breaking news
Atal pension scheme
-
భారత ఆర్థిక భవిష్యత్తుకు పెన్షన్లు కీలకం
భారతదేశ ఆర్థికాభివృద్ధి గురించి చర్చ వచ్చినప్పుడల్లా సాధారణంగా జీడీపీ వృద్ధి, తయారీ రంగం, మౌలిక సదుపాయాలు లేదా స్టార్టప్‌ల గురించి మాట్లాడుకుంటాం. కానీ, దేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం ‘పెన్షన్’ గురించి చాలా తక్కువగా చర్చిస్తాం. నేడు యువ భారత్‌గా ఉన్న మన దేశం భవిష్యత్తుల్లో వృద్ధాప్యం వైపు అడుగులు వేయాల్సిందే. ఈ తరుణంలో పెన్షన్లు కేవలం వ్యక్తిగత పొదుపు మాత్రమే కాదు, దేశ ఆర్థిక గమనానికి ఒక బలమైన పునాదిగా మారుతున్నాయి.ప్రస్తుతం భారతదేశం యువ జనాభాతో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానంలో ఉంది. పని చేసే వయస్సు గల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే, ఈ అనుకూలత ఎల్లకాలం ఉండదు. కొన్ని సర్వేల ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సుమారు 32 కోట్లకు చేరుకోనుంది. గతంలో వృద్ధులకు కుటుంబాలే ఆసరాగా ఉండేవి. కానీ నేడు పెరుగుతున్న పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం కారణంగా వృద్ధాప్యంలో ఆర్థిక స్వావలంబన తప్పనిసరి అవుతోంది.అవగాహన పెరుగుతున్నా.. సన్నద్ధత కరవుభారతీయులు రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ముఖ్యమైనదిగా భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు వెనుకబడి ఉన్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. పీజీఐఎం ఇండియా రిటైర్మెంట్ రెడీనెస్ రిపోర్ట్ 2025 నివేదిక ప్రకారం, కేవలం 37% మంది భారతీయుల వద్ద మాత్రమే నిర్దిష్టమైన రిటైర్మెంట్ ప్లాన్ ఉంది. ఇది 2023లో ఉన్న 67% తో పోలిస్తే తగ్గింది. పట్టణ ప్రాంతాల్లోని 24% మంది భారతీయులు ఇప్పటివరకు రిటైర్మెంట్ కోసం రూపాయి కూడా పొదుపు చేయలేదు. కేవలం 11% మంది మాత్రమే తమ ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తు అవసరాలకు సరిపోతాయని నమ్ముతున్నారు.పెన్షన్ వ్యవస్థ: దేశ ఆర్థిక వ్యవస్థకు బలంపెన్షన్లు కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే కాకుండా స్థూల ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇవి దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వంపై భవిష్యత్తులో పడే సామాజిక భద్రతా వ్యయాన్ని తగ్గిస్తాయి.దేశ పెన్షన్ నిర్మాణంఆర్గనైజ్డ్ సెక్టర్: ఈపీఎఫ్, ఈపీఎస్ ద్వారా ఉద్యోగులకు భద్రత.నేషనల్ పెన్షన్ సిస్టమ్: తక్కువ ఖర్చు, పన్ను ప్రయోజనాలు, మార్కెట్ ఆధారిత రిటర్నులతో ఇది నేడు ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి పొందే వారికి ప్రధాన ఎంపికగా మారింది.లైఫ్ ఇన్సూరెన్స్ రంగం: కేవలం పొదుపు చేయడమే కాకుండా పొదుపు చేసిన సొమ్మును జీవితాంతం వచ్చే యాన్యుటీ లేదా పెన్షన్‌గా మార్చడంలో బీమా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి రక్షణ కల్పిస్తూ వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తాయి.అసంఘటిత రంగం: అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు గిగ్ వర్కర్లు, రైతులు, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్నాయి.ఏం చేయాలంటే..భారతదేశ శ్రామిక శక్తిలో కేవలం 15–25% మందికి మాత్రమే అధికారిక పెన్షన్ సౌకర్యం అందుతోంది. మెజారిటీ జనాభా ఇప్పటికీ సామాజిక భద్రతకు దూరంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్‌గా ఎదగాలంటే పెన్షన్ల పరిధిని విస్తరించడం అత్యవసరం. ఆర్థిక అక్షరాస్యతను పెంచడం ద్వారా, క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహించడం ద్వారా మాత్రమే వృద్ధాప్యాన్ని ఒక రిస్క్ లాగా కాకుండా ఆర్థిక వృద్ధిలో భాగంగా మార్చుకోగలం. బలమైన పెన్షన్ వ్యవస్థ ఉన్నప్పుడే రేపటి భారతం ఆర్థికంగా మరింత పటిష్టంగా ఉంటుంది.- కమల్ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బ్యాంకస్యూరెన్స్ఇదీ చదవండి: ‘భారత్‌లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్.. ఎలాగంటే?
