breaking news
borampalli anjaneyulu
-
కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా బోరంపల్లి
అనంతపురం రూరల్ : అఖిల భారత కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా తనను నియమించినట్లు బోరంపల్లి ఆంజనేయులు తెలిపారు. ఈమేరకు జాతీయ అధ్యక్షుడు సతాన్‌సింగ్‌పాల్ నుంచి గురువారం నియామక ఉత్తర్వులు అందాయన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 10 కోట్లకు మందికి పైగా కురుబలు ఉన్నారని, కురుబల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
కురుబలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
చిలమత్తూరు : కురుబ కులస్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాయలసీమ జిల్లాల కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. గురువారం కొడికొండ చెక్‌పోస్టులోని టూరిజం హోటల్లో కురుబ కులస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర ్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల ఫెడరేషన్‌కు కురుబలచే పాలకవర్గాన్ని నియమించి రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 27న కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వíß స్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రవీణ్, రమేష్, మురళీ, సుధాకర్, శివ, మురళి, మధు, రాము, నంజప్ప, మల్లికార్జున, జి.శివప్ప, శంకర్ ఉన్నారు.