Bigg Boss 10: అగ్ని పరీక్ష నుంచి హౌస్‌లోకి..ఎవరీ అమన్?
బిగ్‌బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్‌గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్‌లోకి వెళ్లాడు. అయితే సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పోలిస్తే అమన్‌కు అంతగా పరిచయం లేకపోవడంతో.. అసలు ఎవరీ అమన్? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ముఖ్యంగా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో తనదైన శైలిలో ఆకట్టుకున్న అమన్.. ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.అమన్ మసూద్ మోడల్, డిజిటల్ క్రియేటర్, సోషల్ మీడియా పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన కంటెంట్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో కనిపిస్తూ వచ్చారు. నటన, మోడలింగ్‌పై ఆసక్తితో పాటు డిజిటల్ కంటెంట్ రంగంలోనూ యాక్టివ్‌గా ఉన్నారు.అయితే అమన్‌కు అసలు గుర్తింపు తెచ్చింది మాత్రం ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2’. బిగ్‌బాస్ తెలుగు 10లో కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి అవకాశం దక్కించుకునేందుకు నిర్వహించిన ఈ సెలెక్షన్ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకోని..ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అమన్ ఆకట్టుకుంటాడా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది.