breaking news
bjp telangana committee
-
బీజేపీలోకి సరైన సమయంలో చేరికలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బూత్ స్థాయి నుంచి బలోపేతమవుతున్న బీజేపీలోకి సరైన సమయంలో భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, చాలా మంది ప్రముఖలు బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, ఆ పార్టీ ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, విమోచన దినోత్సవం నిర్వహించకపోవడం వల్ల ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తి టీఆర్ఎస్ పతనానికి నాంది అవుతాయని విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తా మని, 10 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చేప ట్టిన ఆందోళనల గురించి నివేదిక అందించినట్టు చెప్పారు. 23 వేల పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత అమిత్ షా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ పర్యటిస్తారని తెలిపారు. జనవరి–ఫిబ్రవరి నెలల్లో లక్ష మందితో తెలంగాణలో భారీ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర జల వనరుల సంఘం సలహాదారు శ్రీరాం వెదిరె, పార్టీ సమన్వయ కర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఈ ముగ్గురిలో ఒకరిని డిసైడ్ చెయ్యండి!
- మూడు పేర్లతో ఢిల్లీకి జాబితా పంపిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర శఖ - ఓరుగల్లు ఉప పోరుకు సిద్దమౌతున్న కాషాయదళం - లోక్సభ ఇన్చార్జీగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: టీడీపీ సహకారంతో వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బరిలోకి దిగనున్న బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తిచేసింది. ఈ మేరకు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని పార్టీ కార్యకర్తలతో, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపింది. పార్టీ టికెట్కోసం దరఖాస్తు చేసుకున్న 14 మంది అభ్యర్థులను పరిశీలించిన ఎన్నికల సమన్వయ కమిటీ.. చివరికి మూడు పేర్లను ఫైనలైజ్ చేసి అధిష్ఠానానికి పంపింది. సమన్వయ కమిటీలో కీలక నేతగాఉన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. లోక్సభ ఉప ఎన్నికకు పార్టీ ఇన్చార్జీగానూ వ్యవహరిస్తున్నారు. మూడు పేర్లు ఇవే.. పార్టీనేతలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినవారు, తటస్తులు తదితరులను కలుపుకుంటే మొత్తం 14 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో నుంచి డాక్టక్ పంగిడి దేవయ్య, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్ పేర్లను తుది జాబితాలో చేర్చి ఢిల్లీకి పంపింది పార్టీ తెలంగాణ శాఖ. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు జనగాం పట్టణానికి చెందిన పంగిడి దేవయ్య వృత్తి రీత్యా డాక్టర్. అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన దేవయ్య పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలు పంచుకున్నారు. డాక్టర్ రాజమౌళి కూడా వృత్తిరీత్యా డాక్టరే అయినా 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీకూడా చేశారు. ఈయనది జనగాం సమీపంలోని వెల్లంల గ్రామం. రంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ ఎ.చంద్రశేఖర్ మాజీమంత్రి. ప్రస్తుతం కాంగ్రెస్పార్టీలోనే ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీచేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రొఫెసర్ గాదె దయాకర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్, పార్టీ ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు కూడా అభ్యర్థిత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారు. బూత్స్థాయికో సమన్వయ కమిటీ టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయానికి బూత్స్థాయికి ఒక కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రతీరోజూ బూత్ స్థాయిలో ప్రచారం, ఎన్నికల వ్యూహం వంటివాటిపై చర్చించడానికి వీలుగా ఈ కమిటీని ఏర్పాటుచేశారు. ఇలాంటి కమిటీలనే గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలోనూ ఏర్పాటుచేయనున్నారు. ఈ నెల 28 నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ నిర్ణయించింది.