‘రొనాల్డోనే స్ఫూర్తి.. నా తండ్రి కూడా అలానే మరణించాడు’
కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో గేమ్‌లో మహిళల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారిణిగా అస్మితా దే చరిత్ర సృష్టించింది. 48 కేజీల విభాగంలో కెనడాకు చెందిన హిడీ క్వాచ్ను ఓడించి పడిసి పతకం అందకుంది. అయితే తన జీవితంపై ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రభావం బలంగా ఉందని అస్మితా దే స్పష్టం చేసింది. జీవితంలో ఇష్టమైన వాళ్లను కోల్పోతే ఆ బాధను ఎలా దిగమింగాలన్న విషయాన్ని రొనాల్డో నుంచే నేర్చుకున్నట్లు అస్మితా తెలిపింది.నేను ఎక్కువగా ఆరాధించే వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అతడు తన 19వ ఏట తండ్రిని కోల్పోయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ఇవాళ రొనాల్డో ఎవరనేది ప్రపంచానికి మొత్తం తెలుసు. అతడి జీవితాన్ని పూర్తిగా చదివాను. అందుకే రొనాల్డో నాకు అత్యంత స్ఫూర్తినిచ్చే వ్యక్తి* అని చెప్పుకొచ్చింది.ఇక అస్మితా దే జీవిత ప్రయాణం కూడా కష్టాల నుంచే మొదలయ్యింది. త్రిపురలో దక్షిణ ప్రాంతమైన బెలోనియాలో జన్మించిన అస్మితా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న ఇంట్లో పుట్టింది. అస్మితా తండ్రి అర్జున్ దే త్రిపురలో సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూ రోజుకు రూ. 300 సంపాదించేవాడు. అయితే చిన్నప్పటి నుంచే ఆటలపై కూతురు పెంచుకున్న ఇష్టాన్ని చూసిన తండ్రి తాను సంపాదించే ప్రతి రూపాయిని పొదుపుగా ఖర్చు చేసేవారు. ఆ తర్వాత అస్మితా భోపాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరి జోడోలో మరింత పట్టు సాధించింది. ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ కోటాలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసు విభాగంలో ఉద్యోగం లభించడంతో ఆర్థిక కష్టాలు కొంతమేర తగ్గాయి. అయితే ఆర్థిక కష్టాలు తగ్గినప్పటికీ, కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించడానికి కొన్ని రోజుల ముందే అస్మితా తండ్రి అర్జున్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. తండ్రి మరణంతో షాక్‌లో ఉండిపోయిన అస్మితా తాను పోటీల్లో పాల్గొనగలనా అనే సందేహం వచ్చింది. కానీ అస్మితా తల్లి అనుక్షణం ఆమె వెంటే నిలిచి తండ్రి కలను నెరవేర్చాలని గుర్తు చేస్తూ ప్రోత్సహించింది. తండ్రి పోయిన బాధను దిగమింగుకొని కామన్వెల్త్ గేమ్స్‌కు పుట్టెడు దుఃఖంతో వెళ్లిన అస్మితా దే తండ్రి కలను నిజం చేస్తూ ఇవాళ స్వర్ణ పతకంతో దేశానికి తిరిగి వచ్చింది.INSPIRED BY THE GREATEST! 🐐 India’s golden judoka Asmita Dey reveals how Cristiano Ronaldo’s relentless drive fuels her own journey to the top. 💪 #SonySportsNetwork #SonyLIV #Glasgow2026 #GlasgowMeinTiranga #Cheer4Bharat pic.twitter.com/x40Dg3oygj— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2026చదవండి: విషాదం.. గుండెపోటుతో కన్నుమూసిన బ్రెజిల్ ఆటగాడు