breaking news
Belli Lalitha
-
Belli Lalitha: లలితక్క ఎన్‌కౌంటర్‌కు 26 ఏళ్లు
సిరిసిల్ల: ‘మా అక్క రంగవల్లి.. రగుల్ జెండావు.. పోరులో ఒరిగినావో ఓ తల్లి.. పోరులో ఒరిగినావు.. పొలికేకలయినావు.. ధనికింట్లో పుట్టిన బిడ్డా.. దళితుల్లో పెరిగీనాదీ.. సింపిరిగుడ్డల ఉన్నా.. సినిగీనా బతుకుల చూసి.. చెట్ల కిందా బతుకులాకు చేవనయి ఉంటానందీ.. గుడిసెలాకు నిట్టాడోలే.. గూడెంలో నిలిసినాదీ.. మా అక్క రంగవల్లి మా రగుల్ జెండావు..’ అంటూ.. రంగవల్లి స్మృతిగీతాలు.. ‘రగల్‌జెండా రంగవల్లి’ ఆడియో క్యాసెట్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండున్నర దశాబ్దాల కిందట పాటలను విడుదల చేసింది. ఆ పాటలు ఊరూరా.. వాడవాడనా.. మారుమోగాయి.ఎవరీ రంగవల్లి.. రంగవల్లి సొంతూరు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వకీల్‌ఫారం. 1959 డిసెంబరు 31న గిరిజ– ఎస్వీఎల్. నర్సంహారావు దంపతులకు పుట్టింది. ఆమె తండ్రి నర్సింహారావు బాన్స్వాడ ఎమ్మెల్యేగా పనిచేశారు. బోధన్ మండలం పంటాకుర్ద్లో ఎస్సెస్సీ వరకు చదివింది. ఇంటర్ సీఈసీ(ఇంగ్లిష్ మీడియం) పూర్తి చేసి ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. బోధన్‌లో డిగ్రీ చదివి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్, సైకాలజీలో పీజీలు చేశారు. అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వేములవాడకు చెందిన కూర రాజన్న అలియాస్ రాజేందర్‌తో ఉన్న స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి జన్మించాడు. కొడుకును పుట్టింటిలో వదిలిపెట్టిన రంగవల్లి అడవిబాట పట్టింది. పీడీఎస్‌యూలో చేరి.. క్రమంగా జనశక్తి సాయుధ ఉద్యమంలోకి వెళ్లారు. 26 ఏళ్ల కిందట ఎన్కౌంటర్..గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కూలీలను ఏకం చేసి భూపోరాటాన్ని సాగించిన రంగవల్లి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటానికి నాయకత్వం వహించారు. సీపీఐ(ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా, వరంగల్ జిల్లా జనశక్తి పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 1999 నవంబరు 11న ములుగు జిల్లా జగ్గన్నగూడెం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆమెతోపాటు జాన్‌రెడ్డి, చీపురు సంతోష్, వాంకుడోత్ అనిత ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆమె పుట్టినిల్లు నిజామాబాద్ అయినా.. కూర రాజన్న సహచర్యంతో మెట్టినిల్లు వేములవాడ అయింది. రంగవల్లి ఎన్కౌంటర్లో అసువులుబాసి నవంబరు 11 నాటికి సరిగ్గా 26 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆమె పేరిట నెలకొల్పిన ‘రంగవల్లి విజ్ఞాన కేంద్రం’ ప్రథమ వార్షికోత్సవం సభను ఈనెల 11న నిర్వహించాల్సి ఉండగా.. ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియలు ఉండడంతో సభను గురువారం నాడు నిర్వహిస్తున్నారు. నేడు ఆర్వీకే ప్రథమ వార్షికోత్సవం..నేడు జరిగే సభా పరిచయం పోకల సాయికుమార్(న్యాయవాద విద్యార్థి) చేయనుండగా.. అరుణోదయ విమలక్క (ఆర్వీకే అధ్యక్షురాలు) అధ్యక్షతన జరుగనుంది. ‘సంక్షోభ కాలం.. సామాజిక మార్పు’ అనే అంశంపై ప్రొఫెసర్ కొల్లాపురం విమల వక్తగా సమావేశం జరుగుతుంది. “ప్రజా గ్రంథాలయం ఆవశ్యకత’ అంశంపై కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతారు. ఆర్వీకే సభ్యులు చెన్నమనేని పురుషోత్తమరావు వందన సమర్పన చేయనున్నారు. ఈ సభకు ఉమ్మడి కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పలువురు హాజరుకానున్నారు. -
Belli Lalitha: ముక్కలైన దేహానికి పాతికేళ్లు