ఉద్యోగం లేనివారికి, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, కూలీలకు పెన్షన్ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రోజూ టీ తాగే ఖర్చుతో నెలకు రూ.5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. అదే మీరు కొంత ఆలస్యంగా అంటే మీ ఇరవైఐదో ఏట ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాలి. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40వ ఏట దీన్ని ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్ పొందే వీలుంది. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా చిన్న వయసులోనే నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతోనే రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. -
పన్ను చెల్లింపుదారులకు షాక్, 'ఏపీవై' పథకంలో చేరకుండా కేంద్రం నిషేధం!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఏపీవైలో చేరేందుకు అనర్హులు’’అంటూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1లోపు చేరిన వారికి నూతన నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను ప్రధానంగా లక్ష్యిత వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అక్టోబర్ 1, ఆ తర్వాత నుంచి ఏపీవైలో చేరిన సభ్యుల్లో ఎవరైనా పన్ను చెల్లింపుదారునిగా బయటపడితే వారి ఏపీవై ఖాతాను మూసేసి, అందులో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి.. వృద్ధాప్యంలో ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయం లేదు. చదవండి👉 ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ? దీంతో అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు 2015 జూన్ 1 నుంచి ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,000–5,000 మధ్య ఎంత పెన్షన్ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు నెలవారీ లేదా త్రైమాసికం లేదా, వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. -
కనీస రాబడులతో వినూత్న పెన్షన్ పథకం
ముంబై: వినూత్నమైన పెన్షన్ ప్లాన్లను తీసుకురావడం దిశగా పనిచేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఇందులో కనీస రాబడుల హామీతో ఒక పథకం ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బంధోపాధ్యాయ అన్నారు. పీఎఫ్ఆర్డీఏ నియంత్రణలో ప్రస్తుతం ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలు కొనసాగుతుండగా.. మరింత మంది చందాదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన పెన్షన్ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామని బంధోపాధ్యాయ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ ఉత్పత్తి తీసుకువచ్చే విషయంలో యాక్చుయరీలు సాయమందించాలని బంధోపాధ్యాయ కోరారు. యాక్చుయరీల నుంచి వచ్చే సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగే సమయంలో సభ్యులకు అధిక రేట్లతో కూడిన పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్‌ను అందించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు. మార్కెట్ ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లకు అనుగుణంగా ఉండే భిన్నమైన యాన్యుటీ ఉత్పత్తుల అవసరం ఉందన్నారు. క్రమానుగతంగా కావాల్సినంత వెనక్కి తీసుకునే ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) మాదిరి యాన్యుటీ ప్లాన్లు కావాలన్నారు. పెన్షన్ ఎంత రావచ్చన్న అంచనాలను ప్రస్తుత, నూతన చందాదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు బంధోపాధ్యాయ చెప్పారు. -
పేదల కోసం జనసురక్ష
- తక్కువ ప్రీమియంతో బీమా - ఏడాదికి రూ.12కే రెండు లక్షల ప్రమాద మరణ బీమా - రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో జీవిత బీమా - రూ.వెయ్యి ప్రీమియంతో - అటల్ పెన్షన్ యోజనతక్కువ ప్రీమియంతో బీమా - ఏడాదికి రూ.12కే రెండు లక్షల ప్రమాద మరణ బీమా - రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో జీవిత బీమా - రూ.వెయ్యి ప్రీమియంతో అటల్ పెన్షన్ యోజన న్యూఢిల్లీ: ప్రజలందరికీ బీమా సౌకర్యం ఉండేలా జైట్లీ మూడు పథకాలను బడ్జెట్లో ప్రకటించారు. దామాషా ప్రకారం చూస్తే దేశంలోని ఎక్కువమంది ప్రజలు ఎలాంటి బీమా పథకం లేకుండానే ఉన్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన విజయవంతమైనట్లే.. భారతీయులందరికీ సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రమాద, జీవిత బీమా, పెన్షన్ పథకాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వీటిలో మొదటిది ‘ప్రధానమంత్రి సురక్షా బీమా’. దీని కింద ఏడాదికి కేవలం రూ.12 అంటే నెలకు రూపాయి చొప్పున ప్రీమియం కడితే రూ.2 లక్షల ప్రమాద మరణ బీమా వర్తిస్తుంది. ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు బీమా కింద లభిస్తుంది. జైట్లీ ‘అటల్ పెన్షన్’ పథకాన్నీ ప్రకటించారు. ఏడాదికి కనీసంగా రూ.వెయ్యి చొప్పున ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే, లబ్ధిదారులు చెల్లించే మొత్తానికి ప్రభుత్వం 50% పెన్షన్‌గా చెల్లిస్తుంది. 2015 డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తెరిచిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. జైట్లీ ప్రకటించిన మూడో పథకం జీవిత బీమాకు సంబంధించిన ‘ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన’. ఈ పథకం సహజ, ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు గల వారు ఏడాదికి రూ.330 (అంటే, రోజుకు రూపాయి కంటే తక్కువ) ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ బీమా కింద లబ్ధిదారులకు రూ.2 లక్షలు చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకూ వరాలు దేశంలో 80 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు దాదాపు కోటి మంది వరకు ఉన్నారని జైట్లీ అన్నారు. వీరిలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వీరిలోనూ ఎక్కువమంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారేనన్నారు. ఇలాంటి సీనియర్ సిటిజన్లకు వయసు కారణంగా వచ్చే వివిధ వైకల్యాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామన్నారు. వృద్ధాప్యం లో ఏ ఒక్కరూ బాధ పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఎస్సీలకు రూ. 30,851 కోట్లు, ఎస్టీలకు రూ.19,980 కోట్లు, మహిళలకు రూ. 79,258 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పారసీల నాగరికత, సంస్కృతిలను కాపాడటానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని, 2015-16లో జరిగే ‘ది ఎవర్ లాస్టింగ్ ఫ్లేమ్’ ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలిపారు.


