గ్యాంగ్‌స్టర్ నయీం చేతిలో దారుణ హత్యకు గురైన నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బెల్లి లలిత సోదరుడు అజ్ఞాతం వీడనున్నారు.
అజ్ఞాతం వీడనున్న బెల్లి లలిత సోదరుడు
Oct 1 2016 1:14 PM | Updated on Oct 16 2018 9:08 PM
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం చేతిలో దారుణ హత్యకు గురైన నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బెల్లి లలిత సోదరుడు అజ్ఞాతం వీడనున్నారు. నయీం అకృత్యాలపై గళమెత్తిన బెల్లి లలితను నయీం ముఠా అత్యంత కిరాతకంగా చంపింది. ఈ ఘటన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన ఆమె అన్న కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవల పోలీసుల చేతిలో నయీం హతమైన అనంతరం ఆయన తిరిగి జనజీవనంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే ముందుగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడనున్నారు.
Advertisement
Advertisement