ఇదేం పాడుబుద్ధి.. డాక్టర్ని ఇంటికి పిలిపించుకుని
వాళ్లిద్దరూ తెరపై నటులు. నిజజీవితంలో మాత్రం దొంగలు. ఈ విషయం తెలిసి తోటీ యాక్టర్స్ అవాక్కవుతున్నారు. తెలుగు హిట్ సినిమా 'మత్తు వదలరా'తో నటిగా మారిన మలయాళ బ్యూటీ అతుల్య చంద్ర.. ఆపై సొంత భాషలో మూండ్ర కన్, ఉయిర్, డైస్ ఈరే మూవీస్ చేసింది. ఇప్పుడు ఏమైందో ఏమో తెలీదు గానీ ఓ డాక్టర్ని ఇంటికి పిలిపించుకుని అతడిని దోచేసింది. ఈమెకు మరో నటుడు సాయం చేశాడు.(ఇదీ చదవండి: 'రామాయణ' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)కేరళలోని కొచ్చిలో అతుల్య చంద్ర.. నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లితో కలిసి సోమవారం, తన అపార్ట్మెంట్ నుంచి స్థానిక వైద్యుడికి ఫోన్ చేసింది. తన బంధువుకి అత్యవసర వైద్యసాయం అందించేందుకు ఇంటికి రావాలని ఆయనతో చెప్పారు. ఉదయం ఆరున్నరకు డాక్టర్.. వాళ్ల ఫ్లాట్‌కి వెళ్లేసరికి అక్కడ మొత్తం 12 మంది యువతీయువకులు ఉన్నారు. వీళ్లంతా కలిసి సదరు డాక్టర్‌పై దాడి చేశారు.వైద్యుడి దగ్గరున్న ఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ లాక్కుని.. ఇదంతా పోలీసులకు చెబితే వైద్యం కోసమని వచ్చి, తమ బంధువుపై అత్యాచారానికి ప్రయత్నించావని కేసు పెడతామని బెదిరించారు. కొన్ని గంటల తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న డాక్టర్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి బయటపడింది. ఇద్దరు నటలుతో పాటు మరొకరిని అరెస్ట్ చేశామని, మిగిలిన వాళ్లకోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఈ డాక్టర్ని ఎందుకు పిలిచారు? వీళ్ల ఉద్దేశం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ముకేశ్‌పై దేబ్జానీ ప్రతీకారం.. త్రిగుణ్ ఎమోషనల్)