breaking news
australian couple
-
విశాఖలో.. ‘కంగారూల’ కల్యాణ వైభోగం
విశాఖపట్నం: ఖండాలు దాటిన బంధాన్ని భారతీయ సంప్రదాయం కట్టిపడేసింది. వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. అగ్నిహో త్రం సాక్షిగా వేసే ఏడడుగుల బంధం.. భారతీయ వివాహ వైభవం చూసి ఆ్రస్టేలియా జంట మనసు పారేసుకుంది. మిత్రుడి పెళ్లి కోసం విశాఖకు వచ్చిన విదేశీయులు.. ఇక్కడి హైందవ వైభవాన్ని చూసి ముగ్ధులై, వారూ అదే పద్ధతిలో అగి్నసాక్షిగా ఒక్కటయ్యారు. ఆ్రస్టేలియా రాజధాని కాన్‌బెర్రాకు చెందిన బ్రాడీ, ఎమిలీల వివాహం షీలానగర్‌లోని నమస్వీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. మిత్రుడి పెళ్లికి వచ్చి.. ముచ్చటపడి.. ఆ్రస్టేలియాలో జైళ్ల శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బ్రాడీకి, ఎమిలీతో స్వదేశంలోనే నిశ్చితార్థం జరిగింది. విశాఖకు చెందిన పోలీస్ అధికారి కుమారుడు రణసూర్య–సృజన వివాహానికి వీరు అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ జరుగుతున్న వివాహ వేడుకలు, సంప్రదాయాలు, ఆచారాలను ప్రత్యక్షంగా చూసిన ఈ జంట పరవశించిపోయింది. తమ వివాహం కూడా ఇదే పద్ధతిలో జరగాలని ఆశపడ్డారు. శాస్తోక్తంగా మూడు ముళ్ల బంధం అనుకున్నదే తడవుగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి మండపంలో కూర్చున్నారు. పురోహితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ బ్రాడీ వధువు ఎమిలీ మెడలో మంగళసూత్రం కట్టి, నుదిటిన సింధూరం దిద్దాడు. అనంతరం ఒకరికొకరు పూలదండలు మార్చుకుని, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచారు. పరాయి దేశానికి చెందినవారైనా, మన సంస్కృతిపై మక్కువతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ విదేశీ జంటను అతిథులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చదవండి: బంగారం ధరలు.. మూడు రోజుల్లో రూ.4,700 డౌన్! -
సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!
వాళ్లు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు. తమకు ఒక బిడ్డే ఉండటంతో సరొగసీ పద్ధతి ద్వారా మరోబిడ్డ కావాలనుకున్నారు. భారతదేశంలో అయితే చవగ్గా వీలవుతుందని భావించి.. ఇక్కడకు వచ్చారు. సరొగేట్ తల్లికి ఇద్దరు పండంటి బిడ్డలు పుట్టారు. వాళ్లలో ఒకళ్లు బాబు, మరొకళ్లు పాప. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం తమకు అమ్మాయి వద్దు, అబ్బాయి మాత్రమే కావాలని మంకుపట్టు పట్టారు. పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలని భారతదేశంలో ఉన్న ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం అధికారులు వాళ్లకు ఎంతగా చెప్పినా కూడా వినిపించుకోలేదు. కేవలం లింగ వివక్ష కారణంగానే ఆ జంట తమ సరొగేట్ పాపను భారతదేశంలో వదిలిపెట్టేసినట్లు ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఆ దేశంలోని ఫ్యామిలీ కోర్టుకు తెలిపింది. పిల్లలిద్దరినీ స్వదేశానికి తీసుకెళ్లాలని చెప్పి.. కొన్నాళ్లు వీసా ఇవ్వడం కూడా ఆలస్యం చేసినా ఫలితం దక్కలేదు. ఆ జంటకు అప్పటికే ఒక బిడ్డ ఉంది. మరో బిడ్డ కావాలని సరొగసీ కోసం వచ్చారు. కానీ పుట్టిన ఇద్దరు పిల్లల్లో కేవలం మగ పిల్లాడిని మాత్రమే తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఇలాంటి కేసులపై గట్టి విచారణ జరిపించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు నిర్ణయించింది. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం.. తాము ఒక బిడ్డ సరిపోతుందని అనుకున్నామని, కానీ కవలలు పుట్టడంతో తమకు ఒకళ్లు చాలనుకుని మగ పిల్లాడిని తీసుకెళ్లామని అంటున్నారు. అప్పటికే తమకు ఒక పాప ఉండటంతో బాబును తీసుకెళ్లామన్నారు.


