breaking news
Architectural
-
హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు
హలేబీడు ఈ ప్రదేశాన్ని ఒకటిగా పలకడం పర్యాటకరంగానికి అలవాటు ఉండదు. బేలూరు– హలేబీడు అని పలుకుతారు. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం 17కిలోమీటర్లు. ఈ రెండు ప్రదేశాల్లోని నిర్మాణాలు ఒకేరీతిలో ఉంటాయి. ఒకే రాజవంశానికి చెందిన కట్టడాలు. హొయసల రాజవంశం దక్షిణభారతదేశాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించింది. యుద్ధాలు లేని ప్రశాంత సమయంలో ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. హొయసలుల ఆలయాలన్నీ మహాభారతం, రామాయణం, భాగవత గ్రంథాలకు శిల్పరూపాలు. వేదవ్యాసుడు, వాల్మీకి రాసిన గ్రంథాలను శిలల్లో ఆకర్షణీయంగా చెక్కిన శిల్పులు కూడా అంతటి మహోన్నతులే అని చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. పదకొండవ శతాబ్దంలో ఈ స్థాయిలో విరాజిల్లిన ప్రదేశం ఆ తర్వాత రాజకీయ సంక్లిష్టతల దుష్ప్రభావాన్ని ఎదుర్కొన్నది. ఇప్పుడు కనిపిస్తున్నది 14 శతాబ్దంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ తుగ్లక్‌ల దాడిలో విధ్వంసం అయిన తర్వాత మిగిలిన రూపాలే. ఆ విగ్రహాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెరుగులు దిద్దుతోంది.కళకు శిలాసాక్ష్యాలుహొయసల రాజవంశం కళాభిరుచికి ప్రతీకలు ఆలయాలు. వీటిని హొయసల టెంపుల్స్‌గా వ్యవహరిస్తారు. హలేబీడులో హొయసలేశ్వర ఆలయంతోపాటు కేదారేశ్వరాలయం, జైన్ ఆలయాలు ప్రసిద్ధం. హొయసలుల ఆలయ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. వేస్మెంట్ నక్షత్రం ఆకారంలో ఉంటుంది. హొయసలేశ్వర ఆలయం ట్విన్ టెంపుల్. శైవంతోపాటు వైష్ణం, శాక్తేయంతోపాటు వేదాలన్నింటికీ ప్రతిరూపం. దేవతల విగ్రహాలు, మునుల విగ్రహాలతోపాటు ఏనుగులు, సింహాలు, గుర్రాలు, పూలతీగలు అడవిలో చెట్టును అల్లుకున్నట్లు రాతిలో సజీవరూపంలో ఉంటాయి. ఈ నిర్మాణాల్లో రాణి కేతలాదేవి చొరవ ప్రశంసనీయం. ఇక జైన ఆలయాల్లో పార్శ్వనాథుడు, శాంతినాథ, ఆదినాథ ఆలయాలున్నాయి. హొయసలేశ్వర ఆలయం ఆవరణలో బాహుబలి ప్రతిరూపాన్ని కూడా చూడవచ్చు. అసలు బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం శ్రావణబెళగొళ లోని వింధ్యగిరి కొండల్లో ఉంది.మెట్లబావి కూడా ఉందిబెంగళూరు నుంచి 200 కిమీల దూరంలో ఉంది హలేబీడు. ఈ టూర్లో బేలూరులోని చెన్నకేశవాలయాన్ని కూడా కవర్ చేయవచ్చు. హలేబీడుకు కిలోమీటరు దూరంలో హులికెరె అనే గ్రామంలో స్టెప్‌వెల్ ఉంది. రాణీకీవావ్, అదాలజ్ వావ్ వంటి గొప్ప స్టెప్వెల్స్కి గుజరాత్ ప్రసిద్ధి. ఢిల్లీలో కూడా అగ్రసేన్ కీ బావోలీ ఉంది. ఐదేళ్ల కిందట తెలంగాణ జిల్లాల్లో కూడా స్టెప్‌వెల్‌లు బయటపడ్డాయి. కర్నాటకలో మెట్లబావుల సంస్కృతి తక్కువే. కానీ చూడాల్సిన ప్రదేశం. నిర్మాణ శైలిలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికీ ఉన్న తేడాలను అర్థం చేసుకోవాలంటే చూసి తీరాలి. టూర్ ఆపరేటర్లను ముందుగా అడిగి ఇవన్నీ కవర్ చేసేలా మాట్లాడుకోవాలి. ఆభరణాల నందిటెంపుల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మ్యూజియంలో 15 వందలకు పైగా శిల్పాలు, ఇతర కళా రూపాలున్నాయి. నంది విగ్రహం ధరించిన ఆభరణాలను నిశితంగా పరిశీలించడానికి కనీసం పది నిమిషాల సమయం పడుతుంది. సాధారణంగా శివాలయాల్లో శిల్ప సౌందర్యానికి అద్దం పట్టేది నంది విగ్రహమే. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, తెలంగాణలోని రామప్ప ఆలయాల్లో కూడా నంది విగ్రహాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత గొప్పగా ఉంటాయి. శిల్పులు తమ నైపుణ్యాన్ని శివలింగాన్ని చెక్కడంలో వ్యక్తం చేయడానికి ఏమీ ఉండదు. అందుకే నంది విగ్రహం, ఆ విగ్రహానికి ఆభరణాల కోసం ఉలికి పని చెప్తారు. దాంతో ఆ శిల్పి చాతుర్యం అంతా నందిలో కనిపిస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మాణం చేయనుంది. గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనుంది.బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించనున్నారు. హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించనుంది. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచే కొత్త గేటు అందుబాటులోకి రానుంది.కాగా, తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) చేరిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు కేటాయించారు. -
నేటి ‘కరోనా శుభ్రత’ నాడే ఉంది!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ‘చేతులు శుభ్రంగా కడుక్కోవడం’ అతి ముఖ్యమైనదిగా నేడు వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లోకి రావడంతోనే కాళ్లు చేతులు కడుక్కోవడం, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లినప్పుడు కూడా అదే పద్ధతి పాటించడం దాదాపు అన్ని దేశాల్లో కొనసాగిన ప్రాచీన సంప్రదాయం. ఈ సంప్రదాయం భారత్ సహ కొన్ని దేశాల్లో నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆధునిక పోకడలు సంతరించుకున్న పట్టణ ప్రాంత భవనాలు, భవన సముదాయాల్లో ఈ సంప్రదాయం మచ్చుకైనా కనిపించదు. ప్రాచీనకాలంకన్నా ఇప్పుడు ప్రతి ఇంటికి బాత్రూమ్లు, టాయ్లెట్లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అవి ఇంటి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. పైగా అవి ఇంటి ముందు ఉండవు కనుక ఇంటి వారు కూడా బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కడుక్కోవడం కోసం ఇంటి లోపలి బాత్రూమ్ల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా లాంటి మహమ్మారులు మానవాళిపై దండయాత్ర చేసినప్పుడు బాత్రూమ్లు ఉన్నా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. (చదవండి: కరోనాతో గ్లోబల్ ట్రేడ్‌కు భారీ షాక్..) ప్రాచీన కాలంలో ఇంటివారు లేదా అతిథులు బయట నుంచి రాగానే ఇంటి ముందే కాళ్లు, చేతులు కడుక్కునేందుకు బకెట్లో లేదా గంగాళంలో నీరు నింపి పెట్టేవారు. నీళ్లు ముంచుకోవడానికి బ్యాక్టీరియాలను ఎదుర్కొనే లక్షణాలు కలిగిన రాగి చెంబును ఉంచేవారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో ఇంటి ముందు లేదా ఇంటి వసారా లేదా ప్రాంగణంలో లేదా గచ్చులో ఈ కాళ్లు, చేతులు కడుక్కునే ఏర్పాటు ఉండేది. పెద్ద పెద్ద ఇళ్లు, భవనాల్లో వసారా లేదా ప్రాంగణంలో ఈ వసతి ఉంటే చిన్న ఇళ్లలో ‘గచ్చు’ల వద్ద ఉండేవి. చతురస్రాకారంలో ఉండే గచ్చుపైన ఇంటి పైకప్పు ఓపెన్‌గా ఉంటుంది. వసారా లేదా గచ్చులోకి గాలి, వెలుతురు, ఎండ బాగా వచ్చే వెసులుబాటు ఉండడం వల్ల వైరస్ల బారిన పడే అవకాశం తక్కువగా ఉండేది. (చదవండి: భారత్ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి) బీజింగ్‌లో ప్రాంగణం లేదా గచ్చులను ‘ఉటాంగ్స్’ అని, దక్షిణాఫ్రికాలో ‘లాపా’ అని. లాటిన్లో పాశియో అని పిలుస్తారు. కొన్ని దేశాల్లో ఈ ప్రాంగణాల్లో ఔషధ మొక్కలను పెంచేవారు. ఈ ప్రాంగణాలు పిల్లలు ఆడుకోవడానికి వీలుగానే కాకుండా జబ్బు పడిన వారు ఏకాంతవాసం గడిపేందుకు ఆస్కారమూ ఉండేది. చారిత్రక కట్టడాల విషయం ఏమోగానీ ప్రార్థనా మందిరాల వద్ద కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు ప్రాంగణంలో కుళాయిలు ఉండడం నేటికి కనిపిస్తుంది. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేయడానికి ముందు పాదాలు, మోచేతుల నుంచి ముఖం వరకు కడుక్కునే మంచి సంప్రదాయం ఉంది. దీన్ని ‘వుదు’ అని అంటారు. అయితే ఒక్క హౌజ్‌లో నిల్వ చేసిన నీటిని అందరూ నేరుగా చేతులతోని తీసుకొని కడుక్కోవడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరగుతోంది. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్లు ఇలా ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. (చదవండి: కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!) -
ఆస్పత్రి భవనం... రక్షణ ఎలా!
ఇళ్లు, వ్యాపార సముదాయాలు కట్టడం వేరు... ఆస్పత్రులు కట్టడం వేరు. ఆస్పత్రి అంటే రోగి చికిత్సకు వచ్చే స్థలం. జబ్బుతో బలహీనంగా ఉన్న రోగిని బయటి క్రిమి కీటకాలు మరింత బలహీన పరచకుండా దాడి చేయకుండా నిర్మాణం సమయం నుంచే జాగ్రత్తలు తీసుకుంటారు. అవి ఎలాంటి జాగ్రత్తలో తెలుసుకునే అవగాహన కోసం... ఈ కథనం.. హాస్పిటల్ భవనాన్ని ఎంపిక చేసుకునే సమయంలోనే నిర్మాణపరం (ఆర్కిటెక్చరల్)గా అది ఎంత పటిష్టమైనదో పరిశీలిస్తారు. కొత్తగా కడుతున్న భవంతి అయితే ముందు నుంచే ఎలాంటి పగుళ్లకు ఆస్కారం లేకుండా భవన నిర్మాణపనులను సాగిస్తారు.హాస్పిటల్ భవనంలోకి ఎలాంటి జీవులూ రాకుండా చుట్టూ రీటెయినింగ్ వాల్ నిర్మిస్తారు. అది చాలా ఎత్తుగా, లోతుగా ఉందా లేదా పరిశీలిస్తారు. సెల్లార్ ఉంటే ఈ రీటెయినింగ్ వాల్ తప్పనిసరి. సాధారణ ఫ్లోరింగ్కూ, హాస్పిటల్ ఫ్లోరింగ్కూ తేడా ఉంటుంది. మామూలు భవనాల్లా కాకుండా హాస్పిటల్ ఫ్లోర్ నిర్మాణంలో కింద ఐరన్ మెష్ ఏర్పాటు చేసి, దానిపై ఆర్సీసీతో కూడిన ఫ్లోరింగ్ వేస్తారు.కిటికీలకూ, వెంటిలేటర్స్కూ చాలా సన్నటి మెష్ అమరుస్తారు. దీనివల్ల దోమలు, బొద్దింకలు వంటి క్రిమికీటకాలు భవనంలోకి ప్రవేశించలేవు. ఆర్సీసీ నిర్మాణాన్ని ఎలుకలు ధ్వంసం చేయలేవు. రూఫ్ ఎలాగూ ఆర్సీసీతో పటిష్టంగా ఉంటుంది. కాబట్టి భవనం పైకప్పు నుంచి ఎలాంటి క్రిమికీటకాలూ వచ్చేందుకు అవకాశం ఉండదు. కాని అప్పటికే నిర్మాణం జరిగిన భవనాన్ని హాస్పిటల్ కోసం ఎంపిక చేస్తే అందులో పగుళ్లను గుర్తించిన వెంటనే వాటిని ఎప్పటికప్పుడు మూసేస్తూ ఉండాలి. దీనికి కాలపరిమితి అనే నిబంధన ఉండదు. భవన నిర్మాణ నిర్వహణ సిబ్బంది (బిల్డింగ్ మెయింటెనెన్స్ సిబ్బంది) దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. డ్రయినేజీల కోసం... డ్రయినేజీల ఓపెనింగ్స్‌లో మెష్ వేస్తారు. ఎలుకల వంటివి ఏవైనా డ్రైనేజీ మార్గంలో ప్రవేశిస్తే అవి ఈ వెంట్ల దగ్గరికి రాగానే మెష్లను దాటలేక వెనుకకు మరలుతాయి. డ్రయినేజీవ్యర్థాలు ప్రవహించే ప్రతి చోటా భవనంలోకి తెరచుకునే ప్రాంతంలో మెష్ అమర్చుతారు. మరుగుదొడ్ల విషయంలో... మరుగుదొడ్ల వంటి నిర్మాణంలో ‘టీ’ట్రాప్ అనే నిర్మాణపరమైన జాగ్రత్త తీసుకుంటారు. మరుగుదొడ్లలోంచి ఏ రకమైన జీవులూ రాకుండా, దుర్వాసన రాకుండా ఇంగ్లిష్‌లో టీ ట్రాప్ అని పిలిచే ఈ టెక్నిక్‌ను వాడతారు. దీనిలో టీ అనే ఇంగ్లిష్ అక్షరంలా ఉండే పైపును ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఇంగ్లిష్ అక్షరాలు ‘యు’ ‘ఎస్’ ‘జే’ ఆకృతిలో ఉండే పైపులను ఉపయోగిస్తున్నారు. టాయిలెట్స్‌లో సాధారణంగా ఉపయోగించే ట్రాప్స్ కాబట్టి వీటిని ‘టీ’ ట్రాప్స్‌గా కూడా పేర్కొంటారు. ఇందులో సాధారణంగా ఇంగ్లిష్ అక్షరం ‘యూ’ ఆకృతిలో ఉండే పైప్‌లను ఉపయోగిస్తూ, వాటిలో ఎప్పుడూ ఆ అక్షరం ఇరువైపులా నీళ్లు ఉండేలా చూస్తారు. ఒకవేళ టాయిలెట్లలో ఉండే ఇరువైపులా నీళ్లు ఎండిపోతే మళ్లీ దుర్వాసన రావడంతోపాటు, క్రిములు కీటకాలు రావచ్చు. అందుకే, ఒకసారి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయితే నిర్వహణ సిబ్బంది టీట్రాప్లోని నీళ్లను ఎండిపోకుండా చూస్తుంటారు. నిపుణుల కోసం ఈ ఎడ్యుకేషన్ ఈ ప్రక్రియలన్నీ తెలుసుకోడానికి మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించిన అర్హులైన వారిని హాస్పిటల్స్ యాజమాన్యం నియమించి, వారి పర్యవేక్షణలోనే ఈ పారిశుద్ధ్య ప్రక్రియలు జరగాలి. పేషెంట్‌తో ఉంటున్నారా? గుర్తుంచుకోండి... ఈ విషయాలు ఆస్పత్రుల్లో చేరిన బంధువులను చూసేందుకు వెళ్లే అటెండెంట్లు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలన్నీ చికిత్స పొందుతున్న బంధువుల క్షేమం కోసమేనని గుర్తుపెట్టుకోవాలి. ఆస్పత్రుల పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు తమ వంతు సహకారం అందించాలి. బంధువుల అటెండెంట్లు ఆస్పత్రుల్లో ముఖ్యంగా పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు... చికిత్స పొందుతున్న మీ బంధువులను చూసేందుకు ఆస్పత్రులు అనుమతించే విజిటింగ్ అవర్స్‌లోనే వెళ్లండి. ఒకసారి ఒకరి కంటే ఎక్కువమంది వెళ్లడం మంచిది కాదు. విజిటింగ్ అవర్స్ ముగిసిన తర్వాత రోగి పక్కనే ఉంటామంటూ పట్టుబట్టడం కూడా మంచిది కాదు.ఆస్పత్రి పరిసరాల్లో, పేషెంట్ బెడ్ దగ్గర తినడం, తాగడం, పొగతాగడం, పాన్ నమలడం, తినగా మిగిలిన పదార్థాలను, పండ్ల తొక్కలను, ఆహార పదార్థాల ప్యాకెట్లతో వచ్చే ర్యాపర్లను అక్కడికక్కడే పడేయడం వంటి పనులు చేయవద్దు. ఆస్పత్రి ప్రాంగణంలో లేదా పేషెంట్ బెడ్ సమీపంలో ఏర్పాటు చేసిన చెత్తబుట్టల్లోనే చెత్త వేయాలి. అలా కాకుండా రోగుల గదుల్లో, వరండాలో, ఆవరణలో చెత్తాచెదారాన్ని ఎక్కడికక్కడే పడేయరాదు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉండే బోర్‌వెల్స్ లేదా మంచినీటి పైపుల దగ్గర ఎంగిలి పళ్లాలు, గిన్నెలు కడగరాదు. ఆస్పత్రి పరిసరాలను నిర్లక్ష్యంగా చెత్తాచెదారంతో నింపేస్తే, పరిసరాలు కాలుష్యంతో నిండిపోతాయి. ఫలితంగా ఆస్పత్రిలోని రోగులు ఈగలు, దోమలు, నల్లులు, బొద్దింకలు, ఎలుకలు వంటి వాటితో నానా ఇబ్బందులు పడే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. శస్త్రచికిత్సలు జరిగిన సందర్భాల్లో లేదా పేషెంట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (ఐసీయూ) చికిత్స పొందుతున్నప్పుడు ఎవరినీ అనుమతించరు. అలాంటి సందర్భాల్లో రోగులను చూసేందుకు వెళ్లే అటెండెంట్స్ వైద్యుల ఆంక్షలను సానుకూలంగా అర్థం చేసుకోవాలి.రోగుల మేలు కోరి వైద్యులు చెప్పే సూచనలను తప్పకుండా పాటించాలి. అలా కాకుండా, రోగి వద్ద ఎక్కువ మంది గుమిగూడితే, రోగికి కొత్త ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ఎంట్రీ రూట్... కీటకాలూ స్టాప్! భవనాల్లోకి క్రిమి కీటకాలు, ఎలుకల వంటి జీవులు ప్రవేశించకుండా ఉండాలంటే ముందుగా అవి లోపలకు రావడానికి అనువైన మార్గాల్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బొద్దింకలు, ఎలుకలు వంటివి సాధారణంగా డ్రైనేజీ పైపుల ద్వారా, ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ ద్వారా భవనాల్లోకి ప్రవేశిస్తాయి. ఆస్పత్రి భవనాలేమీ వాటికి మినహాయింపు కాదు. సరిహద్దుల వద్ద పటిష్టమైన కాపలా పెడితే శత్రువుల దాడిని ఎలా నిరోధించవచ్చో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలుకలు, బొద్దింకలు వంటి వాటిని కూడా సమర్థంగా నిరోధించవచ్చు. ఇవి చాలా తేలికపాటి జాగ్రత్తలు. వీటి వల్ల వ్యాపించే రోగాలకు చికిత్స కోసం అయ్యే ఖర్చుతో పోలిస్తే, వీటి నిరోధానికయ్యే ఖర్చు చాలా తక్కువ. కీటకాలు, ఎలుకలు చొరబడకుండా తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని... భవనం అంతటికీ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ ద్వారా కీటకాలు, ఎలుకలు చేరకుండా చూసుకోవాలి. నిర్ణీత వ్యవధిలో వాటిపై స్ప్రే చేయడం, వాటి చుట్టూ పటిష్టమైన గ్రిల్, మెష్ వంటివి అమర్చడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్పై దుమ్ముధూళి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. నిర్ణీత వ్యవధిలో ఏసీని ఆఫ్ చేసి, డక్ట్స్పై పేరుకున్న దుమ్ముధూళిని సబ్బునీటిలో ముంచిన తడిగుడ్డతో తుడిచేయాలి. ఎలాంటి అడ్డంకులు ఉన్నా కొరికి పారేసి, దారి చేసుకుని లోపలకు దూసుకుపోయే ఎలుకలను అరికట్టేందుకు అక్కడక్కడా ట్రాప్స్ అమర్చుకోవాలి. భవనాల్లోకి చొరబడటానికి ఇవి సాధారణంగా డ్రైనేజీ పైపులైన్లనే సురక్షిత మార్గాలుగా ఎంచుకుంటాయి. నేలకు దిగువగా ఉండే ఈ మార్గాల్లో ఇవి కలుగులు కూడా ఏర్పాటు చేసుకోగలవు. ఇవి చొరబడకుండా ఉండాలంటే, డ్రైనేజీ పైపులైన్లకు మెటల్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. అలాగే సెప్టిక్ ట్యాంకు మూతలపై ఎలాంటి రంధ్రాలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చోట్ల వాడని మరుగు దొడ్లు ఉంటే వాటిలో నీళ్లు ఇంకిపోయి ఎలుకలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటి వాడని మరుగుదొడ్ల కమోడ్‌పై ఏదైనా కప్పి వాటిపై ఇటుకలు వంటి బరువును ఉంచాలి. ఎలుకలు పైకి ఎగబాకి చొరబడకుండా, అవి తేలికగా పెకైక్కే మార్గాల్లో మెకానికల్ గార్డ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఎలుకల కదలికలను ఎలా గుర్తించొచ్చు? విసర్జకాలు.. ఎలుకల స్వైరవిహారానికి ముఖ్యమైన సూచన వాటి విసర్జకాలు. వంట గదుల్లోని షెల్ఫుల్లో, కబోర్డ్స్‌లో, గ్యాస్ గట్టు కిందున్న అరల్లో, అల్మారాల్లో ఎలుకల విసర్జకాలు కనిపిస్తున్నాయంటే సమస్య తీవ్రంగా ఉన్నట్లు లెక్క. ఎలుకల జాడలు.. ఎలుకలు సంచరిస్తున్న జాడల్ని పసిగట్టడం కాస్త కష్టమే. మట్టి, దుమ్ము, ధూళి వంటివాటిల్లో మాత్రమే వాటి జాడల్ని అంటే ఎలుకల అడుగులు, తోకల గుర్తులను పసిగట్టొచ్చు. కాబట్టి భవనాల్లో కంతలు, కలుగుల దగ్గరా లేదంటే ఎలుకలు సంచరించొచ్చు అన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో టాల్కమ్ పౌడర్ని కాని చాక్‌పీస్ పొడిని కాని చల్లి వాటి కదలికలను పట్టుకోవచ్చు. పంటి చప్పుళ్లు.. ఎలుకల ముందు పళ్లు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి. వాటిని అరగదీయడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటాయి. ఎలక్ట్రిక్ వైర్లను కొరకడం, పైకప్పుకి రంధ్రాలు చేయడం, వాటర్ హీటర్స్‌ను, డక్ట్‌లో అమర్చిన హీటర్లను, ఏసీల్లోని వైర్లను, కప్బోర్డ్స్ని కొరుకుతూ ఉండటానికి కారణం అదే. ఎలుకలు కొరుకుతున్నప్పుడు కటకటమని చిత్రమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దంతోనూ, పాడైపోయిన వైర్లు, పెచ్చులూడి చిన్నచిన్న రంధ్రాలు పడ్డ గోడల ఆనవాళ్లతోనూ ఎలుకల కదలికలను పట్టుకోవచ్చు. భవనం ఆవరణలో గుంతలు, కన్నాలు, కలుగులు ఉన్నాయంటే ఎలుకలు ఉన్నట్లే. మార్గాలు... సాధారణంగా ఎలుకలు ఏ దారి గుండా వచ్చాయో అదే దారి గుండా మళ్లీ వెళ్తాయి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఆ దానికి విస్తరింపచేస్తాయి. పరిసరాల్లో ఇలాంటి పొడవైన సొరంగాలుంటే ఎలుకలు పక్క బిల్డింగ్కీ దారి వేసుకున్నట్లేనని గుర్తించాలి. చమురు గుర్తులు.. ఎలుకలు బయటకు వచ్చే కలుగులు, కంతలన్నీ జిడ్డుజిడ్డుగా ఉంటాయి. వాటి మూత్ర విసర్జనతో ఒకరకమైన దుర్వాసన వస్తుంటుంది. ముఖ్యంగా గాలి, వెలుతురు అంతగా లేని గదుల్లో ముక్కుపుటాలదిరే వాసన వేస్తుంది. మిగిలిపోయిన ఆహారపదార్థాలు.. మామూలుగా అయితే ఎలుకలు ఎత్తుకుపోయిన ఆహారన్నంతా తింటాయి. కాని కొన్ని మాత్రం తిన్నంత తినగా మిగిలినవి వదిలేస్తాయి. అలా కంతలు, కన్నాలు, కలుగుల దగ్గర మిగిలిపోయిన ఆహారపదార్థాలు కనిపించాయంటే మాత్రం అది కచ్చితంగా ఎలుకల స్థావరమే. పగలు కూడా.. సహజంగా ఎలుకలు రాత్రిపూటే తిరుగుతుంటాయి. పగటి పూటా కనిపించాయంటే భవనంలో వాటి సంఖ్య ఎక్కువన్నమాట. ఎలుక.. నిజాలు ప్రపంచంలోని చాలా అగ్నిప్రమాదాలకు కారణం ఎలుకలే. అవి కొరికిన వైర్ల ద్వారా షార్ట్‌సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎలుకలకు తిండియావ ఎక్కువ. ఎంత తింటాయో అంతకంటే ఎక్కువ వ్యాధులను ప్రబలింపచేస్తాయి. వాటి విసర్జకాలు, వెంట్రుకలు,... చివరకు వాటి వాసనతోనూ వ్యాధులు వస్తాయి. ప్రతి యేడూ ప్రపంచంలోని 20 శాతం ఆహారం ఎలుకల పాలే అవుతోందట. అవి కొరికి పాడు చేసే పుస్తకాలు, భవనాల ఇంటీరియర్, ఫర్నీచర్కెతే లెక్కేలేదు. ఎలుకల నివారణ భవనాల్లోని కలుగులు, కంతలు, కన్నాల దగ్గర బోన్లు, ఎరలను పెట్టి ఎలుకలను పడ్తారు.మామూలు బోన్లు, మెష్‌లు పనిచేయని చోట ప్రత్యేకంగా తయారు చేసిన బోన్లను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ట్రాకింగ్ పౌడర్స్ అనే పొడినీ ఉపయోగించి ఎలుకలను పట్టుకుంటారు. వాటికి ఆహారం, నీరు దొరకుండా చేసి కూడా ఎలుకలను తరిమి కొట్టొచ్చు. డ్రైనేజ్ హోల్స్, గుంతలు, కన్నాలు ఉన్నచోట మెష్‌ను అమర్చి కూడా ఎలుకలు చొరబడకుండా చేయొచ్చు. హాస్పిటల్ నిర్వహణ ఖర్చులు హాస్పిటల్స్ పరిశుభ్రత చాలా ప్రధానమైన అంశం. హాస్పిటల్స్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉద్దేశించిన బృందం ఆధ్వర్యంలో ఇది నిరంతరం జరుగుతుంది. ఫలితంగా ఎన్నో జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుంది. హాస్పిటల్స్ అమలు చేయాల్సిన కొన్ని కార్యకలాపాలు... రోగి రక్షణ కోసం తీసుకునే చర్యలు రోగులను సురక్షితంగా ఉండేందుకు మాస్క్‌లు, గ్లౌవ్స్, ఆప్రాన్స్, దుప్పట్లు వంటి వాటిని ఎప్పుడూ సురక్షితంగా ఉంచాలి. రోగులకు ఉపయోగించిన కొన్ని ఇంజెక్షన్లు, కాథెటర్లు, కొన్ని సర్జికల్ ఎక్విప్మెంట్ పరికరాలు మళ్లీ ఉపయోగించకుండా డిస్పోజ్ చేయాలి. డాక్టర్ల కోసం లిక్విడ్ సబ్బులు, హ్యాండ్ డ్రయర్లు, పేపర్ తువ్వాళ్లు అమర్చాలి. ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్‌లు అమర్చాలి.పాదాల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల కోసం షూ కవర్స్ తొడగాలి. రోగులను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడం కోసం క్లోరోహెక్సిడిన్ వంటి రసాయనాలను చల్లాలి. లాండ్రీ అనేక రకాల దుస్తులు, పరుపులు, దుప్పట్ల పరిశుధ్యం కోసం లాండ్రీ నిర్వహణ సమర్థంగా ఉండాలి. ఇమ్యూనైజేషన్ హాస్పిటల్లో పనిచేసే ప్రతి డాక్టర్ని, ఇతర సిబ్బందిని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి టీకాలు వేసి ఇమ్యూనైజ్ చేయాలి. (ఉదాహరణకు హెచ్1ఎన్2, టైఫాయిడ్). కిచెన్ సిబ్బందికి మరింత కూలంకషమైన పరీక్షలు అవసరం. జీవ వ్యర్థాల నిర్వహణ (బయో వేస్ట్ మేనేజ్మెంట్ ఆసుపత్రిలోని జీవ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేకమైన ప్రాంతాలు, ట్రాలీల వంటి ఏర్పాట్లు అవసరం. కొన్ని ఉపకరణాల శుభ్రత ఎండోస్కోప్, బ్రాంకోస్కోప్, క్యాథెటర్ల వంటి వాటిని పరిశుభ్రం చేయడం కోసం సిడెక్స్ ఏపీఏ వంటి రసాయనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా... ఏవైనా ప్రకృతి విపత్తులు, ఆకస్మికంగా వ్యాధుల వ్యాప్తి (ఎపిడెమిక్స్) వచ్చినప్పుడు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయాల్లో అవసరమైన పడకలను పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దీనికి తగినట్లే సిబ్బందినీ వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో అవసరమైన మందులను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంచుకోవాలి. మందుల కొరత అనే పరిస్థితిని ఎప్పుడూ రాకుండా చూసుకోవాలి. ఫైర్‌ఫైటింగ్... చిన్నపాటి పొగ వెలువడ్డా కనిపెట్టే స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ బ్లాంకెట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వంటి నిప్పును ఆర్పే పనిముట్లను సంసిద్ధంగా ఉంచాలి. వాటిని ఎప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా చూడాలి. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటివి నిత్యం అందేలా చూసుకోవాలి. ఎలుకలు విద్యుత్ తీగలనూ, వైర్లనూ, కంప్యూటర్‌కు సంబంధించిన ఉపకరణాలను ధ్వంసం చేయకుండా చూడాలి.ఏసీలు అమర్చే ప్రదేశాలు, ఆక్సిజన్ ఉంచే ప్రాంతాలు, ఏసీ ప్లాంట్లు, విద్యుత్ సబ్స్టేషన్లు వంటి చోట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉండాలి. ఈ అన్ని విషయాలపై ఆసుపత్రి సిబ్బందికి నిత్యం అవగాహన కల్పిస్తుండాలి. దీంతో పాటు హాస్పిటల్లో రేడియో ధార్మిక పదార్థాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణలో ఉంచాలి. - డాక్టర్ హరిప్రసాద్, సీఈవో, అపోలో హాస్పిటల్స్ సెక్యూరిటీ సిబ్బంది సాధారణ ఆవాస భవనాల లాగానే హాస్పిటల్ భవనాల నిర్మాణం కూడా ఉంటుంది. సాధారణ ఆవాసాలలో కంటే హాస్పిటల్స్‌లో రద్దీ ఎక్కువ కాబట్టి అనుక్షణం నిఘా సిబ్బంది ద్వారా ఆహారపదార్థాలను లోపలికి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు ప్రత్యేకంగా రోగుల వెంట చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే సహాయకులను అనుమతించేందుకు ఎప్పుడూ పర్యవేక్షణ కొనసాగుతుంటుంది. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉంచేందుకు రోగుల భద్రత కోసం ఎన్నో చర్యల అవసరమవుతాయి. అవి... రోగుల బంధువుల నుంచి ఇతరులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూసేందుకు అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. రోగుల వెంట వచ్చే సిబ్బంది తెచ్చుకునే ఆహార పదార్థాలను ఆసుపత్రి ప్రాంగణంలోకి నిరోధించే కార్యకలాపాలు భద్రత సిబ్బంది చేపట్టాలి. రోగులకు ఇబ్బందులు కలగకుండా నిఘా ఏర్పాట్ల కోసం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సెక్యూరిటీ సిబ్బంది పటిష్టంగా ఉంచడం ద్వారా రోగికి అవసరమైన రక్షణ చర్యలను కల్పిస్తుండటమే గాక హాస్పిటల్ పరిసరాలను పర్యవేక్షిస్తుండాలి. ఉన్న భవనంలో ఏం చేయాలి? ఐసీయూ లేదా ఎమర్జెన్సీవార్డుల నిర్వహణ మరింత పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. అక్కడ రోజూ నాలుగు గంటల నుంచి ఆరుగంటలకొకసారి శుభ్రం చేయాలి. సాధారణ వెయిటింగ్ వార్డులలో రోజుకు కనీసం మూడు సార్లు శుభ్రం చేయాలి.శుభ్రం చేసే ప్రక్రియలలోనూ చాలా రకాలు ఉన్నాయి. దుమ్మును శుభ్రం చేసే ప్రక్రియలను డస్ట్ క్లీనింగ్ అంటారు. గదులు కడగడాన్ని వాషింగ్ అంటారు. తడిబట్ట వేసి తుడిచే ప్రక్రియను మాపింగ్ అంటారు. ఫ్లోర్ క్లీనింగ్, వాల్ క్లీనింగ్, విండో క్లీనింగ్... ఇవన్నీ వేర్వేరుగా జరుగుతుంటాయి. కిచెన్, భోజనశాల వంటి ప్రదేశాలకు ప్రత్యేక నిర్వహణ ఉంటుంది. అక్కడికి వ్యర్థ ఆహార పదార్థాల కోసం వచ్చే బొద్దింకలు, ఎలుకలు ఎక్కువ. అందుకే వాటి నిర్వహణ విషయంలో ఎప్పటికప్పుడు అక్కడ ఎలుకలను నిర్మూలించే ట్రాప్స్, కీటకాల కోసం రిపెల్లంట్స్ ఉపయోగించాలి. హాస్పిటల్‌లోని చాలా గదులను సాధారణ ఫినైల్‌తోనే శుభ్రం చేస్తారు. అయితే ఈ ఫినైల్ మోతాదులోనూ మార్పు ఉంటుంది. సాధారణంగా హాస్పిటల్స్‌లో ఉపయోగించే ఫినైల్ అందరూ ఊహించినట్లుగా చాలా శక్తిమంతంగా ఉండదు. రోగుల వ్యాధి నిరోధకశక్తి తక్కువ కాబట్టి తక్కువ శక్తిమంతమైన క్లీనింగ్ మెటీరియల్‌ను హాస్పిటల్స్‌లో ఉపయోగిస్తుంటారు. ఈ జాగ్రత్త పాటిస్తూనే శుభ్రతను గమనించుకోవాలి. తగినంత మంది సిబ్బంది ఉండాలి హాస్పిటల్స్‌లో పారిశుధ్ధ్యం కోసం దాదాపు వంద పడకలకు నెలకు ఎంతవుతుందో చూసుకుని బడ్జెట్ కేటాయించుకోవాలి. వంద పడకలకు అన్ని షిఫ్ట్లనూ కలుపుకొని కనీసం 50 మంది సిబ్బంది పనిచేయాలి. ఆపరేషన్ థియేటర్స్, ఎమర్జన్సీలలో ప్రతిరోజూ ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. థియేటర్స్‌లో క్రిములను నాశనం చేసే ఫార్ములిన్ వంటి రసాయనాలను చల్లాల్సి ఉంటుంది. ఇక వార్డులు, పరీక్ష ప్రదేశాలు వంటి మిగతా ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా శుభ్రపరచాల్సిన అవసరం ఉంటుంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఎండీ, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ అందుబాటులో ర్యాట్ ప్యాడ్స్... కాక్రోచ్ జెల్స్... ఒక హాస్పిటల్లో మనం పారిశుద్ధ్యం కోసం వెచ్చించే మొత్తం మన నివారించే జబ్బుల వల్ల కలిగే ఆర్థిక భారంతో పోలిస్తే చాలా తక్కువ. పైగా అది పెద్ద ఖర్చు కూడా కాదు. హాస్పిటల్స్‌ను నిత్యం పరిశుభ్రం చేయడం కోసం ఇప్పుడు ర్యాట్ప్యాడ్స్, కాక్రోచ్ జెల్స్ వంటి ఆధునికమైన అనేక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి పారిశుద్ధ్యం కోసం పెట్టే ఖర్చు, పెద్దగా ఖర్చు అనిపించుకోదు. - డాక్టర్ చిగురుపాటి మోహనవంశీ, ఒమెగా హాస్పిటల్స్ షుగర్ రోగుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం! ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిక్ పేషెంట్స్‌కు స్పర్శ తగ్గుతుంది. కాబట్టి వారిని ఏదైనా కీటకం కరిచినా లేదా ఎలుకలు కొరికినా వెంటనే స్పర్శ తెలియదు. తర్వాతి దశల్లో అది చాలా పెద్ద సమస్యగా, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. హాస్పిటల్స్‌లో పారిశుద్ధ్య చర్యలు పాటించడం చాలా అవసరం. దాని కోసం చేసే ఖర్చు పెద్ద వ్యయమూ అనిపించుకోదు. - డాక్టర్ అనూరాధరెడ్డి, చైర్పర్సన్, డయాబెటిక్ ఫౌండేషన్, హైదరాబాద్ సహాయకుల బాధ్యతా ఉంటుంది... హాస్పిటల్లో చేరేవారు తమ ఇంటిలాగే దాన్నీ శుభ్రంగా ఉంచాలి. హాస్పిటల్స్ యాజమాన్యాలు తమ వంతుగా చేసే పారిశుద్ధ్య యత్నాలకు రోగుల అటెండెంట్స్ కూడా సహకరిస్తూ ఉండేలా వారిలో పరిశుభ్రత పట్ల అవగాహన పెంపొందాలి. అప్పుడే పారిశుధ్య ప్రయత్నాలు సంపూర్ణమవుతాయి. - డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, ఎండీ అండ్ సీఈవో కిమ్స్ హాస్పిటల్స్...