breaking news
Bombay Jaishree
-
తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ సింగర్
ప్రముఖ సింగర్ బాంబే జయశ్రీ అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం యూకేలో ఉన్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్రమైన మెడనొప్పితో ఆమె కిందపడిపోయారని సన్నిహితులు వెల్లడించారు. ఆమె లివర్‌పూల్‌లోని ఒక హోటల్లో అపస్మారక స్థితిలో కనిపించగా.. గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. (ఇది చదవండి: మా ఇంటి పని మనుషుల కాళ్లు మొక్కుతా..: రష్మిక) కాగా ఆమెకు కీ హోల్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మందులకు కూడా ప్రతిస్పందిస్తోందని సన్నిహితులు తెలిపారు. ఆమె కోలుకున్న తర్వాత చెన్నైకి చేరుకునే అవకాశముంది. కాగా.. బాంబే జయశ్రీ పాటలతో ఫేమ్ తెచ్చుకుంది. ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది. బాంబే జయశ్రీకి సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేయనున్నట్లు సంగీత అకాడమీ ఇటీవలే ప్రకటించింది. జయశ్రీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో అనేక సినిమా పాటలు పాడింది -
బాంబే రాగశ్రీ
బాంబే జయశ్రీ... భారతీయ సంగీతంలో పరిచయం అక్కర్లేని పేరు. ‘శశివదనే శశివదనే... స్వరనీలాంబరి నీవా...’ పాటను ఇష్టపడని సంగీత ప్రియులుండరు. ‘మనోహరా నా హృదయంలో...’ అంటూ కూనిరాగాయలు తీయని చెలి ఉండదు. ఇలాంటి పాటలతో తెలుగువారి చెవుల్లో తేనెలు కురిపించిన జయశ్రీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. రవీంద్రభారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన కచేరీలో తన గాన మాధుర్యంతో శ్రోతలకు వీనులవిందు చేశారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ఆమెను పలకరించింది. ఆ సంగీత ఝరి పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: కట్ట కవిత హైదరాబాదీలెప్పుడూ కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు. ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో అంతే ఎనర్జిటిక్ కూడా. 1990 తొలినాళ్లలో నేను ఇక్కడ మొదటి ప్రదర్శన ఇచ్చాను. అప్పటినుంచే నాకు సిటీ అంటే అమితమైన ప్రేమ. బీఆర్సీ అయ్యంగార్ నిర్వహించే కన్సర్ట్స్‌లో పాల్గొనడానికి తరచూ వచ్చేదాన్ని. ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. నా పుస్తకం వాయిసెస్ వితిన్ మొదట ప్రింట య్యింది కూడా ఇక్కడే. కర్ణాటక సంగీతం తెలుగులో చాలా కంపోజ్ అయింది. అయితే ఈ విషయంలో తమిళనాడుతో పోల్చు కుంటే మాత్రం తక్కువే. ఈ 20 ఏళ్లలో నగరంలో కర్ణాటక సంగీత ప్రేమికులు తగ్గిపోయారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారికి మాత్రం దీనిపై ప్రేమ తగ్గలేదు. నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, వింటున్నారు. కర్ణాటక సంగీతం ఓ మంచి స్నేహితుడి సాంగత్యం వంటిది. శ్రోతల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆస్వాదిస్తారు. ఈ సంగీతాన్ని వింటూ కొందరు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తే... మరికొందరు అందులోని సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇవ్వాల్సిన సమయం... కోల్‌కత్తాలో పుట్టి, ముంబైలో పెరిగి, ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నా... నా పేరు పక్కన బాంబే ఉండడాన్నే ఇష్టపడతాను. ముంబై అంటే అంతిష్టం. సంగీతమే సర్వం అయిపోయింది కానీ.. తొలినాళ్లలో అమ్మ నా మెంటార్. తరువాత నా గురువులు టి.ఆర్.బాలమణి, లాల్గుడి జయరామన్‌ల ఆశీస్సులతో ఇంత ఎదిగాను. అలాగే హిందుస్థానీ సంగీతాన్ని నాకందించిన మహవీర్ జయపూర్వాలే, అజయ్ పొహంకర్లను మరువలేను. ఇప్పటిదాకా ఎంతో నేర్చుకున్నాను, ఎంతో పొందాను. కానీ ఇది నేను సమాజానికి ఎంతోకొంత ఇవ్వాల్సిన సమయం. అందుకే ‘హితం’ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా విద్యార్థులతో కలిసి గ్రామీణ విద్యార్థులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌కు సంగీతాన్ని నేర్పిస్తున్నాను. సంగీతంతో సంతోషాన్ని నలుగురికి పంచడంలో ఆనందం ఉంది.