breaking news
Anmolpreet Singh
-
ఫాస్టెస్ట్ సెంచరీ.. కసిదీరా కొట్టేశాడు!
పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా అన్మోల్ప్రీత్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు.. అరుణాచల్‌ప్రదేశ్ తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ‘ఎ’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.164 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 164 పరుగులకే కుప్పకూలింది. తెచి నెరి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ వర్మ 38, ప్రిన్స్ యాదవ్ 23, దేవాన్ష్ గుప్త 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, అశ్వని కుమార్ మూడేసి వికెట్లు తీయగా.. బల్జీత్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, రఘు శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అభిషేక్ శర్మ విఫలంఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(25 బంతుల్లో 35 నాటౌట్)కు తోడైన వన్‌డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.45 బంతుల్లో 115 పరుగులుసుడిగాలి ఇన్నింగ్స్‌తో కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అన్మోల్.. మొత్తంగా 45 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో 12.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 167 పరుగులు చేసింది పంజాబ్.కసిదీరా కొట్టేశాడుతద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి టోర్నీని విజయంతో ఆరంభించింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన అన్మోల్ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ పంజాబీ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వన్డేల్లో టీ20 తరహాలో ఊచకోత కోసి తన కసినంతా ఇక్కడ ప్రదర్శించాడంటూ అభిమానులు అన్మోల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ముంబై తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్.. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అన్మోల్.. 139 పరుగులు సాధించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్A majestic counter-attacking 58-ball 💯 from Anmolpreet Singh 👏👏#SMAT | @IDFCFIRSTBank | #FinalFollow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/3sdqD7CJvj— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023 -
తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు మూడో పరాజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండర్ చామా మిలింద్ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసంగ్రూప్ ‘ఎ’లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోరులో .. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకం సాధించగా... రమణ్‌దీప్ సింగ్ (11 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), నేహల్ వధేరా (31; ఒక ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అజయ్‌దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చామా మిలింద్, రోహిత్ రాయుడు (37 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించగా... మికిల్ జైస్వాల్ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.తిలక్ వర్మ విఫలంకెప్టెన్ తిలక్ వర్మ (9), తన్మయ్ అగర్వాల్ (9), రాహుల్ బుద్ధి (5), అజయ్‌దేవ్ గౌడ్ (6), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన మిలింద్ భారీ సిక్స్‌లతో విరుచుకుపడినా... జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో నమన్ ధీర్ 5 వికెట్లు పడగొట్టాడు. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు పంజాబ్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 21; ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 1; అన్మోల్ప్రీత్ సింగ్ (సి) ప్రతీక్ రెడ్డి (బి) అజయ్‌దేవ్ గౌడ్ 60; నేహల్ వధేరా (సి) మిలింద్ (బి) నితిన్‌సాయి యాదవ్ 31; నమన్ ధీర్ (సి) రాహుల్ బుద్ధి (బి) రవితేజ 9; సానీ్వర్ సింగ్ (సి) రోహిత్ రాయుడు (బి) రవితేజ 24; రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 39; అర్ష్‌దీప్ సింగ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–115, 4–115, 5–149, 6–151. బౌలింగ్: రవితేజ 4–0–49–2; మిలింద్ 4–0–28–1; అజయ్‌దేవ్ గౌడ్ 4–0–38–2; రక్షణ్ రెడ్డి 2–0–26–0, నితిన్‌సాయి యాదవ్ 4–0–40–1; రోహిత్ రాయుడు 2–0–13–0. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) జసిందర్ సింగ్ (బి) నమన్ 9; రోహిత్ రాయుడు (సి) సాన్వీర్ సింగ్ (బి) నమన్ 56; తిలక్ వర్మ (సి) అర్ష్‌దీప్ (బి) జసిందర్ 9; మికిల్ జైస్వాల్ (సి) అన్మోల్ప్రీత్ (బి) మయాంక్ మార్కండే 39; రాహుల్ బుద్ధి (సి) అభిషేక్ శర్మ (బి) జసిందర్ 5; అజయ్‌దేవ్ గౌడ్ (సి) రమణ్‌దీప్ సింగ్ (బి) నమన్ 6; రవితేజ (ఎల్బీ) (బి) నమన్ 0; ప్రతీక్ రెడ్డి (స్టంప్డ్) ప్రభ్‌సిమ్రన్ (బి) నమన్ 4; మిలింద్ (సి) రమణ్‌దీప్ (బి) అర్ష్‌దీప్ 55; నితిన్‌సాయి యాదవ్ (రనౌట్) 0; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–57, 3–118, 4–120, 5–127, 6–127, 7–133, 8–141, 9–142, 10–189. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0; అర్‡్షదీప్ 4–0–47–1; బల్తేజ్ సింగ్ 3–0–35–0; నమన్ ధీర్ 4–0–19–5; జసిందర్ సింగ్ 4–0–44–2; మయాంక్ మార్కండే 2–0–22–1; సాన్వీర్ సింగ్ 2–0–14–0.