-
తోటకూరతో.. హెల్దీగా సమోసా చేసుకోండి ఇలా!
తోటకూర సమోసా కావలసినవి: తోటకూర తురుము – ఒకటిన్నర కప్పులు టొమాటో గుజ్జు – పావు కప్పు (నిప్పులపై కాల్చి, దాన్ని మిక్సీ పట్టుకోవాలి) స్వీట్ కార్న్ – పావు కప్పు (ఉడికించుకోవాలి) తాలింపు సామాన్లు – కొన్ని మైదా పిండి – 2 కప్పులు గోధుమ పిండి – 1 కప్పు. ఉప్పు – సరిపడా, నూనె – తగినంత తయారీ: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, కొద్దిగా ననె, సరిపడా నీళ్లు, ఉప్పు వేసుకుని చపాతీ ముద్దలా చేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు తాలింపు పెట్టుకుని.. అందులో టొమాటో గుజ్జు, తోటకూర తురుము వేసుకుని చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. మొత్తం దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. అనంతరం చపాతీ పిండిని ఉండల్లా చుట్టుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, చిన్న చిన్న సమోసాల్లా చుట్టుకోవాలి. తర్వాత ప్రతి సమోసాలో.. కొద్దికొద్దిగా తోటకూర మిశ్రమంతో పాటు ఒక టీ స్పూన్ స్వీట్ కార్న్ వేసుకుని.. ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన ననెలో వేయించి తీసి.. సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పిల్లలు ఇష్టపడేలా..చాక్లెట్ పాక్ చేసుకోండి ఇలా..!) -
అబ్బా! తోటకూర కాదు అబ్బో! తోటకూర!!
గుడ్‌ఫుడ్ తోటకూరలో క్యాల్షియం, ఎ,బి1, బి2, బి6, సి, కె, విటమిన్లు, ఐరన్, రిబోఫ్లేవిన్, పొటాషియం, జింక్, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. పాలను జీర్ణించుకోలేని వారు తోటకూర తినడం చక్కటి ప్రత్యామ్నాయం. పాల ద్వారా అందాల్సిన క్యాల్షియమ్‌ను తోటకూర భర్తీ చేస్తుంది. మధుమేహం ఉన్నవారు రోజూ తోటకూర తినడం మంచిది. ఇది ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగినంత ఉండడానికి దోహదం చేస్తుంది. తోటకూర శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వారానికోసారి తోటకూర తింటే నోట్లో పుండ్లు, చిగుళ్లవాపు, గొంతునొప్పి వంటి సమస్యలన్నీ నివారణ అవుతాయి. ఈ ఆకులోని పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తోటకూర తింటే చక్కటి ఫలితం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. -
రెండాకులు ఎక్కువే పిండాం..!
టేస్ట్ ద థండర్ ... గుట గుటమనిపించే ఉంటారు ఓపెన్ హ్యాపీనెస్... సిప్పు కొట్టే ఉంటారు. యే దిల్ మాంగే మోర్... ఆస్వాదించే ఉంటారు జ్యాదా మస్తి ... లాగించే ఉంటారు క్లియర్ హై ... క్లియర్ చేసే ఉంటారు ఇవి... అన్నీ కూల్‌డ్రింక్స్ ట్యాగ్లైన్లు. కానీ, మేం ఆరులైన్లు ఎక్కువే చదివాం. అందుకే, రెండాకులు ఎక్కువే పిండాం. ఆకుకూరలతో జ్యూసులు టేస్ట్ ద వండర్! పుదీనా జ్యూస్ కావల్సినవి: పుదీనా ఆకులు – ఒకటిన్నర కప్పు; బెల్లం లేదా పంచదార – 6 టేబుల్ స్పూన్లు (తగినంత); నీళ్లు – అర కప్పు; నల్లుప్పు – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – టీ స్పూన్; నిమ్మరసం – 3 టీ స్పూన్లు తయారీ: పుదీనా కాడల నుంచి ఆకులను వేరు చేసి, నీళ్లలో వేసి కడగాలి. తర్వాత జల్లిలో వేసి నీళ్లన్నీ పోయేదాకా ఆరనివ్వాలి. అన్ని పదార్థాలు మిక్సర్జార్లో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్రమం పూర్తిగా పేస్ట్ అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. పుదీనా జ్యూస్ పావు కప్పు తీసుకుంటే 3 కప్పుల నీళ్లు దీనికి కలపాలి. గ్లాస్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సేవించాలి. (తీపి కావాలనుకుంటే మరికాస్త కలుపుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం లేదంటే తేనెను కూడా వాడుకోవచ్చు.) మునగాకు జ్యూస్ కావల్సినవి: మునగాకు – అర కప్పుతేనె – టేబుల్ స్పూన్ నిమ్మరసం – టేబుల్ స్పూన్ నీళ్లు – అర గ్లాసు తయారీ: మునగాకు మెత్తగా రుబ్బి, అందులో నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. గ్లాసులో పోసి నిమ్మరసం, తేనె కలపాలి. క్యాల్షియం సమృద్ధిగా లభించే మునగాకు ఎముకల బలానికి మేలు చేస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కావల్సినవి: వీట్‌గ్రాస్ తరుగు – అరకప్పుపైనాపిల్ ముక్కలు – 6 కప్పులుపుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్ తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి.గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్‌ను ఎక్కువగా వాడకపోవడమే మేలు. కొత్తిమీర జ్యూస్ కావల్సినవి: పాలకూర తరుగు – కప్పు ఏదైనా మరో ఆకు కూర – ఒక ఆకు యాపిల్ – 1 నిమ్మరసం – టీ స్పూన్నీళ్లు – కప్పు తయారీ: ఆకు కూరను, యాపిల్‌ను శుభ్రపరచాలి. యాపిల్ ను ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసి, మెత్తగా బ్లెండ్ చేయాలి. నిమ్మరసం కలిపి సర్వింగ్ గ్లాస్లో పోసి అందించాలి. చల్లగా కావాలనుకునేవారికి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి. తమలపాకు జ్యూస్ కావల్సినవి: కొత్తిమీర తరుగు – అర కప్పు పుదీనా ఆకులు – గుప్పెడు నీళ్లు – కప్పు నిమ్మరసం – టీ స్పూన్ ఉప్పు – తగినంత తయారీ: కప్పు నీళ్లు మరిగించాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి, పైన మూత పెట్టి, మంట తీసేయాలి. ఐదు నిమిషాలు ఉంచి, ఆ నీటిని వడకట్టాలి. ఆకులను గ్రైండర్లో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో వడకట్టిన నీళ్లు కలిపి ఆకులను మెత్తగా అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఈ జ్యూస్ ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా అయ్యాక అందించాలి. వీట్‌గ్రాస్ జ్యూస్ కావల్సినవి: వీట్‌గ్రాస్ తరుగు – అరకప్పు పైనాపిల్ ముక్కలు – 6 కప్పులు పుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్ తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి. గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్‌ను ఎక్కువగా వాడకపోవడమే మేలు. పాలకూర జ్యూస్ కావల్సినవి: తమలపాకులు – 2 గులాబీ పూల రేకలు – కొన్ని బెల్లం తరుగు – 3 టేబుల్ స్పూన్లు లవంగం – 1 దాల్చిన చెక్క – చిన్న ముక్క నీళ్లు – కప్పు తయారీ: తమలపాకులు, గులాబీ పువ్వు రేకలు శుభ్రం చేయాలి. అన్నీ కలిపి, జ్యూస్ మిక్సర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. వడకట్టి, సేవించాలి. నోట్ : ఆకుకూరలను తప్పనిసరిగా తగినన్ని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కనీసం 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత మరో రెండు సార్లు మంచి నీళ్లతో శుభ్రపరచాలి. ఆకుల మీద పురుగుమందుల అవశేషాలు పోయే వరకు శుభ్రం చేయాలి. -
ఇంటిప్స్
ఆకుకూరలలో పెద్ద పెద్ద ఆకులను చుట్టలా చుట్టి కట్ చేస్తే తరుగు సన్నగా వస్తుంది.ఉడకబెట్టాక గుడ్డుపై పెంకును తీయాలంటే కొన్నింటివి సాధారణంగా రావు. ఇలాంటప్పుడు ఆ గుడ్డును ఫ్రిజ్‌లో పెట్టి 10 నిమిషాల తర్వాత తీస్తే పెంకు సులువుగా వస్తుంది.మాంసం, ఆకుకూరలను కట్ చేయడానికి విడిగా కటింగ్ బోర్డులను ఉపయోగించడం వల్ల పదార్థాలు కలుషితం కాకుండా ఉంటాయి. నాన్‌స్టిక్ పాన్లలో వంట చేసేటప్పుడు ఆ పదార్థాలపైన బ్లాటింగ్ పేపర్‌ను చుడితే త్వరగా ఉడుకుతాయి. టొమాటో పై తొక్క సులువుగా రావాలంటే వేడినీటిలో వేసి 10 సెకండ్లు ఉంచి, బయటకు తీయాలి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement