breaking news
biased reporting
-
బీబీసీది పక్షపాత రిపోర్టింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై బీబీసీ కవరేజ్ పట్ల కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీది పక్షపాత రిపోర్టింగ్ అని విమర్శించింది. పాక్ జాతీయుల వీసాల రద్దుపై బీబీసీ రాసిన కథనంలో ఉగ్రదాడిని మిలిటెంట్ అటాక్‌గా పేర్కొనడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది దేశం మనోభావాలను దెబ్బతీస్తుందని బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు విదేశాంగశాఖ లేఖ రాసింది. బీబీసీ రిపోర్టింగ్‌ను విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుందని లేఖలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంబడి తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలను నిరోధించడానికి 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లను భారత్ నిషేధించింది. నిషేధానికి గురైన చానళ్లలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ఉండటం గమనార్హం. -
నాపై మీడియా కక్షగట్టింది.. ఓ సీఎం ఆరోపణ
మీడియా తనపట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని, కేవలం ప్రతిపక్షాలు డబ్బులిస్తే వాళ్లు చెప్పిన వార్తలు మాత్రమే కవర్ చేస్తూ.. తనను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఓ ముఖ్యమంత్రి వాపోతున్నారు. ఆయనెవరో కారు.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్!! ఐఐటీ చదివి ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన ఇప్పుడు వార్తల కవరేజి గురించి ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు, ఏకంగా పాత్రికేయుల చదువు గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ''రిపోర్టర్ జీతం ఎంత? న్యూస్‌రీడర్‌కు ఎంత వస్తుంది? బహుశా 25 వేలు కావచ్చు. కానీ వాళ్లు చాలామంది డిగ్రీ చదివిన వాళ్లే. వాళ్లేమీ పెద్ద మేధావులు, ఆలోచనాపరులు కారు. తమకు అర్థమైనట్లు గానే వార్తలు రాసేస్తారు. గోవాలో పెయిడ్ న్యూస్ సంస్కృతి చాలా ఎక్కువగా ఉంది. కథనం రాయాలంటే డబ్బులు తీసుకుంటారు'' అని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీ వార్తా పత్రికలు నడుపుతోందో అందరికీ తెలుసని, ఆ పేపర్ ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతుందో కూడా తెలుసని అన్నారు. ఎవరైనా వ్యక్తి చేసిన వ్యాఖ్యల గురించి రాసేటప్పుడు.. ఆ వ్యక్తి ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలన్నారు.