breaking news
appilepalli
-
డెంగీ లక్షణాలతో ఒకరు మృతి
కుందుర్పి: అప్పిలేపల్లికి చెందిన చాకలి రమేష్ (40) డెంగీ లక్షణాలతో మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. దినసరి కూలీ అయిన రమేష్ రెండు వారాల కిందట కర్ణాటకలోని చిత్రదుర్గం వెళ్లి డెంగీ బారిన పడ్డాడు. పది రోజులపాటు చికిత్సలు చేయించుకున్నా కోలుకోలేకపోయాడు. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందినట్లు రమేష్ తమ్ముడు మరిస్వామి తెలిపాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి
కుందుర్పి: అప్పిలేపల్లికి చెందిన రుద్రముని (44) ఆదివారం డెంగీ లక్షణాలతో మృతిచెందినట్లు భార్య లీలావతి తెలిపారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రుద్రమునికి కళ్యాణదుర్గం, అనంతపురం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో కర్ణాటకలోని బళ్లారి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. డెంగీ లక్షణాలతోనే ప్రాణాలు కోల్పోయినట్లు భార్య లీలావతి రోదించింది. ఇదిలా ఉండగా.. గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండి, దోమలు పెరిగిపోవడంతో జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలు తెలిపారు. రుద్రముని మృతిచెందిన తర్వాత వైద్యసిబ్బంది అప్రమత్తమై గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు.