breaking news
Astronomical Scientists
-
సూర్యుడి కన్నా భారీ నక్షత్రం!
లండన్: భూమికి దాదాపు 11 వేల కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంతలో కొత్త నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. తక్కువ వయసున్న ఈ నక్షత్రం సూర్యుడి కన్నా పరిమాణంలో దాదాపు 30 రెట్లు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల భారీ నక్షత్రాలు ఏర్పడే విధానాన్ని సులువుగా తెలుసుకునే వీలు కలగనుంది. ఇప్పటికీ ఈ నక్షత్రం తన మాతృ అణువుల నుంచి పదార్థాలను సేకరించే పనిలోనే ఉందని, ఆ ప్రక్రియ పూర్తయితే మరింత భారీగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ భారీ నక్షత్రం పుట్టుకలోని కీలకమైన దశను ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఈ నక్షత్రాలు కూడా చిన్న నక్షత్రాల మాదిరిగానే, గాలి, దుమ్ము ఒక్కచోటికి చేరి గుండ్రంగా తిరగడం వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. సూర్యుడి వంటి నక్షత్రాల కన్నా 8 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న నక్షత్రాలను అధ్యయనం చేయడం కష్టమని కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్కి చెందిన జాన్ ఇలీ పేర్కొన్నారు. -
అంతరిక్షం అంచుల్లో గెలాక్సీ
వాషింగ్టన్: విశ్వంలోని మరో అద్భుతాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇప్పటి వరకు మానవుడు కనుగొన్న గెలాక్సీలకన్నా అత్యంత దూరమైన నక్షత మండలాన్ని కనిపెట్టారు. 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పాలపుంత.. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అంటే దాదాపు 40 కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. జీఎన్-జడ్11 అనే ఈ గెలాక్సీ.. ఉర్సా మేజర్ నక్షత్ర మండలం దిశలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కొత్త గెలాక్సీని చూశాం’ అని యేల్ యూనివర్సిటీకి చెందిన పాస్కల్ అనే ప్రధాన పరిశోధకుడు తెలిపారు. ఈ పాలపుంత దూరాన్ని హబుల్ టెలిస్కోప్‌లోని వైడ్ ఫీల్డ్ కెమెరా 3ని పరిశోధకులు తొలిసారిగా ఉపయోగించారు.