గాయత్రి. ‘‘బ్రెస్ట్ పంప్


