breaking news
Bharat matha
-
మన్యం ధీరుడు మూవీ.. ఆ పాటకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
మన్యం ధీరుడు సినిమాలోని "నమోస్తుతే నమోస్తుతే భారత మాతా" అనే దేశభక్తి గీతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. ఈ సినిమా కథానాయకుడైన ఆర్వీవీ సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడడమే కాకుండా హిమాలయాల్లో చిత్రీకరించారు. అందుకే ఈ పాట ప్రత్యేకతను సంతరించుకుంది.ఇటీవల ఈ సాంగ్‌ను థాయిలాండ్,మలేషియా, బ్యాంకాక్, మయన్మార్ లాంటి దేశాల్లోని ప్రవాస భారతీయులు ప్రశంసిస్తున్నారు. త్వరలోనే అమెరికాలో జరిగే తానా సభల్లో ఈ పాట పాడనున్నారు. ఆ తర్వాత జర్మనీలో కూడా ఈ సాంగ్ పాడబోతున్నట్లు విశాఖకు చెందిన శేఖర్ ముమ్మోజీ బృందం తెలిపారు. కాగా.. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. మన దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాటకు మరింత ఆదరణ దక్కాలని ఆశిద్దాం. -
'భారత మాతాకీ జై అంటే సమస్యలు పరిష్కారం కావు: శివసేన
ముంబై: 'భారతమాతాకీ జై' అని నినాదాలు చేసే బదులు రాష్ట్రంలోని నీటి సమస్యకు పరిష్కారంను సూచించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సత్వరచర్యలు తీసుకోకుంటే శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 'భారతమాతాకీ జై' అని నినదిస్తూ తన సీటును కాపాడుకోలేరని శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో ఘాటుగా విమర్శించింది. గత ప్రభుత్వాలు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమేనని తెలిపింది. యువతలో అసహనం పెరిగి మావోయిజం వైపు ఆకర్షితులవుతున్నారని ఇలాంటి పరిసితుల్లో 'భారత మాతాకీ జై' అనే నినాదాలు చేస్తే లాభం లేదని నిర్మొహమాటంగా పేర్కొంది. ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో 40 రోజులకొకసారి కూడా తాగునీరు రావడంలేదని, పుణే, థానె, నాగపూర్, ముంబైల్లో పరిస్థితి దారుణంగా ఉందని రాష్ట్రం స్మశానాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలు మూతపడుతున్నాయని, దేశభక్తి పేరుతో ప్రజల దాహం తీర్చలేమంటే సహించేదిలేదని హెచ్చరించింది.