breaking news
Azhar movie
-
అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హీరోయిన్
చెన్నై: హీరోయిన్ మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా మారింది. హిందీ సినిమా 'అజర్' కు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్రిటన్ లో నెలరోజుల పాటు జరగనున్న షూటింగ్ లో ఆమె పనిచేయనుంది. 'దర్శకుడు టోనీ డిసౌజాకు మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. టోనీ భార్య ఆమెకు మంచి ఫ్రెండ్ కావడంతో ఈ అవకాశం దక్కింద'ని సినిమా యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సినిమా రూపకల్పన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిందని వెల్లడించాయి. 'అజర్' పాత్రను ఇమ్రాన్ హష్మి పోషిస్తున్నారు. ప్రాచీ దేశాయ్, నర్గీస్ ఫక్రీ, హ్యుమా ఖరేషీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సరదాగా కాసేపు, కొత్త జంట, షాడో, గ్రీన్ సిగ్నల్, దోచేయ్ తదితర సినిమాల్లో మధురిమ నటించింది. -
'అజహర్ సినిమాపై అభ్యంతరం లేదు'
ముంబై: తన జీవితంలో మూడు ముఖ్య ఘట్టాలను తెరపై ఆవిష్కరించినా అభ్యంతరం లేదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజహర్' సినిమాలో మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్, పెళ్లి ఘట్టాలు చూపించారు. అయితే వీటిని చూపించడంపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అజహర్ పేర్కొన్నాడు. తన జీవితంలోని మూడు ముఖ్య ఘట్టాలను ఈ సినిమాలో తెరక్కించారని తెలిపాడు. ఈ సినిమా స్ర్కిప్ట్ చదివానని చెప్పాడు. టోనీ డిసౌజా దర్శకత్వం వహించిన 'అజహర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం విడుదల చేశారు. అజహరుద్దీన్ పాత్రల్లో ఇమ్రాన్ హష్మి నటించాడు. ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మించారు.