-
యాహూ బోర్డు నుంచి వైదొలగనున్న మరిస్సా మెయర్
శాన్ ఫ్రాన్సిస్కో: టెలికం దిగ్గజం వెరిజోన్‌తో డీల్ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ దిగ్గజం యాహూ బోర్డు పదవి నుంచి సీఈవో మరిస్సా మెయర్ తప్పుకోనున్నారు. యాహూ సహ వ్యవస్థాపకుడు డేవిడ్ ఫిలో కూడా బోర్డు పదవికి రాజీనామా చేయనున్నారు. పలు దఫాలుగా చేపట్టిన సంస్థాగత కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా యాహూ ప్రధాన ఇంటర్నెట్ వ్యాపారాన్ని, ఆలీబాబాలో పెట్టుబడుల విభాగాన్ని విడగొట్టింది. -
వేతనాలు హుళక్కే!
సాక్షి, కరీంనగర్ : పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరు అంశం కొత్త మలుపు తిరిగింది. గైర్హాజరు ఉపాధ్యాయులపై చర్యల ప్రక్రియ మొత్తం టీచర్లకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. నిర్ధిష్టమైన కారణాలుంటే మినహాయింపు ఇస్తామన్న అధికారులు ఇప్పుడు వారు ఇచ్చిన వివరణలను పరిశీలించకుండానే చర్యలకు సిద్ధం కావడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగుల వేతనాల్లోంచి రెండు రోజుల జీతాన్ని కోత పెట్టాలని కలెక్టర్ జిల్లా ట్రెజరీ అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల ఉపాధ్యాయులకు జీతాలు అందుతాయా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. జిల్లాలో 1,220 మంది ఎన్నికల విధులకు గైర్హాజరైనట్లు తేల్చారు. వీరిలో 1100 మంది ఉపాధ్యాయులు. ఇందులోనూ చాలా మంది ఎన్నికల విధులు నిర్వర్తించినా, పై అధికారుల అలసత్వంతో గైర్హాజరైనట్లు నోటీసులు అందుకున్నారు. ఒకరికే రెండు చోట్ల డ్యూటీలు వేయడం వల్ల ఒక చోట పని చేసినా మరో చోట గైర్హాజరైనట్టు నమోదైంది. రెండు చోట్ల డ్యూటీలు పడ్డ వారితోపాటు సరైన కారణాలతో హాజరుకాలేని వారికి చర్యల నుంచి మినహాయింపు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలని నోటీసులు కూడా పంపించారు. ఈ నోటీసులకు చాలా మంది వివరణ కూడా పంపారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా అందరి వేతనాల్లో కోత విధించేందుకు ఆదేశాలు ఇవ్వడంతో షాకైన ఉపాధ్యాయ సంఘాల నేతలు శుక్రవారం జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయంలో సమావేశమయ్యారు. తాజా నిర్ణయం వల్ల 14,500 మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన వారు పాఠశాలలో ఒక్కరు ఉన్నా మిగిలిన ఉపాధ్యాయుల బిల్లులు కూడా పంపించేందుకు మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు అంగీకరించడం లేదు. వచ్చే నెల వేతనం వచ్చేందుకు వీలుగా ఆయా పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఈ నెల 25 లోపు బిల్లులు ట్రెజరీలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 25 ఆదివారం కావడం వల్ల 24న ఈ పని పూర్తి చేయాలి. కానీ, శనివారం వరకు బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపే అవకాశం కనిపించడం లేదు. సమయానికి బిల్లులు ట్రెజరీకి చేరకపోతే వేతనం అందడం కష్టమే. గైర్హాజరును మొదటి తప్పుగా భావించి మన్నించాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కలెక్టర్‌ను కలిసి విన్నవించాయి. అయినా తమ విన్నపాన్ని మన్నించకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వివరణలు పట్టించుకోకుండా కేసులు నమోదు చేయడం కూడా వారిని ఆవేదనకు గురిచేస్తోంది. విధులు నిర్వర్తించినా... తప్పుగా పేర్కొన్న ఎంపీడీవోలపైనా, రెండు డ్యూటీలు వేసిన వారి మీద చర్యలు లేకుండా కిందిస్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్ వెళ్లి మంత్రి శ్రీధర్‌బాబును కలవాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement