breaking news
attck on family
-
పోలీస్‌స్టేషన్ ఆవరణలో కుటుంబసభ్యులపై..
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కుటుంబసభ్యులపై కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బేగంపేట్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాప్రాల్‌కు చెందిన సయ్యద్ రెహమాన్‌కు, రసూల్ పురాకు చెందిన కౌసర్ బేగంకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కౌసర్ బేగం బేగంపేట పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది. రెహమాన్ మద్యానికి బానిస కావడంతో కౌసర్ బేగం భర్తకు దూరంగా ఉంటూ తల్లి ఇంట్లో ఉంటోంది. ఎనిమిది నెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల తాగడానికి డబ్బుల కోసం భార్య కౌసర్ బేగం వద్దకు వచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బేగం పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కౌసర్ బేగం తల్లిదండ్రులు, చెల్లితో కలిసి వచ్చింది. భార్యపై కోపంతో కత్తితో పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశాడు. అడ్డొ చ్చిన కుటుంబసభ్యులను కూడా కత్తితో గాయపర్చాడు. ఈ దాడిలో భార్య కౌశర్ బేగం, మరదలు షాకీర్ బేగం, అత్త మస్తాన్ బేగం, బంధువులు సర్ధార్ బేగం, సల్మాన్ ఖాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని సంఘటనా స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయపడ్డ వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
గుంటూరు జిల్లాలో దారుణం
కారంపుడి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుతిరిగి చెల్లించలేదని ఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని కారంపుడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.