breaking news
belongs
-
ఔను.. ఆ స్థలం ప్రభుత్వానిదే..
‘ఆదెమ్మదిబ్బ’పై తేలుతున్న వాస్తవాలు నగరపాలక సంస్థ పాఠశాల కోసం సేకరించిన స్థలమిది 1985లోనే అవార్డు ప్రకటన ఐదు సర్వే నంబర్లలో 5.87 ఎకరాల సేకరణ అందులోనే సర్వే నంబర్ 730/2సీ2లో సత్యవోలు పాపారావుకు చెందిన 1.81 ఎకరాల స్థలం సేకరణలో లేని ఆయన మరదలు సత్యవతి స్థలం అదే విషయం చెబితే బుకాయించిన సత్యవోలు పాపారావు రెండో కుమారుడు శేషగిరిరావు ‘సాక్షి’ వద్ద పక్కా ఆధారాలు సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగు తమ్ముడి కబ్జా పర్వం బట్టబయలైంది. ‘సాక్షి’ మొదటినుంచీ చెబుతున్నదే నిజమైంది. ఆదెమ్మదిబ్బ స్థలంలోని సర్వే నంబర్ 730/2సీ2లోని సత్యవోలు పాపారావు, ఆయన నలుగురు కుమారుల స్థలం ఎకరా 81 సెంట్లను ప్రభుత్వం సేకరించి, అందుకు అవార్డు (నగదు) కూడా చెల్లించింది. వీరితోపాటు మరో ఐదు సర్వే నంబర్లలో మొత్తం 5 ఎకరాల 87 సెంట్ల భూమి సేకరించారు. కొన్ని సర్వే నంబర్లలోని భూమిని సేకరణ నుంచి మినహాయించగా, సర్వే నంబర్ 730/2సీ2లోని సత్యవోలు పాపారావు తమ్ముడు లింగమూర్తి, సత్యవతి దంపతుల వాటాపై న్యాయస్థానం స్టే (యథాతథ స్థితి) విధించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ అభ్యర్థన మేరకు సేకరణ రాజమహేంద్రవరం వీరభద్రపురంలో మున్సిపల్ హైస్కూల్ నిర్మాణం కోసం అప్పటి మున్సిపల్ కమిషనర్ అభ్యర్థన (9.11.1978) మేరకు అప్పటి సబ్ కలెక్టర్ స్థల సేకరణ కోసం 20.07.1979న డ్రాఫ్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేశారు. ఇందులో సర్వే నంబర్లు 724/1డీలో 25 సెంట్లు, 725/3ఎలో ఎకరా 81 సెంట్లు, 725/3ఇలో ఒక సెంటు, 730/2సీ2లో 3 ఎకరాల 69 సెంట్లు, 731/2లో 11 సెంట్లు వెరసి మొత్తం 5 ఎకరాల 87 సెంట్ల స్థల సేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేశారు. దీనిపై 28.05.1980న డ్రాఫ్ట్ డిక్లరేష¯ŒS జారీ చేసి 12.06.1981న పీవీ ఆమోదించారు. ఆయా స్థలాల యజమానులకు 30.07.1985న అవార్డు (నంబర్ 6/85) ప్రకటించారు. అవార్డు ఇచ్చిన సర్వే నంబర్ల స్థలం, యజమానులు వీరే.. ఐదు సర్వే నంబర్లలోని మొత్తం 5 ఎకరాల 87 సెంట్లకు అప్పటి కలెక్టర్ ప్రదీప్‌చంద్ర 30.07.1985న అవార్డు (నంబర్ 6/85) ప్రకటించగా.. తరువాత ప్రభుత్వం కొంత స్థల సేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. మరికొందరు న్యాయస్థానానికి వెళ్లి తమ స్థల సేకరణపై స్టే తెచ్చుకున్నారు. వీరందరూ పోగా మిగిలినవారికి అవార్డు అందజేశారు. అవార్డు అందుకున్నవారిలో ఈపు అప్పలస్వామి (సర్వే నంబర్ 724/1డీలో 25 సెంట్లు), కందుల సత్యానందం, కందుల మదన మోహనరావు, కందుల రాజేంద్రప్రసాద్ (సర్వే నంబర్ 725/3ఎ1లో ఎకరా 63 సెంట్లు), కందుల సంజీవరావు (సర్వే నంబర్ 730/2సీ2పీలో ఒక సెంటు), సత్యవోలు పాపారావు అతని కుమారులు (సర్వే నంబర్ 730/2సీ2పీలో ఎకరా 81 సెంట్లు), వాడరేవు వెంకప్పరావు (సర్వే నంబర్ 731/2లో 9 సెంట్లు) ఉన్నారు. వీరి మొత్తం స్థలం 3 ఎకరాల 80 సెంట్లకు అవార్డు అందజేశారు. అవార్డు వర్తించని, కోర్టు స్టే ఇచ్చిన స్థలాలు, యజమానుల వివరాలు సర్వే నంబర్ 725/3ఎ2లో 7,800 చదరపు అడుగులకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డు వర్తించలేదు. అలాగే సర్వే నంబర్ 730/2సీ2పీలో సత్యవోలు సత్యవతి(పాపారావు తమ్ముడు లింగమూర్తి సతీమణి)కి చెందిన ఎకరా 88 సెంట్ల స్థలానికి కూడా అవార్డు వర్తించలేదు. వీరు తమ స్థల సేకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. ఇంకా సర్వే నంబర్ 725/3ఏ2, సర్వే నంబర్ 731/2పీలోని 1,083 చదరపు అడుగుల స్థలాన్ని సేకరణ ప్రతిపాదన నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నాలుగు సర్వే నంబర్లపై కోర్టులో దాదాపు ఆరు కేసులు నడిచాయి. సత్యవోలు పాపారావు అండ్ కుమారుల అవార్డు రూ.2,30,260 సర్వే నంబర్ 730/2సీ2లోని సత్యవోలు పాపారావు, అతని కుమారులు భూసేకరణ అధికారికి ఎలాంటి వినతిపత్రం ఇవ్వలేదు. దీంతో, ప్రభుత్వం సత్యవోలు పాపారావు, అతని కుమారులకు సర్వే నంబర్ 730/2సీ2లో ఎకరా 81 సెంట్ల (ఎకరా 35,436 చదరపు అడుగులు)కు సంబంధించి ç31.07.1985న రూ.2,30,260 అవార్డుగా వారి పేరిట రాజమహేంద్రవరం సబార్డినేట్ జడ్జి వద్ద జమ చేసింది. బుకాయించిన సత్యవోలు శేషగిరిరావు కోలమూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆదెమ్మదిబ్బ స్థలాన్ని కొనుగోలు చేశానంటూ.. అక్కడ నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయించి కంచె వేస్తూండడంపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. ఇందులో భాగంగా ‘కొన్నదీ లేదు.. అమ్మిందీ లేదు’ శీర్షికన కథనం ప్రచురించడంతో.. సత్యవోలు పాపారావు రెండో తనయుడినంటూ శేషగిరిరావు అనే వ్యక్తి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ స్థలం తమదేనని, పిన్నమరెడ్డి ఈశ్వరుడుకి అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే ‘సాక్షి’ తనవద్ద ఉన్న అవార్డు కాపీలను చూపించగా తాము తీసుకోలేదని, ఆ సమయంలో ప్రభుత్వంవద్ద డబ్బు లేదని, తాము సేకరణకు ఇవ్వలేదని ఇలా పలురకాల సమాధానాలు చెప్పారు. ఆ స్థలం నగరపాలక సంస్థదే.. వీరభద్రపురం నగరపాలక సంస్థ హైస్కూల్ కోసం ప్రభుత్వం స్థలం సేకరించింది. దీనిపై పైన పేర్కొన్న కొందరు కోర్టులను ఆశ్రయించడంతో ఆ కేసులు దాదాపు 2001 సంవత్సరం వరకూ సాగాయి. దీంతో వీరభద్రపురం నగరపాలక సంస్థ హైస్కూల్ నిర్మాణం ఆ స్థలంలో జరగలేదు. కంబాలచెరువు నుంచి పేపర్ మిల్లు వెళ్లే రోడ్డులో ఆదెమ్మదిబ్బ స్థలం ప్రాంతం ఎదురుగా రోడ్డుకు అవతలి వైపు వీరభద్రపురంలో నగరపాలక సంస్థ ఈ హైస్కూల్ నిర్మాణం చేపట్టింది. మిగిలిన కొంత ప్రాంతంలో పేదల కోసం వాంబే గృహాలు కట్టించి ఇచ్చారు. స్థలంపై విచారణ చేయిస్తా.. ఆ స్థలంపై నేను ఆరా తీశాను. విచారణ చేయిస్తాను. ప్రభుత్వం సేకరించి అవార్డు ప్రకటించిందంటే అది కార్పొరేష¯ŒS స్థలమే. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణ¯ŒSను అడిగి వివరాలు తీసుకుంటాను. – హెచ్.అరుణ్‌కుమార్, కలెక్టర్ -
‘వెదుళ్ళపల్లి’ భూమి రెవెన్యూ శాఖదే
ఆ భూమిలో నలుగురికి పట్టాలు కూడా ఉన్నాయి అటవీశాఖకు ఎలాంటి సంబంధం లేదు పంట ధ్వంసంపై ఉన్నతాధికారులకు నివేదిక సర్వే తర్వాత తేల్చి చెప్పిన తహసీల్దార్ యూసఫ్ జిలానీ వై.రామవరం : మండలంలోని కోట పంచాయతీ, వెదుళ్ళపల్లి గ్రామంలో అటవీశాఖాధికారులు శనివారం జీడిమామిడి చెట్లను ధ్వంసం చేసిన భూమి రెవెన్యూ శాఖదని తహసీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ తెలిపారు. రెండు రోజుల పాటు 20 ఎకరాల ఆ భూమిని తమ సర్వేయర్ లక్ష్మణరావుతో సర్వే చేయించాక ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నామని తహసీల్దార్ బుధవారం ఆ గ్రామంలో విలేకరులకు తెలిపారు. ఆ భూమిపై అక్కడి గిరిజన రైతులకే హక్కు ఉందని సృష్టం చేశారు. ఈ భూమితో అటవీశాఖకు ఎలాంటి సంబంధం లేదని తహసీల్దార్ తేల్చి చెప్పారు. వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన వడబాల సత్యవతి, వడబాల చల్లయ్యమ్మ, వడబాల బుల్లెమ్మ, వెలుగూరి నాగమ్మలకు ఈ భూములపై పట్టాలు కూడా ఉన్నాయన్నారు. అలాగే పల్లాల కర్రిరెడ్డి, పల్లాల మంగిరెడ్డిలు పట్టాలు లేకుండా సాగు చేసుకుంటున్న ఐదు ఎకరాలు కూడా రెవెన్యూ భూమేనన్నారు. అటవీ శాఖ అధికారులు ఈ భూముల్లో ట్రాక్టర్లతో దున్నించడం వల్ల ఆరుగురు గిరిజన రైతులూ జీడిమామిడి మొక్కలను నష్టపోయిన విషయాన్ని నివేదిక రూపంలో కలెక్టర్, సబ్‌కలెక్టర్, అటవీశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ గొర్లె మంగయ్య, ముర్ల జోగిరెడ్డి , గ్రామపెద్దలు, బాధితులు పాల్గొన్నారు. అటవీశాఖాధికారులపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే వెదుళ్లపల్లి గ్రామంలో గిరిజనుల భూముల్లోని జీడిమామిడి చెట్లను ట్రాక్టర్లతో దున్నించి, ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ గ్రామంలో ఆరుగురు గిరిజనులు పెంచుకుంటున్న జీడిమామిడి చెట్లను అటవీ శాఖాధికారులు శనివారం ట్రాక్టర్లతో దున్నుతూ ధ్వంసం చేస్తుండగా, తహసీల్దార్ యూసఫ్ జిలానీ సమక్షంలో ఎమ్మెల్యే రాజేశ్వరి అడ్డుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల సర్వే అనంతరం ఆ భూమితో అటవీశాఖకు ఎలాంటి సంబంధం లేదని సృష్టమైంది. ఈ నేపధ్యంలో జీడిమామిడి చెట్లను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే బుధవారం ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. మరో ఏడాదిలో దిగుబడి వచ్చే జీడిమామిడి చెట్లను కోల్పోయిన ఆరుగురు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
మేకలపై ఖాకీల కన్ను