-
పాక్ మాజీ అధ్యక్షుడు అరెస్టు
ఇస్లామాబాద్ : నకిలీ బ్యాంకు అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అలీతో పాటు.. ఆయన సోదరి ఫర్యాల్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పీటీఐ వెల్లడించింది. కాగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న అలీ నిర్వహిస్తున్న లావాదేవీలపై నేషనల్ అకౌంటబిలిటి బ్యూరో(అవినీతి నిరోధక శాఖ) అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పలు నకిలీ అకౌంట్ల ద్వారా సోదరితో కలిసి సుమారు 150 మిలియన్ డాలర్ల నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అలీతో పాటు ఆయన సోదరిని అదుపులోకి తీసుకోవాలని ఎన్ఏబీ నిర్ణయించింది. దీంతో ఆయనను సోమవారం అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ముందస్తు బెయిల్ తెచ్చుకున్న అలీ.. దానిని పొడిగించాలని కోరుతూ ఇస్లామబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసారి అత్యున్నత న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అలీని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన సోదరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. -
పాక్ రాజకీయాల్లోకి యువ కిరణం
ఇస్లామాబాద్: తన భార్య పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనర్జీర్ భుట్టో తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తనయుడు బిల్వాల్ భుట్టో జర్దారీని పార్లమెంటు స్ధాయి రాజకీయాల్లోకి తీసుకువస్తున్నట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి బెనర్జీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా పార్టీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించింది. పార్లమెంటులో బిల్వాల్ ప్రవేశం కోసం కొద్ది రోజుల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన ఓ ఎంపీ రాజీనామా చేస్తారని అక్కడి మీడియా పేర్కొంది. ఆ తర్వాత బిల్వాల్ సదరు ఎంపీ స్ధానం నుంచి ఉప ఎన్నికల్లో పీపీపీ తరఫు పోటీలో నిలబడతారని చెప్పింది. మరి బిల్వాల్ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెడతారా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకవేళ బిల్లాల్ ఉప ఎన్నికల్లో నెగ్గితే మాత్రం పాకిస్తాన్ రాజకీయాలు శరవేగంగా మారతాయనడంలో సందేహం లేదు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బరితెగించిన టీడీపీ నేతలు
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
జనస్వామ్యమా! జయీభవ!!
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
రెండ్రోజులు వానలు
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
తప్పక చదవండి
- బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
- బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
- ఈసీ ద్వంద్వ వైఖరి
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement