breaking news
Animation courses
-
స్టార్ హార్టిస్ట్
international Animation day 2025 యానిమేషన్ కంపెనీలు అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్లుగా ఉండే కాలంలో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ప్రమిత ముఖర్జీ. మన దేశంలో యానిమేషన్ రంగం విస్తరణను దగ్గరి నుంచి చూసిన ముఖర్జీ మూడు ఖండాల్లో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులను యానిమేషన్ రంగంలో తీర్చిదిద్దింది.యానిమేషన్ ఆర్టిస్ట్ కావాలనుకునే ఎంతోమంది యువతులకు నిరంతర స్ఫూర్తినిస్తోంది. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ప్రమిత ముఖర్జీకి చిన్నప్పటి నుంచి కార్టూన్లు, బొమ్మలు అంటే ఇష్టం. తనకు తోచినట్లు బొమ్మలు, కార్టూన్లు వేసేది. బొమ్మలపై ఇష్టమే ప్రమితను యానిమేషన్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత 3డీ యానిమేషన్ సర్టిఫికేషన్ కోర్సు చేసింది. ఆ రోజుల్లో...ఆ రోజుల్లో మన దేశంలో కొన్ని యానిమేషన్ స్టూడియోలు మాత్రమే ఉండేవి. అవి హాలీవుడ్ కోసం పనిచేస్తుండేవి. వాటిలో ముంబైలోని ‘క్రెస్ట్ యానిమేషన్’ ఒకటి. ఆ స్టూడియో నుంచే క్యారెక్టర్ రిగ్గింగ్ ఇంటర్న్‌గా కెరీర్ ప్రారంభించింది. ‘యానిమేషన్ ఫీల్డ్‌కు భవిష్యత్ ఉంటుందా? ఇది నీటిబుడగ కాదు కదా!’ ‘యానిమేషన్ ఫీల్డ్‌లో కెరీర్ వెదుక్కోవడం ఎంతవరకు క్షేమం?’ ‘యానిమేషన్ అనేది పురుషాధిపత్య రంగం. మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయా?’...ఇలాంటి సందేహాలు ఎన్నో ఆరోజుల్లో ఉండేవి.సందేహాలను వదిలి సత్తా చాటుతూ...కోల్‌కత్తాలోని ‘డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్’తో పాటు లండన్, లాస్ ఏంజెలెస్‌లోని ప్రసిద్ధ స్టూడియోలలో పని చేసింది ప్రమిత. ‘ఫీచర్, షార్ట్, ఎపిసోడిక్... ఏదైనా యానిమేటెడ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు, సృజనాత్మక కోణంలో నేను చేసే మొదటి పని దర్శకుడి మనసును చదవడం. బొమ్మలకు ప్రాణం పోయడం. ప్రతి డైరెక్టర్‌కు తనదైన భిన్నమైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్‌గా వారి ఆలోచనను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు క్రియేటివ్ అవుట్‌పుట్ ఇవ్వడం ముఖ్యం’ అంటుంది ప్రమిత.బాధ నుంచి బయట పడేలా...అమెరికాలో ఒక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగంలో చేరిన రోజుల్లో కొత్త దేశంలో, కొత్త ఉద్యోగ జీవితానికి అలవాటుపడడం ప్రమితకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో తండ్రి క్యాన్సర్‌తో చని పోవడంతో మానసికంగా బాగా కృంగి పోయింది. ఆ బాధ నుంచి బయట పడడానికి తనకు ఉమెన్ ఇన్ యానిమేషన్ (డబ్ల్యూఐఏ) ఎంతో ఉపయోగపడింది. లాస్ ఏంజెలెస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ యానిమేషన్ రంగంలో లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశాలకు కృషి చేస్తోంది. ఇదీ చదవండి: Yoga: ప్రశాంతమైన నిద్ర కావాలంటే.. చక్కటి ఆసనాలు‘2020లో డబ్ల్యూఐఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్‌లో చేరాను. మెరుగైన సాఫ్ట్‌స్కిల్స్, నాయకత్వ సామర్థ్యాలు, మెరుగైన మాటతీరు... మొదలైన వాటిలో ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపకరించింది. సమాజానికి నా వంతుగా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చింది’ అంటుంది ప్రమిత.మూడు ఖండాలలో...రెండు దశాబ్దాల తన కెరీర్లో మూడు ఖండాలలో, ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో, ఎన్నో స్థాయులలో, ఎన్నో ప్రాజెక్ట్‌లలో పనిచేసింది ప్రమిత. గత పది సంవత్సరాల కాలంలో విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగంలో సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని, కాలంతో పాటు నడుస్తూ, తమను తాము నిరూపించుకుంటున్నారు ప్రమితలాంటి యానిమేషన్ ఆర్టిస్ట్‌లు. మహిళల సంఖ్య పెరుగుతోంది...లింగ అసమానతను తగ్గించడానికి చేసిన అనేక ప్రయత్నాల వల్ల యానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్‌ల సంఖ్య గతంతో పోల్చితే బాగా పెరిగింది. 2007లో నా బ్యాచ్‌లో వందమంది ఉంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. యానిమేషన్ ఆర్టిస్ట్‌గా రాణించడానికి జెండర్, బ్యాక్‌గ్రౌండ్‌తో పనిలేదు. మనం చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులకు మార్గదర్శిగా నిలవడం సంతోషంగా, గర్వంగా ఉంది.యానిమేషన్లో ఆమె బహుముఖ ప్రజ్ఞయానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతోంది... అనే విషయానికి వస్తే విశ్లేషకులు ఇలా అంటున్నారు – ‘‘యానిమేషన్‌కు సంబంధించి సృజనాత్మక ప్రక్రియలో మహిళలు తమ జీవితానుభవాలను జోడిస్తున్నారు. యానిమేషన్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల పనిలో వైవిధ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. యానిమేషన్ రంగంలో మహిళలు యానిమేటర్ ఆర్టిస్ట్‌లుగా మాత్రమే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఎగ్జిక్యూటివ్‌గా కూడా తమను తాము నిరూపించుకుంటున్నారు. వారు సృష్టించే కథలు అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నాయి.’’– ప్రమిత ముఖర్జీ -
కళ్ల ముందు... కదలాడుతూ..
సాక్షి, సిద్దిపేట: చదివిన దాని కన్నా చూసింది ఎక్కువగా గుర్తుంటుంది. అంతకుమించి బాగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో 2డీ, 3డీ యానిమేషన్ దృశ్యరూప విద్యాబోధన ప్రాచుర్యంలోకి వచ్చింది. 3డీ యానిమేషన్లో కళ్ల ముందు కదలాడుతున్నట్లుగా పదో తరగతి పాఠ్యాంశాలను అందిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు సొంత ఖర్చులతో సిద్దిపేట జిల్లా సర్కారు బడుల్లోని టెన్త్ విద్యార్థులకు అందిస్తున్నారు. మళ్లీ మొదటిస్థానం కోసం.. 2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో మొదటి స్థానాన్ని తిరిగి సాధించేందుకు మరింత కృషి అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన మంత్ర లెర్నింగ్ అకాడమీ... 3డీ యానిమేటెడ్ పాఠాలు, స్టడీ మెటీరియల్ రూపొందించింది. మంత్రి హరీశ్‌రావు రూ.20లక్షలకు పైగా వెచ్చించి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించారు. జనవరి 24న సిద్దిపేటలో ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ స్టడీ మెటీరియల్‌ను హరీశ్‌రావు అందించి ప్రారంభించారు. కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పుస్తకాలను అందజేస్తున్న మంత్రి హరీశ్ రావు(ఫైల్) నాలుగు సబ్జెక్ట్‌లు.. గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం నాలుగు సబ్జెక్టుల్లో ఉన్న అన్ని పాఠ్యాంశాలు 3డీ యానిమేషన్లో అందిస్తున్నారు. ఒక్కో పాఠ్యాంశానికి ఒక్కో క్యూఆర్ కోడ్ పొందుపరిచారు. 30 సెకన్ల నుంచి 5 నిమిషాలపాటు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ ఉంటుంది. తరగతి గదుల్లో గంటల వ్యవధిలో బోధించే పాఠాన్ని ఐదు నిమిషాల్లో అర్థం చేసుకునేలా రూపొందించారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి మొబైల్ ఫోన్ల ద్వారా దృశ్య రూపంలో పాఠాలను సులువుగా అభ్యసించే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు హరీశ్ లేఖ.. ‘మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైంది. వారి భవిష్యత్‌కు పునాదులు వేసే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. టీవీలకు, వినోదాలకు దూరంగా ఉంచండి. పిల్లలు ఇంటి దగ్గర చదువుకునేలా ప్రోత్సహించండి’ .. అంటూ తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌రావు లేఖలు రాశారు. దృశ్యాలతో కళ్ల ముందు మా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్ట్‌ల సిలబస్ పూర్తయింది. ప్రస్తుతం రివిజన్ క్లాస్‌లు జరుగుతున్నాయి. స్టడీ మెటీరియల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్‌తో 3డీ యానిమేషన్ ద్వారా పాఠ్యాంశాలు వస్తున్నాయి. వాటితో ఇంకా బాగా అర్థమవుతున్నాయి. బట్టీ పట్టకుండా నేర్చుకుంటున్నాం. – అక్షయ, టెన్త్ విద్యార్థి, ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ సిద్దిపేటకు పేరు తేవాలి.. 2021–22లో పదోతరగతిలో రాష్ట్రంలో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. ఆ çస్థానాన్ని నిలబెట్టుకునేందుకు, విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ఉచితంగా డిజిటల్ పాఠాలను అందిస్తున్నాం. తల్లిదండ్రుల ఫోన్లో ఉదయం, రాత్రి వేళల్లో డిజిటల్ పాఠాలు వింటూ మెళకువలు నేర్చుకోవాలి. బాగా చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలి. – హరీశ్ రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి -
ఊహలకు జీవం పోసే.. యానిమేటర్
ఛోటా భీమ్, హనుమాన్, రామాయణ, మహాభారత్, డోరేమాన్, ష్రెక్ లాంటి యానిమేషన్ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తాయి. సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. కేవలం ఊహాలోకానికే పరిమితమైన ఈ పాత్రలు కళ్లముందు కదలాడుతాయి. ఆడుతాయి, పాడుతాయి, శత్రువులతో పోరాడుతాయి, లెక్కలేనన్ని సాహసాల్లో పాల్గొంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి. చూపరులకు విజ్ఞానం, వినోదం పంచుతాయి. కాల్పనిక పాత్రలు దృశ్యరూపంలోకి మారి, ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాయి? యానిమేటర్ల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోంది. బొమ్మను గీసి, ప్రాణం పోసి, కనుల ముంగిట సజీవంగా కదలాడేలా చేసే అపర బ్రహ్మలు యానిమేటర్లు. అప్‌కమింగ్ కెరీర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యానిమేషన్ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. వినూత్నమైన ఊహాశక్తి, సృజనాత్మకత, కనువిందైన రంగురంగుల బొమ్మలు గీసే నేర్పు ఉంటే చాలు.. యానిమేషన్ రంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు. తగిన అనుభవం సంపాదిస్తే దేశ విదేశాల్లో రూ.లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. ప్రజ్ఞావంతులైన యానిమేటర్లకు విదేశాలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఉన్నత హోదాలను కట్టబెడుతున్నాయి. హాలీవుడ్లో భారతీయ యానిమేటర్లు సత్తా చూపుతున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఎన్నో చిత్రాలు భారత యానిమేటర్ల చేతుల్లోనే రూపుదిద్దుకోవడం విశేషం. యానిమేషన్ నిపుణులకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. దీంతో మన దేశంలోని టెక్నాలజీ, ఆర్ట్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో ఎన్నో స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తున్నాయి. యానిమేషన్ రంగం ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. 90 నిమిషాల నిడివిగల చిత్రాన్ని రూపొందించేందుకు కొన్నిసార్లు వారాలు, నెలలు, సంవత్సరాలపాటు కూడా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. యానిమేటర్లకు సహనం, ఓర్పు చాలా అవసరం. సాధారణంగా యానిమేటర్లకు చిత్రలేఖనంలో మంచి పట్టు ఉండాలి. అయితే 3డీ యానిమేషన్ ఆర్ట్‌తో పెయింటింగ్‌లో పట్టులేకున్నా అద్భుతమైన యానిమేషన్ చిత్రాలను రూపొందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం యానిమేటర్ ఒక కళాకారుడు. తన ఊహాశక్తితో పాత్రలను సృష్టించి, అవి పరస్పరం సంభాషించుకొనేలా చేస్తాడు. యానిమేటర్లకు ప్రస్తుతం ఎన్నో రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఫిలిం, టెలివిజన్, వీడియో గేమ్స్, ఇంటర్నెట్ వంటి వాటిలో యానిమేషన్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. యానిమేషన్, గే మింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. అర్హతలు స్కెచ్చింగ్‌పై మంచి పట్టు, యానిమేషన్‌పై నిజమైన ఆసక్తి ఉంటే ఈ రంగంలోకి ప్రవేశించాలి. మొదట యానిమేషన్ కోర్సులో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేయాలి. వీటికి కనీస అర్హత ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) చేసి అర్హతలు పెంచుకుంటే అవకాశాలు మెరుగవుతాయి. ఐడీసీ-ముంబయిలో యానిమేషన్లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడానికి ఆర్కిటెక్చర్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఫైనార్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. కావాల్సిన స్కిల్స్ - విభిన్నమైన ఊహాశక్తి ఉండాలి. - రంగుల మేళవింపు, బొమ్మల పరిమాణంపై మంచి అవగాహన అవసరం. - ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకొని పనిచేసే సామర్థ్యం ఉండాలి. ఇతరులతో కలిసి పనిచేసే నేర్పు తప్పనిసరి. - మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రోగ్రామర్స్, ఇలస్ట్రేటర్స్, డిజైనర్లు, స్టోరీ బోర్డు ఆర్టిస్టులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యానిమేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నోయిడా... వెబ్సైట్: https://www.bitmesra.ac.in/ - ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్(ఐడీసీ), ఐఐటీ-ముంబయి... వెబ్సైట్: http://www.idc.iitb.ac.in/ మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్డ్ సినిమాటిక్స్... వెబ్సైట్: ww.maacindia.com - టూంజ్ అకాడమీ-తిరువనంతపురం... వెబ్సైట్: http://toonzacademy.com/