పాటనే జీవితంగా మలుచుకొని చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. 1972 ఏప్రిల్ 29న భువనగిరిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చదువులేని ఆమె పొట్టకూటి కోసం స్థానిక కాటన్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఈ క్రమంలోనే సీఐటీయూలో సభ్యత్వం తీసుకొని కార్మిక హక్కుల సాధన కోసం పోరాడింది. అనంతరం ‘భువనగిరి సాహిత్య మిత్ర మండలి’లో చేరి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటను తన అస్త్రంగా మార్చుకుంది. ‘తాగబోతే నీళ్లు లేవూ తుమ్మెదాలో... తడి గొంతూలారిపాయే తుమ్మెదాలో!’ అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యలపై గళమెత్తింది. 1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ ‘తెలంగాణ ఐక్య వేదిక’ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న భువనగిరిలో జరిగిన ‘దగాపడ్డ తెలంగాణ’ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 1997 ఆగస్టు 11న బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మహాసభ’తో పాటు 1997 డిసెంబర్ 28న వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో లలిత తన గానంతో గర్జన చేసింది. పీపుల్స్‌వార్ సానుభూతిపరుల ‘తెలంగాణ జనసభ’ అనుబంధ విభాగమైన ‘తెలంగాణ కళా సమితి’ కన్వీనర్‌గా ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత వివరించింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్ధృతం అవుతుండటం ఆనాటి సమైక్య పాలకులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిపి, బహుజన నేత మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నారు. ఈ తరుణంలో1999 మే 26న ఇంటి నుండి వెళ్ళిన లలిత తిరిగిరాలేదు. 1999 మే 29న దర్గాబావిలో శరీర భాగాలు ఉన్నాయన్న వార్తతో భువనగిరి ఉలిక్కి పడింది. పదమూడు రోజులు గాలించగా పలు బావులు, చెరువుల్లో 17 ముక్కలైన లలిత శరీర భాగాలు లభ్యమయ్యాయి. 1999 జూన్ 11న జరిగిన అంత్యక్రియలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. నాటి పాలకులే... మాజీ నక్సలైట్‌ను ఆయుధంగా మార్చుకొని లలితను పాశవికంగా హత్య చేయించారని ప్రజా సంఘాలు నిరసించాయి. ఆరు దశాబ్దాల ఆకాంక్షకై 17 ముక్కలైన లలిత అమరత్వానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ కనీస గౌరవం దక్కలేదు. – పి. నరేష్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి(నేడు బెల్లి లలిత 25వ వర్ధంతి) -
'నయీం డైరీస్' మూవీకి తెలంగాణ హైకోర్టు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: 'నయీం డైరీస్' చిత్రం ప్రదర్శనపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో బెల్లి లలిత పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ ఆమె కుమారుడు సూర్యప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. 1999లో బెల్లిలలిత దారుణ హత్యకు గురైంది. బెల్లి లలితను నయీం హత్య చేయించాడంటూ అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాజాగా నయీం డైరీ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన 'లత'ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమా శుక్రవారమే విడుదలైంది. దీంతో చిత్రం నిలుపుదల చేయాలంటూ సూర్యప్రకాష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ నయీం డైరీ చిత్ర ప్రదర్శనపై హైకోర్టు స్టే విధించింది. చదవండి: (‘నయీం డైరీస్’మూవీ రివ్యూ) ఆ దృశ్యాలను తొలగిస్తాం: నిర్మాత నయీం డైరీస్ నిర్మాత సీ.ఏ వరదరాజు బెల్లి లలిత కుటుంబానికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'సినిమాలో నిజజీవితంలో అమరులైన ఒక మహిళ పాత్రను చిత్రించి ఆమె కుటుంబ సభ్యులను, అభిమానుల్ని బాధపెట్టినట్లు మా దృష్టికి వచ్చింది. వారి మనోభావాల్ని గాయపరిచినందుకు మేము భేషరతుగా క్షమాపణ చెప్తున్నాము. మా సినిమా ప్రదర్శనను ఆపివేసి ఆ పాత్రకు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను, సంభాషణలను వెంటనే తొలగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని నయీం డైరీస్ నిర్మాత సీ.ఏ వరదరాజు అన్నారు. -
నయీమ్‌ను పెంచి పోషించింది బాబే
-
నయీమ్‌ను పెంచి పోషించింది బాబే
* బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఆరోపణ * 18 ఏళ్ల అజ్ఞాతం నుంచి బయటకు సాక్షి, హైదరాబాద్/భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడేనని బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం తన సోదరి బెల్లి లలితను 1999లో అతికిరాతకంగా చంపించారని దుయ్యబట్టారు. అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి ఆదేశాల మేరకు లలితను నమూమ్ హత్య చేయించారని, ఆపై మృతదేహాన్ని అతికిరాతకంగా 17ముక్కలు చేయించాడన్నారు. శనివారమిక్కడ బెల్లి కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తన సోదరి సహా మరికొందరు కుటుంబ సభ్యులు హత్యలకు గురికావడంతో ప్రాణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వివరించారు. తెలంగాణ కోసం పోరాడే వారందరినీ నక్సలైట్లుగా చిత్రీకరించి చంపేశారన్నారు. తన సోదరితోపాటు మిగతా కుటుంబ సభ్యుల హత్యలపై సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ జరిపించాలని కృష్ణ డిమాండ్ చేశారు. దాదాపు 18 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న కాలంలో ఏడాదిపాటు తెలంగాణ బయట తిరిగానని, ఆ తర్వాత హైదరాబాద్‌లోనే సీసాలు ఏరుకుంటూ బతికానన్నారు. తన కుటుంబ సభ్యుల హత్య కేసులకు సంబంధించి సిట్‌ను కలసి వివరాలు అందిస్తానన్నారు. నయీమ్ అనుచరులు ఇంకా చాలా మంది దర్జాగా బయటే తిరుగుతున్నారన్న కృష్ణ... నయీమ్ కుటుంబం మొత్తం నరరూప రాక్షసులేనన్నారు. కుటుంబమంతా చిన్నాభిన్నం... బెల్లి లలిత 1999 మే 26న భువనగిరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ మరికొందరు హత్యచేశారు. అయితే నాటి తెలుగుదేశం ప్రభుత్వమే తెలంగాణకు అనుకూలంగా ఉన్న బెల్లి లలితను హత్య చేయించిందని పెద్దఎత్తున్న ఆరోపణలు వచ్చాయి. అలీమొద్దీన్ బెల్లి లలిత కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగా నయీమ్ అనుచరులు 2002లో బెల్లి కృష్ణ బావలు కరుణాకర్, శ్రీరాములు యాదవ్, బత్తుల మల్లేష్యాదవ్లతోపాటు ఆలేరు మండలంలోని టంగుటూర్‌కు చెందిన ఈకి రి సిద్దులును అతికిరాతకంగా హతమార్చారు. కృష్ణనూ హతమార్చేందుకు ప్రయత్నించగా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
అజ్ఞాతం వీడనున్న బెల్లి లలిత సోదరుడు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం చేతిలో దారుణ హత్యకు గురైన నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బెల్లి లలిత సోదరుడు అజ్ఞాతం వీడనున్నారు. నయీం అకృత్యాలపై గళమెత్తిన బెల్లి లలితను నయీం ముఠా అత్యంత కిరాతకంగా చంపింది. ఈ ఘటన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన ఆమె అన్న కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవల పోలీసుల చేతిలో నయీం హతమైన అనంతరం ఆయన తిరిగి జనజీవనంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే ముందుగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడనున్నారు. -
అన్న రాఖీ పండుగకు వస్తే బాగుండు
* నయీమ్ వల్ల మేమంతా చెల్లాచెదురయ్యాం * 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం * మీడియాతో బెల్లి లలిత అక్కాచెల్లెళ్లు తుర్కపల్లి: ‘‘గ్యాంగ్‌స్టర్ నయీమ్ కారణంగా 17 ఏళ్లుగా మా నలుగురం అక్కాచెల్లెళ్లం, అన్నయ్య విడిపోయాం. నయూమ్ చనిపోయూడని తెలిసి ఈ రోజు ముగ్గురం అక్కాచెల్లెళ్లం కలుసుకున్నాం.. మా అన్నయ్య జాడ తెలియదు. ఈ రాఖీ పండుగకైనా వస్తే బాగుండు.. మేమంతా కలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాం’’ అని బెల్లి లలిత సోదరీమణులు బాలకృష్ణమ్మ, గుంటి కవిత, సరిత అన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము నలుగురం ఆడపిల్లలం, ఒక అన్నయ్య ఉన్నాడు. మా నాన్న ఒగ్గు కథలు చెప్పి కుటుంబాన్ని పోషించేవాడు. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అన్న బెల్లి కృష్ణ ఆలనా పాలనా చూస్తూ మా పెళ్లిళ్ల్లు కూడా చేశాడు. తెలంగాణ సాధన కోసం లలిత కాలుకు గజ్జెకట్టి ఎన్నో వేదికల మీద తన ఆట పాటలతో జనాన్ని ఉర్రూతలూగించింది. భువనగిరి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుగుతుం దన్న కారణంతో కొంతమంది నాయకులు కక్షగట్టి 1999లో లలితను హత్య చేయించారు. అదే ఏడాది లలిత చెల్లెలు సరిత భర్త కరుణాకర్‌ను భువనగిరిలో హత్య చేశారు. ఆ తరువాత మా అక్క బాల కృష్టమ్మ భర్తను కూడా హత్య చేశారు. అలా ముగ్గురి హత్యలు జరిగిన తర్వాత మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. మా అన్న ఎక్కడున్నాడో కానీ.. రాఖీ పండుగకు రావాలని ఎదురుచూస్తున్నాం’’ అని చెప్పారు. -
బెల్లి లలితను కిరాతకంగా చంపిన నయీం ముఠా


