-
కొడుకు జాడకై తండ్రిపై ఎస్ఐ దాడి
కందుకూరు: తన కుమారుడి కేసు విషయంలో తనని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్ఐ అనవసరంగా దాడి చేసి గాయపరిచాడని కేసరిగుంట కాలనీకి చెందిన కొండయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండయ్య కుమారుడు మాలకొండయ్య ఇటీవల ఓ వివాహితను ఎటో తీసుకెళ్లాడు. ఆమె భర్త, బంధువులు స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. ఈ కేసు విషయమై నాలుగైదు రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ ఎస్ఐ వేమన లేకపోవడంతో రూరల్ ఎస్ఐ ప్రభాకర్ కేసు విచారణ చేపట్టారు. మాలకొండయ్య ఆచూకీ తెలుసుకునేందుకు కొండయ్యను పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. నీ కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. తనకు తెలియదని కొండయ్య చెప్పడంతో ఆవేశానికి గురైన ఎస్ఐ.. కొండయ్యపై దాడి చేశాడు. ఈ దాడిలో కొండయ్య కన్నుకు గాయమైంది. ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో కంటికి చికిత్స చేయించుకున్నాడు. ఈ కేసు విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేకున్నా ఎస్ఐ కావాలనే దాడి చేశాడని విచారం వ్యక్తం చేశాడు. సీపీఐ కార్యదర్శి మాలకొండయ్య, నాయకుడు పి.బాలకోటయ్య మాట్లాడుతూ ఎస్ఐ దురుసు ప్రవర్తన వల్లే కొండయ్యకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. కుమారుడిపై నమోదైన కేసులో ఎటువంటి సంబంధం లేని తండ్రిని తీసుకొచ్చి ఇష్టారీతిన ఎలా కొడతారని ప్రశ్నించారు. ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీ మన్నం మాలకొండయ్యతో పాటు, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నాయకులు వలేటి రాఘవులు, బి.సురేష్ పాల్గొన్నారు. -
కీచకుడిపై అపరకాళికలా మారిపోయి!
-
కీచకుడిపై అపరకాళికలా మారిపోయి!
భువనేశ్వర్: తనను వేధిస్తున్న కీచకుడికి చేతలతో సమాధానం చెప్పింది.. అందరితో శెభాష్ అనిపించుకుంది ఒడిషా జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని. అంతటితో ఆగకుండా తనపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తిని చితకబాదడంతో పాటు వీడియో తీసింది. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి తనపై వేధింపులు మొదలుపెట్టి, కొద్ది సమయం తర్వాత తనపై లైంగిక దాడికి యత్నించాడని విద్యార్థిని చెప్పింది. ప్రతిరోజు తన ఫ్రెండ్స్‌ను ఇలాగే వేధిస్తుంటారని అందుకే అతడికి బుద్ధి చెప్పాలని భావించి, అపరకాళికలా తిరగబడింది. ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఓ సెంటర్‌కు వచ్చాక ఎవరిదారిన వారు వెళ్తున్నారు. ఇంతలో స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, హెచ్చరించినా పట్టించుకోలేదట. ఇక తనను తాను రక్షించుకోవాలని భావించి గట్టిగా అరుస్తూ అతడిని కొట్టడం మొదలుపెట్టింది. వెంటనే అక్కడికి చాలా మందితో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక చూడండీ.. అందరూ కలిసి అతడి చెంపలు వాయిస్తుండటంతో 'నన్ను క్షమించండీ.. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను' అని అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఆ అమ్మాయిలను వేడుకున్నాడు. వారు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా విపరీతంగా షేర్ అవుతోంది. విద్యార్థిని చర్యను అందరూ మెచ్చుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement