Anthapuram
-
ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు: సాకే శైలజానాథ్
సాక్షి, అనంతపురం: ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది కచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇంకా ఏమన్నారంటే..రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణా నది ముంపు ప్రమాదం ఉంది. నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు రూ.1100 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఆ 5 లిప్టు స్కీమ్‌లు చేపట్టకపోతే, అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించాయి. ఇంకా దేశంలో జాతీయ రహదారులను కిలోమీటరుకు రూ.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తుంటే, రాజధాని అమరావతిలో మాత్రం కిలోమీటర్ రోడ్డుకు ఏకంగా రూ.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పైగా ఆ పనుల కాంట్రాక్టులన్నీ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో తమ వారికే కట్టబెడుతున్నాడు. మరోవైపు ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెడుతున్నారు.ఏడేళ్ల కిందట అమరావతిలో ఐకానిక్ టవర్లు, ఆకాశహర్మ్యాలు, సీ ప్లేన్, నది మీద హ్యాంగింగ్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్‌తో ప్రచారం చేసి ఊదరగొట్టారు. ఐదేళ్లు గడిచాక చూస్తే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ తప్ప వేరే నిర్మాణాలు కనిపించలేదు. అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాల భూమిని బీడు పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు.ఒక పక్క బస్టాండ్ కట్టడానికే నిధులు లేవని చెప్పే చంద్రబాబు, విజయవాడలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెట్టుకుని మళ్లీ అమరాతిలో విమానాశ్రయం కడతామని డాబు మాటలు చెబుతున్నాడు. 11 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఇదిచాలదన్నట్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నిధులు డ్రా చేసుకునే హక్కును ప్రైవేటు సంస్థలకు అప్పగించారు.కమీషన్ల కోసం, తమ వారి జేబులు నింపేందుకు అమరావతి అంచనా వ్యయాన్ని ఏకంగారూ. 44 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారు. కమీషన్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నాడు వైయస్ జగన్ తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను చంద్రబాబు రద్దు చేశారు. కొత్తగా మొబిలైజేషన్ విధానం తీసుకొచ్చి, కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ కిందకు 10 శాతం నిధులు ఇచ్చి, అందులో నుంచి 8 శాతం కమిషన్ల కింద వసూలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెడుతూ, అప్పులన్నీ చేసి మొత్తం అమరావతిలోనే ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని సాకే శైలజానాథ్ నిలదీశారు. -
ప్రేమ పేరుతో ఎస్ఐ వంచన
అనంతపురం : ఎస్ఐ చేతిలో వంచనకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ...పామిడి మండలం గురుమాంజనేయ (జీఏ) కొట్టాలకు చెందిన రమావత్ విజయ్‌కుమార్‌నాయక్ తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈయన అనంతపురానికి చెందిన భారతిని ప్రేమించాడు. అయితే పెళ్లికి ససేమిరా అనడంతో ఆమె “దిశ’ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తొమ్మిది నెలల క్రితం పెళ్లితో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది. అయితే విజయ్‌కుమార్ తన స్వగ్రామానికి చెందిన తిరుపాల్‌నాయక్ కుమార్తె సరస్వతితోనూ ప్రేమాయణం నెరిపాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండు రోజుల క్రితం సరస్వతి జీఏ కొట్టాలలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. సరస్వతి తండ్రి తిరుపాల్‌నాయక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయకుమార్‌పై పామిడి సీఐ ఎం.ఈరన్న కేసు నమోదు చేశారు. విజయ్‌కుమార్ ఎస్ఐ కాక ముందు గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఓ మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో వంచించినట్లు సమాచారం. -
‘రాశి’ని వెంటాడుతున్న భయం.. ఎందుకో తెలియాలంటే..?
Raashi Khanna’s Antahpuram Gearing Up For Release: అదొక అందమైన అంతఃపురం. అందులో ఓ అందాల రాశి. అయితే ఆ అందాల రాశిని ఓ భయంవెంటాడుతుంటుంది. ఎందుకా భయం? ఆ భయానికి కారణం ఎవరు? అనేది తెలియాలంటే ‘అంతఃపురం’ చూడాల్సిందే. ఈ నెల 31న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా ఆర్య సరసన నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 3’. సుందర్ .సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియా మరో కథానాయిక. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంతఃపురం’ పేరుతో గంగ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. సుందర్ మాట్లాడుతూ – ‘‘అరణ్మణై’ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో ‘చంద్రకళ’, ‘కళావతి’గా విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. మూడో చిత్రం ‘అంతఃపురం’ కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి’’ అన్నారు. చదవండి: నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం.. రామ్-చరణ్ బాండ్.. ఇద్దరూ ఇద్దరే! -
నగ కొట్టేసి.. పర్సు చేజార్చి.. చివరికి ఎగతాళి..
అనంతపురం క్రైం: మహిళ మెడలోని తాళి కొట్టేసిన ఓ దొంగ చివరకు అందరి ముందు ఎగతాళి అయ్యాడు. వివరాలు... అనంతపురం నగరంలోని నీరుగంటి వీధిలో గురువారం ఉదయం గౌతమి అనే మహిళ తన ఇంటి ఎదుట శుభ్రం చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అపరిచిత వ్యక్తి పలకరించాడు. మాటల్లో ఆమె దృష్టిని మళ్లించి మెడలోని బంగారు మాంగల్యం చైన్‌ను లాక్కొని ఉడాయించాడు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి హడావుడిలో అపరిచిత వ్యక్తి జేబులో నుంచి పర్స్ కిందపడిపోయింది. అప్పటికే మహిళ కేకలు విన్న జనం అటుగా వస్తుండడం గమనించిన దొంగ అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై శరవేగంగా దూసుకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత దొంగలించిన నగ గిల్టుదని గ్రహించిన అతను.. దానిని తిరిగి మహిళకు అప్పగించి తన పర్స్ తీసుకెళ్లేందుకు వచ్చాడు. అప్పటికే పోగైన జనం.. దొంగను గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. విచారణలో వేణుగోపాలనగర్‌కు చెందిన వెంకటేశ్వరరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతడిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
‘హద్దు’మీరిన కిక్కు
ఇది అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామం కొత్తూరు గేటు వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణం. ఈ షాపు కర్ణాటక భూభాగంలో ఉండగా.. మద్యం మాత్రం ఆంధ్రాలో పారుతోంది. ఆంధ్ర సరిహద్దుకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఈ దుకాణానికి వచ్చే కర్ణాటక మద్యం.. రోజూ రాత్రి వేళల్లో సరిహద్దు దాటి మన జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి చేరుతోంది. మద్యం, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఇక్కడ ‘సెబ్’ చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా.. ఈ షాపు నుంచి సరిహద్దు దాటుతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. ఈ అక్రమ మద్యం దందాలో ‘సెబ్’ అధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయదుర్గం: మద్యపాన నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండగా.. కర్ణాటక సరుకు మాత్రం అనంతపురం జిల్లాను ముంచెత్తుతోంది. కట్టడి చేయాల్సిన కొందరు అధికారులే కాసులు తీసుకుని కళ్లుమూసుకుంటుండగా కర్ణాటక మద్యం ఆంధ్రాలోకి అక్రమంగా వచ్చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న రాయదుర్గం నియోజకవర్గం నుంచే కర్ణాటక మద్యం భారీగా జిల్లాలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రతో పోలిస్తే కర్ణాటకలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ క్రమంలోనే అక్రమంగా ఆంధ్రలోకి ప్రవేశిస్తున్న కర్ణాటక మద్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం శాండ్ అండ్ లిక్కర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. గుమ్మఘట్ట మండలంలో 2, రాయదుర్గం మండలంలో 2, డి.హీరేహాళ్ మండలంలో 9, బొమ్మనహాళ్ మండలంలో 4 చొప్పున మొత్తం 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. అయినా అక్రమార్కులు అడ్డదారుల్లో కర్ణాటక మద్యాన్ని జిల్లాకు చేరవేస్తున్నారు. కర్ణాటక పరిధిలో షాపులు.. ఆంధ్ర రోడ్డులో సరాఫరా ఆంధ్రాకు సరిహద్దున ఉన్న కర్ణాటక భూభాగంలో షాపులు ఏర్పాటు చేస్తున్న కొందరు వ్యాపారులు.. సరుకును ఆంధ్రా మద్యం మాఫియాకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలా అక్రమంగా కర్ణాటక మద్యం కొనుగోలు చేస్తున్న వారు...సరిహద్దు దాటించి ఆంధ్రాలోకి చేర్చి జోరుగా మద్యం వ్యాపారం సాగిస్తున్నారు. అయితే సరిహద్దులో ఉన్న మద్యం షాపులకు కర్ణాటక నుంచి మద్యం సరాఫరా కావాలన్నా...ఆంధ్ర పరిధిలోని రోడ్లపైనే వెళ్లాల్సి ఉన్నా.. ‘సెబ్’ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం పలు విమర్శలు తావిస్తోంది. చెక్‌పోస్టుల్లోనూ వసూళ్లు అక్రమ మద్యం రవాణా అడ్డుకట్ట వేయాల్సిన చెక్‌పోస్టుల్లోని కొందరు ఎస్పీఓలు మామూళ్లకు అలవాటు పడ్డారు. అక్రమ మద్యం వ్యాపారులతో మామూళ్లు తీసుకుని మద్యం వాహనాలను వదిలేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా తాగేందుకు ఒకటి, రెండు బాటిళ్లు తెచ్చుకుంటే వారిని పట్టుకుని కేసులు నమోదు చేయడం, లేకపోతే వారిని భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేయడం, పట్టుకున్న మద్యాన్ని తిరిగి షాపుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం అక్రమ రవాణా బాటలో యువత కర్ణాటక మద్యం విక్రయం ద్వారా ఎక్కువ లాభాలు వస్తుండడంతో సరిహద్దు గ్రామాల్లోని యువకులు మద్యం మాఫియాగా తయారవుతున్నారు. ఒక్కో గ్రామంలో 10 మంది దాకా యువకులు కర్ణాటక మద్యం అక్రమంగా తీసుకువచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. 96 పాకెట్లు ఉన్న ఒక కేస్ అమ్మితే రూ. 5 వేల నుంచి రూ.7 వేల వరకు లాభం వస్తుండడంతో అడ్డదారుల్లో ద్విచక్రవాహనాల్లో కర్ణాటక మద్యం తెస్తున్నారు. అయితే ఎక్సైజ్ (సెబ్) అధికారులు అన్నీ తెలిసినా మామూళ్ల మత్తులో కళ్లుమూసుకున్నారు. ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు మాత్రం అడపాదడపా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. దాడులు చేస్తూనే ఉన్నాం రాయదుర్గం ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో రోజూ దాడులు చేస్తూనే ఉన్నాం. అక్రమ మద్యంపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆంధ్రవారికి మద్యం విక్రయించవద్దని సరిహద్దులో ఉన్న మద్యం షాపులకు నోటీసులిచ్చాం. సరిహద్దులో నిఘా మరింత కట్టుదిట్టం చేస్తాం. – వై.పవన్ కుమార్ , సెబ్ అధికారి, రాయదుర్గం -
మేల్కోకపోతే ముప్పే!
అనంతపురం హాస్పిటల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల పనితీరులో ఏమ్రాతమూ మార్పు రాలేదు. ఇటీవల ఆస్పత్రిలోని ఇన్ఫెక్షన్ డీసీస్ వార్డు (ఐడీ)లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో పాటు రెండు వారాల క్రితం సూపరింటెండెంట్ చాంబర్ ముందు ఆక్సిజన్ లీకేజీ జరిగినా అధికారులు తేలిగ్గా తీసుకోవడంతో ఎఫ్ఎం వార్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు. ఇప్పటికైనా ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మేలుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తవని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. పూర్తి కాని పనులు కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో సర్వజనాస్పత్రిలో కోటి రూపాయలతో పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.36 లక్షలతో 150 పడకలకు వన్ లైన్ ఎయిర్, 30 పడలకు టూ లైన్ ఎయిర్, జూన్ 12న రూ.64 లక్షలతో 60పడకలకు మెడికల్ గ్యాస్‌లైన్ త్రీ లైన్, 400 పడకలకు వన్ లైన్ ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన సన్డాట్కామ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సంబంధించి 700 పాయింట్లలో ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇంకా 150 నుంచి 200 పాయింట్లలో పైప్‌లైన్ పనులు పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యతేదీ? ఆక్సిజన్ పైప్‌లైన్ పనుల్లో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైప్‌లైన్ పనులు జరిగే సమయంలో సంబంధిత ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు కానీ, కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితోనే వాల్స్‌కు తూతూమంత్రంగా వెల్డింగ్ పనులు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగానే రెండు చోట్ల పైప్‌లైన్ లీకేజీలు జరిగినట్లు తెలుస్తోంది. గండం గడిచింది సర్వజనాస్పత్రిలో ఈ నెల ఆరో తేదీన జరిగిన ఆక్సిజన్ పైప్‌లైన్ లీకేజీ పట్ల ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ సకాలంలో స్పందించడంతో గండం గడిచింది. ఏమాత్రం జాప్యం చేసినా వెంటిలేటర్, ఆక్సిజన్ పడకల మీదున్న రోగుల ప్రాణాలకే ఇబ్బంది కలిగేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. విచారణకు ఆదేశం ఆస్పత్రిలో వరుసగా జరుగుతున్న ఘటనలపై కలెక్టర్ గంధం చంద్రుడు విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్, ఆర్ఎంఓ, అనస్తీíÙయా హెచ్ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్‌తో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు అందుబాటులో ఉండి ఆస్పత్రిలో ఎక్కడైనా ప్రమాదకర ప్రాంతాలుంటే వాటిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో అధికారులు నివేదిక సమర్పించనున్నారు. ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ లక్ష్మీపతిరెడ్డి ఏమన్నారంటే..‘ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో లీకేజీలు జరిగిన మాట వాస్తవమే. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మరో రెండ్రోజుల్లో విధులకు హాజరై తదుపరి వాటిపై స్పష్టత ఇస్తా. పైప్‌లైన్ పనులు అసంపూర్ణం ఆస్పత్రిలో పైప్‌లైన్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. పైప్‌లైన్ వాల్స్ ఊడిపోవడం కారణంగానే లీకేజీ జరిగింది. రెండు వారాల క్రితం తన కార్యాలయం సమీపంలోనే లీకేజీ అయ్యింది. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను కోరుతాం. ఆస్పత్రిలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. – డాక్టర్ రామస్వామినాయక్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
పయ్యావుల కేశవ్ అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రదర్శించిన అత్యుత్సాహం వివాదానికి దారితీసింది. గురువారం రాత్రి హంద్రీనీవా నుంచి ఇప్పేరు చెరువుకు నీటి సరఫరాను టీడీపీ నేతలు నిలిపివేయించారు. ఇప్పేరు చెరువుకు స్వయంగా నీరు విడుదల చేసేందుకే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పయ్యావుల వైఖరికి నిరసనగా కూడేరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కూడేరుకు రాకుండానే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెనుదిరిగారు. -
సాక్షి పబ్లిక్ మేనిఫెస్టో అనంతపురం
-
అనంతపురంలో ఓ ఇంట్లో తెల్లత్రాచు కలకలం
-
అనంత జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంతపురంలో భగ్గుమన్న పాత కక్షలు
-
అనంతపురంలో కమ్ముకుంటున్న కరువు మేఘాలు
-
అనంతలో వైఎస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగుల ర్యాలీ
-
ఏపీ బంద్‌ను విజయవంతం చేస్తామంటున్న అనంత వాసులు
-
కీచక టీచర్‌కు దేహశుద్ది
-
ఏడుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
-
అనంతలో పోలీసుల ఓవరాక్షన్
-
ఆనంతలో వైయస్ఆర్ కుటుంబం
-
అనంతపురం జిల్లాలో పోలీసుల ఆరాచకత్వం
-
అనంతలో బిస్కెట్ల లోడ్ లారీ దగ్ధం
-
అనంతలో సిపిఎం నేతలపై పోలీసుల లాఠీ
-
అనంత మంజునాథ్ కమిషన్ సభలో రచ్చ
-
అనంతలో ఘనంగా చవితి వేడుకలు
-
అనంతలో మరో పరువు హత్య
-
కరెంట్ తీగ తగిలి షాక్‌తో చిన్నరి మృతి
-
ధైర్యం చెప్పి..ఆప్యాయత పంచి..
(రైతుభరోసాయాత్ర నుంచి సాక్షిప్రతినిధి):ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసానిస్తూ... గ్రామాల్లోని రైతులు.. రైతుకూలీలు, మహిళల కష్టాలు తెలుసుకుంటూ.. వారికి ధైర్యం చెబుతూ జగన్ రైతు భరోసా యాత్ర సాగుతోంది. మూడోరోజు కళ్యాణదుర్గం నుంచి మొదలైంది. ఎర్రంపల్లిగేటు, కుర్లపల్లి గేటు మీదుగా కామక్కపల్లికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు జగన్‌ను చూడగానే ఆనందంతో కాన్వాయ్ వద్దకు పరుగులు పెట్టారు. ‘జై జగన్’ నినాదాలు చేశారు. కొంతమంది జగన్‌ను చూసి ఆనందబాష్పాలు రాల్చారు. అందరినీ జగన్ ప్రేమతో పలకరించారు. ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు జగన్‌ను కలిశారు. తమకు వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చినా ధర్నాలు చేస్తున్నా పట్టించుకోలేదని జగన్ దష్టికి తీసుకొచ్చారు. వర్కర్లకు అండగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత దాసంపల్లి, ములకనూరు, కదిరిదేవరపల్లిగేటు మీదుగా తిమ్మాపురం చేరుకున్నారు. ప్రతీ గ్రామంలోనూ రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులూ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. ‘వృద్ధులు కన్పించగానే బాగున్నావా? అవ్వా! అని ఆప్యాయంగా జగన్ పలకరించారు. జగన్ ప్రేమను చూసి ముసలోళ్లు సంతోషంతో మునిగిపోయారు. ‘బాగుండాం నాయనా! నువ్వు సల్లంగా ఉండాలా? దేవుడు అంతా మంచే చేస్తాడు.’ అని ధైర్యం చెప్పారు. ప్రతీ గ్రామంలోనూ వృద్ధులు, మహిళలందరినీ ఓపిగ్గా జగన్ పలకరించారు. దారిలో తన కోసం ఇద్దరు... ముగ్గురు వృద్ధులు ఉన్నా కాన్వాయ్ ఆపి వారిని ప్రేమగా పలకరించారు. పొలాల్లో పనులు చేసుకుంటున్న కూలీలు జగన్‌ను చూడగానే రోడ్డుపైకి పరుగులు పెట్టారు. తమకు బతికేందుకు పనికూడా లేదని జగన్‌తో విలపించారు. రైతులు తమకు రుణమాఫీ కాలేదని కొందరు... అరకొరగా మాఫీ అయిందని ఇంకొందరు దారిలో జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వంపై పోరాడదామని వారికి ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు. తిమ్మాపురంలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి, ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌విన్సెంట్ ఫై, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత అక్కడి నుండి అండేపల్లికి చేరుకున్నారు. తిమ్మాపురం క్రాస్‌లో మునిసిపల్ కార్మికులు, కార్మికసంఘం నేతలు జగన్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. తర్వాత కంబదూరు చేరుకున్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంబదూరు మండల కేంద్రంలో జగన్‌ను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. కంబదూరు నుంచి కాన్వాయ్ దాటేందకు 1.30 గంటల సమయం పట్టింది. అక్కడి నుండి ఒంటారెడ్డిపల్లి చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం కర్ణాటలోని పల్లెల మీదుగా పావుగడ చేరుకున్నారు. కర్ణాటకలోని గ్రామాల ప్రజలు రాత్రి అయినా జగన్‌కోసం రోడ్డుపై వేచి ఉన్నారు. రాత్రికి వెంకటాపురం చేరుకుని బస చేశారు. -
ఇంత దౌర్భాగ్యమా..?
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : పోలీసుల వ్యవహార శైలి వల్ల ఒక ప్రజాప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే ఇంతకన్నా దౌర్భాగ్యముంటుందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి (అనంతపురం), కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం) మండిపడ్డారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నామా? లేక పోలీసుల పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు. కౌన్సెలింగ్ పేరుతో అమాయకులను చిత్రహింసలు పెడుతున్న పోలీసుల వ్యవహార శైలిని నిరసిస్తూ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేలు, గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి నివాసం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. అయితే కార్యాలయంలోకి వెళ్లకుండా తెలుగుతల్లి సర్కిల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఒకరిద్దరు మాత్రమే వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపైనే అరగంట పాటు బైఠాయించి ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో పోలీసులు అరెస్ట్ చేయాలని చూడగా నాయకులు ప్రతిఘటించారు. దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు కొందరిని మాత్రమే లోనికి పంపిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకు మునుపు గురునాథరెడ్డి మాట్లాడుతూ పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గౌరవప్రదంగా జీవిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు, రైతులను కౌన్సెలింగ్ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇష్టానుసారంగా చితకబాదుతున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని అగౌరవ పర్చేలా సీఐ భాస్కర్‌రెడ్డి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఐని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలపై మంగళవారం ఉదయమే కలెక్టర్, ఎస్పీలను కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. అయితే ఇచ్చిన రెండుగంటలకే రాయదుర్గంలో సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసులు వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ... జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమబాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, తోపదుర్తి భాస్కర్‌రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, బొమ్మలాటపల్లి సుధాకర్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, చింతకుంట మదు, వీరాంజనేయులు, రిలాక్స్‌నాగరాజు, కొర్రపాడు ఉస్సేన్పీరా, మారుతీనాయుడు, మారుతీప్రసాద్, దిలీప్‌రెడ్డి, బోయతిరుపాలు, శంకర్, రాజారెడ్డి, గువ్వల శ్రీకాంత్, శ్రీదేవి, ప్రమీలా, క్రిష్ణవేణి,లక్ష్మి, హజరాభి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అత్యుత్సాహం.. శాంతియుత ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ నేతల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నాయకులను ఎస్పీ కార్యాలయం వరకూ వెల్లనీయలేదు. అదనపు బలగాలను దింపి, రోప్‌పార్టీ బలగాలతో తెలుగుతల్లి విగ్రహం వద్ద అడ్డుకున్నారు. కనీసం మా బాధలు కూడా చెప్పకునేందుకు అవకాశం ఇవ్వరా? ఇదేమి పాలన? మనం ఎక్కడున్నాం అంటూ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లనీయకపోతే మహిళలమంతా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి హెచ్చరించారు. దీంతో పోలీసులు దిగరాక తప్పలేదు. ఎస్పీ కార్యాలయం వరకు వెళ్లేందుకు వారికి హక్కు ఉందని త్రీటౌన్ సీఐ దేవానంద్, పోవడానికి వీల్లేదంటూ వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ వాదులాడుకున్నారు. -
అనంతలో అగ్ని ప్రమాదం: ఐదుగురికి తీవ్ర గాయాలు
అనంతపురం నగరంలోని రాణి నగర్లో ఓ ఇంట్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న పెట్రోల్ టీన్కు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.