ఏపీ కేబినెట్ సమావేశం రద్దు
విజయవాడ: రేపు(సోమవారం) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రద్దయింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో కేబినెట్ భేటీని రద్దు చేశారు. రేపు సాయంత్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.