-
మావారు చూసింది ఆ ఒక్క సినిమానే : ప్రీతీజింటా
ముంబై : తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ఎనఫ్ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా కొంచెం గ్యాప్ తర్వాత 'భయ్యాజీ సూపర్ హిట్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ సమ్మర్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చిత్ర షూటింగ్ ముగియడంతో ప్రీతి ట్విట్టర్లో అభిమానులతో శుక్రవారం చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా బదులిచ్చింది. ప్ర- మీ అభిమాన క్రికెటర్ ఎవరు? స-వీరూ, యూవీ, విరాట్, ధోనీ, సచిన్ ప్ర- మీ జీవితంలో ఏదైనా సంఘటన జరగకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? స-జీవితంలో జరిగే మంచి, చెడులనుంచి నేను ప్రతిసారి కొత్త విషయాలన్ని నేర్చుకుంటూనే ఉన్నా. గడచిన జీవితంలో తాలూకూ సంఘటనలను జరగకుండా ఉంటే బావుండు అని అనుకోవడం లేదు. మా తండ్రిని కోల్పోయిన విషయంలో మాత్రం చింతిస్తూనే ఉన్నా.. ప్ర-మీ ఆయనకు బాలీవుడ్ చిత్రాలంటే ఇష్టమేనా? స- ఆయన ఒక్క వీర్ జరా సినిమా మాత్రమే చూశారు. ప్ర-2016లో మీకు నచ్చిన చిత్రాలు.. స-దంగల్, సుల్తాన్, పింక్, నీరజ్, ఏ దిల్ హై ముష్కిల్ ప్ర- కాబిల్ సినిమా చూశారా ? స-కోయి మిల్ గయా తర్వాత హృతిక్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. యామీ గౌమి తన నటనతో నన్ను ఏడిపించింది. ప్ర- అక్షయ్ కుమార్ గురించి అడిగితే మీ మదిలోకొచ్చే సమాధానం స-కిలాడీ ప్ర- సమోసా, దోసల్లో ఏది ఇష్టం ? స-ముంబైలో ఉంటే సమోసా, లాస్ ఏంజెల్స్‌లో దోస ప్ర- మీ రోల్ మాడల్ ? స-మా అమ్మ ప్ర- పాడటం అంటే మీకిష్ణమా ? స-భూమ్మీదే కాదు విశ్వంలోనే నేనే బెస్ట్ బాత్రూం సింగర్‌ని..హహా ప్ర - మీరు బాలీవుడ్లో అందమైన నటిగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చెప్పారు..మీ స్పందన ? స-అయితే సల్మాన్‌కి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాల్సిందే.. ప్ర- మీ ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్ ? స-ఇండియాలోని పర్వతాలు, అమెరికాలోని సముద్రం... -
విలేకరులపై చిటపటలాడిన హీరోయిన్!
'కల్ హో నా హో' సినిమాతో 16 ఏళ్ల కిందట హృతిక్ రోషన్, అమీషా పటేల్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హీరోగా హృతిక్ తన ప్రస్థానం కొనసాగిస్తుండగా.. 'బద్రి' తార అమీషా మాత్రం కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. దాదాపు మూడేళ్ల తర్వాత 'భయ్యాజీ సూపర్‌హిట్' సినిమాతో ఆమె వెండితెరను పలుకరించబోతున్నది. తాజాగా 'భయ్యాజీ సూపర్‌హిట్' చిత్రయూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన అమీషా విలేకరులపై తీవ్రస్థాయిలో మండిపడిందట. ముంబై మీడియా కథనం ప్రకారం చిటపటలాడుతూ ఈ ప్రెస్మీట్లో పాల్గొన్న అమీషా.. విలేకరులు కుర్చీలలో కూర్చుంటుడగానే 'సైలెన్స్' అంటూ గద్దించింది. మూడేళ్లుగా ఎందుకు సినిమాల్లో నటించడం లేదని ఓ విలేకరి అడుగగా.. 'నన్ను అమీషా అని కాదు.. అమీషాజీ అని పిలువండి' అంటూ గట్టిగా సూచించింది. అదేవిధంగా మీరు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారా? అని అడిగిన విలేకరిపైనా ఆమె ఆగ్రహం ప్రదర్శించింది. మీకు మెదడు ఉందా? అంటూ ఆ విలేకరిపై విరుచుకుపడింది అమీషా. ఈ ప్రెస్‌మీట్ గురించి చిత్రయూనిట్ ముందుగానే తెలుపలేదట. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న మరో నటి ప్రీతి జింతా ప్రెస్‌మీట్‌కు డుమ్మ కొట్టగా.. అమీషా తన ఆగ్రహాన్ని విలేకరులపై చూపిందని చిత్రవర్గాలు అంటున్నాయి. సన్నీ డియోల్, అర్షద్ వార్సీ, ప్రీతి జింతా, అమీషా పటేల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'భయ్యాజీ సూపర్‌హిట్' సినిమాపై ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్లు అయిన అమీషా, ప్రీతి భారీ అంచనాలే పెట్టుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్‌కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement