breaking news
Batman v Superman
-
'బ్యాట్‌మ్యాన్ vs సూపర్‌మ్యాన్' పోర్న్ పేరడీకి భారీ ఆఫర్
లాస్ ఏంజిలిస్: 'బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ డాన్ ఆఫ్ ది జస్టీస్' వచ్చే ఏడాది మార్చిలోగానీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పుడే ప్రధాన వార్తల్లో నిలిచింది. అసలు సినిమా సంగతి ఎలా ఉన్నప్పటికీ దానికి నకలుగా అంటే.. పోర్న్ పేరడీగా రూపొందించిన 'బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ట్రిపుల్ ఎక్స్' పోర్న్ సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాట్‌మ్యాన్- సూపర్‌మ్యాన్ పోర్న్ పేరడీలో నటించేందుకు తనకు భారీ పారితోషికం ఇవ్వజూపారంటూ.. బెన్ అఫ్లెక్స్ మాజీ గర్ల్ ఫ్రెండ్ క్రిస్టీన్ ఒజొనియాన్ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ బెన్ అప్లెక్స్ మరెవరోకాదు.. అసలు బ్యాట్‌మ్యాన్ సినిమాలో హీరో. బెన్, క్రిస్టీన్లు గతంలో సాగించిన ప్రేమాయణం అప్పట్లో పతాక శీర్శికలకెక్కింది. నిజ జీవితంతో వారి ప్రేమగాథకున్న క్రేజ్.. సదరు పోర్న్ పేరడీ మూవీకి మరింత ప్లస్ అవుతుందని భావించిన దర్శక నిర్మాత అలెక్స్ బ్రౌన్ (ఇటలీలో అడల్ట్ సినిమాల దర్శకుడిగా ఇతగాడికి గొప్ప పేరుంది).. బ్యాట్‌ఉమన్ పాత్రకు క్రిస్టీన్నే తీసుకోవాలని భావించాడట (బ్యాట్‌మ్యాన్ ఎలాగో మాస్క్ వేసుకుంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేసినా ఫర్వాలేదని ఆయన ఉద్దేశమట). అయితే ఆ ఆఫర్ తనకు నచ్చకపోవడంతో సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చింది క్రిస్టీన్. బెన్‌తో ఎప్పుడో తెంచుకున్న ప్రేమ బంధం తాలూకు గుర్తుల్ని.. మళ్లీ బ్యాట్ఉమన్గా నటించి గుర్తుచేసుకోలేనని క్రిస్టీన్ వివరించింది. క్రిస్టీన్‌తో విడిపోయిన తర్వాత బెన్.. మరో నటీ జెన్నీఫర్ గార్నెర్ను పెళ్లాడిన సంగంతి తెలిసిందే. అసలు సినిమా కంటే ఏడాది ముందుగానే (జున్ 3, 2015న) విడుదలైన పోర్న్ పేరడీ సూపర్ హిట్ కావడం మరో విశేషం. గతంలో 300, అవేంజర్స్ లాంటి సినిమాలకు కూడా పోర్న్ పేరడీలు వచ్చాయి. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
బ్యాట్‌మ్యాన్ v సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్ నిడివి : 3 ని. 39 సె. హిట్స్ : 3,39,83,293 ఈ ఏడాది మొదట్లో విడుదలైన బ్యాట్‌మ్యాన్ v సూపర్‌మ్యాన్ తొలి ట్రైలర్‌కు ఏమంత రెస్పాన్స్ రాలేదు కానీ, గత వారం విడుదలైన ఈ రెండో ట్రైలర్‌కు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది! బ్యాట్‌మ్యాన్‌గా బెన్ అఫ్లెక్, సూపర్‌మ్యాన్‌గా హెన్రీ క్యావిల్ నటించారు. వీళ్లిద్దరి మధ్య పోరాటం మానవాళికి ఎలాంటి అపరిచిత సమస్యను తెచ్చిపెట్టిందన్నది ఇతివృత్తం. విడుదల 2016. వచ్చే ఏడాది ఇది బిగ్గెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సూయిసైడ్ స్క్వాడ్ ట్రైలర్ నిడివి : 3 ని. 06 సె. హిట్స్ : 3,41,13,564 సీక్రెట్ మిషన్‌కు బయల్దేరి చివరికి ప్రాణాలు కోల్పోయే సూపర్ విలన్ల కథ ఇది. ఇందులో ‘జోకర్’గా జేర్డ్ లెటో (బొమ్మలో కనిపిస్తున్న వ్యక్తి) తన అసమాన ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. ఇక మార్క్స్ మేన్‌గా (తుపాకీని గురి చూసి పేల్చే హంతకుడిగా) విల్ స్మిత్ నటిస్తున్నారు. ‘ది ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ చిత్రంతో ప్రఖ్యాతిగాంచిన మార్గట్ రాబీ... ఇందులో జోకర్ గారి ఇష్టసఖిగా కనిపించ బోతున్నారు. విడుదల 2016. రోగ్ నేషన్ - స్టంట్ ఫీచరెట్ నిడివి : 1 ని. హిట్స్ : 69,11,849 ఊపరి సలపనివ్వని ఉత్కఠభరితమైన పోరాట దృశ్యాల ‘మిషన్ ఇంపాజిబుల్’ సీరీస్‌లో భాగంగా రాబోతున్న చిత్రం.. ‘రోగ్ నేషన్’. విమానం గాలిలోకి లేవబోతుండగా దాని రెక్క పట్టుకుని క్యాచ్ చేసే సూపర్ ఏజెంటుగా టామ్ క్రూయిజ్ చేసిన విన్యాసం వీక్షకుల కనుగుడ్లను పైకి తెస్తుంది. ఈ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్లు టామ్ క్రూయిజ్‌కు అనిపించిందట. చిత్రం విడుదల వచ్చే నెల 7. నైట్ ఫీవర్ డాన్స్: జెకోవిక్ అండ్ విలియమ్స్ నిడివి : 32 సె. హిట్స్ : 14,90,574 వింబుల్డన్ కోర్టులో ఛాంపియన్లు అయిన నొవాక్ జెకోవిక్, సెరీనా విలియమ్స్... డాన్స్ ఫ్లోర్ మీద కేవలం మానవ మాత్రులై వేసిన స్టెప్పుల అతి చిన్న వీడియో ఇది. దీనిని వింబుల్డన్ అప్లోడ్ చేసింది. వింబుల్డన్ చాంపియన్స్ డిన్నర్ నైట్‌లో ఏర్పాటు చేసిన నైట్ ఫీవర్ డాన్స్‌లో ఈ అగ్రస్థాయి క్రీడాకారులు విడివిడిగా, ఒకరినొకరు తాకకుండా తమకు రాని డ్యాన్స్‌ను ఎంతో నైపుణ్యంగా ప్రదర్శించడం వీక్షకులను అలరిస్తోంది. 1976లో జోర్న్ బోర్గ్, క్రిస్ ఎవర్ట్... ఇలా డిన్నర్ మీట్లో డాన్స్ చేశారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు జెకోవిక్, సెరీనా కనువిందు చేశారు. హీరో : ట్రైలర్ నిడివి : 2 ని. 55 సె. హిట్స్ : 8,37,097 సుభాష్ ఘాయ్ 1983 లవ్‌స్టోరీ ‘హీరో’... మళ్లీ అదే పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్ 11 విడుదల అవుతోంది. ఆదిత్యా పాంచోలీ, జరీనా వాహబ్‌ల కుమారుడు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి హీరో హీరోయిన్లుగా ఇందులో ఆనాటి జాకీ ఫ్రాఫ్, మీనాక్షీ శేషాద్రిల పాత్రలను పోషిస్తున్నారు. గత వారం విడుదలైన ఈ ట్రైలర్లో కొత్త జంట ఆటా పాటా, అమ్మాయి అలకలు, అబ్బాయిగారి ఫైట్స్ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అతియాలోని అతి సహజ సౌందర్యం, సూరజ్ పెంచి పోషించుకున్న సిక్స్ ప్యాక్స్ యూత్‌కి నచ్చే అంశాలు కావచ్చు. ఎఐబి : అన్ అఫెండెడ్ నిడివి : 9 ని. 17 సె. హిట్స్ : 7,26,498 అ ఐఛీజ్చీ ఆ్చజుఛిూూూకి సంక్షిప్త నామం ఎఐబి. ఇదొక వివాదాల కామెడీ గ్రూప్. సుప్రసిద్ధులను అనుకరిస్తూ వారి తీరును వ్యంగ్యంగా విమర్శిస్తుం టుంది. తాజాగా ఈ గ్రూపు విడుదల చేసిన వీడియో పేరే అన్అఫెండెడ్. ఇందులో ‘టైమ్స్ నౌ’ న్యూస్ యాంకర్ అర్ణబ్ గోస్వామిని ఇమిటేట్ చేస్తూ కామెడీ పండించింది. ‘ది నేషన్ వాంట్స్ టు నో’ అంటూ స్టూడియోకు పిలిపించుకున్న అతిథులపై డిబేట్లో భాగంగా తరచు దౌర్జన్యంగా మాట్లాడుతుండే అర్ణబ్పై ఈ మాక్ వీడియో అత్యంత హాస్యభరితంగా సెటైర్లు విసిరింది. -
బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్...డిష్యుం.. డిష్యుం..
బ్యాట్‌మ్యాన్... సూపర్ మ్యాన్... ఈ ఇద్దర్నీ ఇష్టపడనివాళ్లుండరు. విడి విడిగా వేరు వేరు చిత్రాల్లో ఆకట్టుకున్న ఈ రెండు పాత్రలూ ఒకే సినిమాలో కనిపిస్తే? ఇక ఫుల్ మజా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బ్యాట్‌మ్యాన్ వెర్సస్ సూపర్‌మ్యాన్’లో ఈ రెండు పాత్రలూ కనిపించనున్నాయి. బ్యాట్‌మ్యాన్‌గా బెన్ ఎఫ్లిక్, సూపర్‌మ్యాన్‌గా హెన్రీ కావిల్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ హోరాహోరీగా తలపడిన వైనం అందర్నీ విస్మయానికి గురి చేసింది. పైగా, నీవల్లే ప్రపంచం నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని ప్రజలందరూ సూపర్‌మ్యాన్‌ను దూషిస్తున్న దృశ్యం చర్చనీయాంశమైంది. మరి.. సూపర్ మ్యాన్ ఎందుకు నిందలపాలయ్యాడు? బ్యాట్‌మ్యాన్... సూపర్ మ్యాన్ మధ్య ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయాల్సిందే.