'అజహర్ సినిమాపై అభ్యంతరం లేదు' | It's fine to have match-fixing case in biopic: Azharuddin | Sakshi
Sakshi News home page

'అజహర్ సినిమాపై అభ్యంతరం లేదు'

May 21 2015 8:27 PM | Updated on Sep 3 2017 2:27 AM

'అజహర్ సినిమాపై అభ్యంతరం లేదు'

'అజహర్ సినిమాపై అభ్యంతరం లేదు'

తన జీవితంలో మూడు ముఖ్య ఘట్టాలను తెరపై ఆవిష్కరించినా అభ్యంతరం లేదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అన్నాడు.

ముంబై: తన జీవితంలో మూడు ముఖ్య ఘట్టాలను తెరపై ఆవిష్కరించినా అభ్యంతరం లేదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజహర్' సినిమాలో మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్, పెళ్లి ఘట్టాలు చూపించారు. అయితే వీటిని చూపించడంపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అజహర్ పేర్కొన్నాడు.

తన జీవితంలోని మూడు ముఖ్య ఘట్టాలను ఈ సినిమాలో తెరక్కించారని తెలిపాడు. ఈ సినిమా స్ర్కిప్ట్ చదివానని చెప్పాడు. టోనీ డిసౌజా దర్శకత్వం వహించిన 'అజహర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం విడుదల చేశారు. అజహరుద్దీన్ పాత్రల్లో ఇమ్రాన్ హష్మి నటించాడు. ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement