-
డ్యాన్సింగ్ భేల్ పూరీ.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
'భేల్ పూరీ' భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ స్నాక్స్‌లో ప్రధానమైనది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ వంటకాన్ని తెగ ఇష్టపడతారు. ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత ఉంటుందీ భేల్ పూరీకి. తాజాగా దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ వీడియో ఫుడ్ లవర్స్‌ను ఆకర్షించింది. ఈ కొత్త వంటకం పేరే డ్యాన్సింగ్ భేల్ పూరీ. ఇందులో ఉపయోగించే 60 రకాల పదార్థాలు మాత్రమే కాదు అది చేసే విధానంలోనే కొత్తదనం ఉంటుంది. దీన్ని తయారు చేసేప్పుడు దుకాణదారుడి ఉత్సాహం, లయబద్దమైన డ్యాన్స్‌తో దీనికి మరింత రుచిని తెచ్చిపెడతాయి. ఈ వీడియోలో దుకాణదారుడు భేల్ పూరీని తయారు చేయడానికి సిద్ధపడినప్పుడు దానికి కావల్సిన అన్ని పదార్థాలను ఓ పాత్రలోకి తీసుకుంటాడు. అనంతరం ఓ ప్రత్యేకమైన విధానంలో లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ ఆ పదార్థాలన్నింటిని కలియబెడతాడు. కిందికి మీదికి తిప్పుతూ అతడు చేసే గారడి చూస్తే.. 'అరె..! భలే తిప్పుతున్నాడే' అనిపించక మానదు. చిటికెలోనే భేల్ పూరీని ప్లేట్లో వేసేస్తాడు. View this post on Instagram A post shared by Rajanmishra (@aapkabhai_foody) ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. అతని ఎనర్జీ భేల్ పూరీకి మరింత టేస్టును తీసుకువచ్చిందని కొందరు కామెంట్ చేశారు. అతడు డ్యాన్స్ చేసే క్రమంలో చాలా ఫుడ్ కిందపడిపోతుందని మరికొంతమంది స్పందించారు. ఇదీ చదవండి: ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు -
రుచిని చాట్‌కుందాం!
టిఫిన్ అంటే ఎప్పుడూ తినే ఇడ్లీ, ఉప్మా, దోసె, పూరీలేనా? స్నాక్స్ అంటే ట్రెడిషనల్ కారప్పూస, బూందీ, పకోడీ, మిర్చి బజ్జీలేనా? వాటినే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామా.... భేల్‌పూరీ దహీపూరీ బఠాణీ చాట్ బఠాణీ చాట్లా చేసి వాటి రుచిని చాట్కుందామా... బఠాణీ చాట్ కావలసినవి తెల్ల బఠాణీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను + పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను + 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో పేస్ట్ – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్ మసాలా – ఒక టీ స్పూను; నిమ్మ రసం– ఒక టీ స్పూను; కార్న్ ఫ్లేక్స్ – తగినన్ని తయారీ: ►బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం, కుకర్‌లో బఠాణీలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక సగం బఠాణీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేసి వేయించాలి ►టొమాటో ముద్ద జత చేసి కొద్దిసేపు వేయించాక, బఠాణీ పేస్ట్, ఉడికించిన బఠాణీలు జత చేయాలి ►కొద్దిగా ఉప్పు జత చేయాలి ►మిరప కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా జత చేసి కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించి దింపి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగులతో అలంకరించి, కొద్దిగా నిమ్మ రసం, కార్న్‌ఫ్లేక్స్‌తో అలంకరించి, అందించాలి. భేల్ పూరీ కావలసినవి స్వీట్ చట్నీ – రుచికి తగినంత; గ్రీన్ చట్నీ – రుచికి తగినంత; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; కీర తురుము – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; ఉడికించిన బంగాళ దుంప తురుము – ఒక టేబుల్ స్పూను; బూందీ – 2 టేబుల్ స్పూన్లు; సేవ్ – 2 టేబుల్ స్పూన్లు; అటుకులు – తగినన్ని చాట్ మసాలా – చిటికెడు; మిరప కారం – కొద్దిగా; మరమరాలు – పావు కేజీ తయారీ: ►ఒక పాత్రలో మరమరాలు వేసి, వాటికి మిగిలిన పదార్థాలన్నీ (స్వీట్ టామరిండ్ చట్నీ, గ్రీన్ చట్నీ కాకుండా) జత చేసి బాగా కలపాలి ►స్వీట్ టామరిండ్ చట్నీ, గ్రీన్ చట్నీ జత చేయాలి ►ప్లేటులోకి తీసుకుని, పైన స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీలను కొద్దికొద్దిగా వేసి, ఆ పైన కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి అందించాలి. సమోసా చాట్ కావలసినవి చెన్నా మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; బటర్ – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; చాట్‌మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; సమోసాలు – 2; పెద్ద సెనగలు (కాబూలీ చెన్నా) – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; పెరుగు – ఒక కప్పు; గ్రీన్ చట్నీ – కొద్దిగా; స్వీట్ చట్నీ – కొద్దిగా; కొత్తిమీర – ఒక కట్ట తయారీ: ►పెద్ద సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ►మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, శుభ్రంగా కడిగి, కుకర్‌లో సెనగలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►బాణలిలో బటర్ వేసి వేడి చేయాలి ►ఉడికించిన పెద్ద సెనగలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కొద్దిసేపు వేయించాలి ►తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ►సమోసాలను ముక్కలుగా చేసి, ఉడికించిన చాట్‌లో వేసి కలపాలి ►పెరుగు, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ వేసి, ఒకసారి కలిపి దింపేసి, కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి సమోసా చాట్ అందించాలి. దహీ పూరీ కావలసినవి ఉడికించిన బంగాళ దుంపలు – 3 (మీడియం సైజువి); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; గ్రీన్ చట్నీ – అర కప్పు; స్వీట్ చట్నీ – అర కప్పు; ఎండు మిర్చి + వెల్లుల్లి చట్నీ – అర కప్పు; పూరీలు (గోల్గప్పాలు) – 30; సన్న సేవ్ (నైలాన్ సేవ్) – తగినంత; మిరప కారం – తగినంత; చాట్ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; నల్ల ఉప్పు లేదా రాళ్ల ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా చట్నీలు తయారు చేసి పక్కన ఉంచాలి ►బంగాళ దుంపలను ఉడికించి, చల్లారబెట్టి, మెత్తగా చిదమాలి ►ఒక ప్లేట్లో గోల్గప్పాలను ఉంచి, మధ్య భాగంలో చిన్నగా చిదమాలి ►బంగాళ దుంప ముద్దను స్టఫ్ చేయాలి ∙ఉల్లి తరుగు, టొమాటో తరుగును పైన ఉంచాలి ►కొద్దిగా చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరప కారం, ఉప్పు... ఒకదాని తరవాత ఒకటి కొద్దికొద్దిగా చల్లాలి ►గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీలు కొద్దికొద్దిగా వేయాలి ►పైన పెరుగు వేయాలి ►ఆ పైన మళ్లీ చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరపకారం, ఉప్పు చల్లాలి ►తగినంత సేవ్ వేసి, చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. గ్రీన్ చట్నీ కావలసినవి కొత్తిమీర ఆకులు – 2 కప్పులు; పుదీనా ఆకులు – ఒక కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 2; అల్లం – చిన్న ముక్క; నిమ్మ రసం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడగాలి ►మిక్సీలో అన్ని పదార్థాలను వేసి మెత్తగా ముద్దలా చేయాలి ►గాలిచొరని జాడీలో నిల్వ ఉంచుకోవాలి ►ఫ్రిజ్‌లో ఉంచి, కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. స్వీట్ చట్నీ కావలసినవి ఖర్జూరాలు – 10 (గింజలు లేనివి); బెల్లం తురుము – అర కప్పు; చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని తయారీ: ►ఒకపాత్రలో బెల్లం పొడి, పావు కప్పు వేడి నీళ్లు పోసి కలియబెట్టాలి ►చింతపండు గుజ్జు, ఖర్జూరాల గుజ్జు జత చేసి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►ఉప్పు, జీలకర్ర పొడి, మిరపకారం జత చేసి కలియబెట్టి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి ►గాలి చొరని సీసాలోకి తీసుకుని, నిల్వ చేసుకోవాలి. -
భేల్పురి మా వాడికి తెగ నచ్చేసింది...
మహేశ్‌బాబు ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వినాయక చవితి మరునాడు విడుదలైన ‘ఆగడు’ చిత్ర గీతాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడం ఒక కారణమైతే, ఇటీవలే పుట్టిన రోజు జరుపుకొన్న కుమారుడు గౌతమ్ పదే పదే ఆ పాటలు వింటూ, డ్యాన్సులు చేస్తుండడం మరో కారణం.గౌతమ్ కు 8 ఏళ్ళు వచ్చిన సందర్భంగా మహేశ్ ట్విట్టర్లో ఈ సంగతులు పంచుకుంటూ, ‘‘ఆగడు పాటలు మా అబ్బాయికి భలే పట్టేశాయి. ముఖ్యంగా ‘భేల్పురి’ పాట వాడికి తెగ నచ్చింది. అందుకే, పదే పదే ఆ పాట వింటున్నాడు’’ అని పేర్కొన్నారు. గమ్మత్తు ఏమిటంటే, ఈ పాట హీరోయిన్ తమన్నాకు కూడా విపరీతంగా నచ్చిందట. ఈ మిల్కీ బ్యూటీ ‘ఆగడు’ పాటలను తెగ మెచ్చుకుంటూ, ‘‘ఆడియోకు లభిస్తున్న స్పందనతో ఆనందంలో తేలిపోతున్నా. ‘భేల్పురి’ పాట అయితే మరీనూ’’ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వ్యాఖ్యానించారు. దసరా పండుగను రెండు వారాల ముందే జరుపుకొందామంటూ ఆడియో రిలీజ్లో మహేశ్ చేసిన వ్యాఖ్యలతో ఈ నెల 19న రానున్న ‘ఆగడు’ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడీ తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నాయి. గతంలో అపూర్వ వాణిజ్య విజయమైన ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అధినేతలు, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లోనే మళ్ళీ వస్తున్న ‘ఆగడు’ కోసం మరి రెండు వారాలు ఆగాల్సిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement