breaking news
ATM Destroyed
-
పెద్ద నోట్ల రద్దు: ఏటీఎం ధ్వంసం చేసిన కానిస్టేబుల్
పాడేరు: పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా అసహనానికి గురై ఏటీఎంను ధ్వంసం చేశాడు. విశాఖ జిల్లా పాడేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఏటీఎం మాత్రమే ఉంది. పెద్ద నోట్ల రద్దుతో నోట్ల కొరత ఏర్పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డబ్బులు తీసుకోవడానికి రాత్రివేళ ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు. తన వంతు వచ్చేసరికి ఆ మిషన్ పనిచేయలేదు. అసహనంతో ఏటీఎంను గట్టిగా నాలుగైదుసార్లు కాలుతో తన్నాడు. అయినా కోపం తగ్గకపోవడంతో రెండో ఏటీఎంనూ ధ్వంసం చేశాడు. దీంతో రెండు ఏటీఎంలు ధ్వంసమై అసలుకే పనిచేయకుండా పోయాయి. ఉన్న ఒక్క కేంద్రాన్ని మూసేయడంతో శనివారం డబ్బుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల వద్ద గంటలతరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. -
ఎస్బీహెచ్ ఏటీఎం ధ్వంసం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వెనుక వీధిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదారబాద్ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఏటీఎంలో నగదు ఉడే సెల్లర్‌ను పగలగోట్టేందుకు ప్రయత్నించి రాకపోవడంతో పరారయ్యారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దుండగులు మొదట ఏటీఎంలోకి ప్రవేశించిన సీసీ కెమెరాల వైర్లను తొలగించారు. ఈ విషయమై బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం వెలిముద్రలు తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి ఏటీఎంలోకి వెళ్లి తలుపులు వెసుకున్న వైనాన్ని ఐడీ పార్టీ పోలీసులు పరిశీలించారు. అయితే ఆ పూటేజీలో స్పష్టత లేదన్నారు.